Star hero
-
చింపాంజీ దాడి.. ఆ హీరోనే రక్షించాడు: ఆమిర్ ఖాన్
సినిమా షూటింగ్లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓసారి చావు అంచులదాకా వెళ్లొచ్చాడట! ఆ సమయంలో అజయ్ దేవ్‌గణ్ అతడిని కాపాడాడు. వీళ్లిద్దరూ 1997లో వచ్చిన కామెడీ మూవీ ఇష్క్‌లో నటించారు. కాజోల్, జూహీ చావ్లా హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు.చింపాంజీ దాడితాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమిర్ ఖాన్, అజయ్ 'ఇష్క్' మూవీ షూటింగ్లో జరిగిన ఓ ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ముందుగా ఆమిర్ మాట్లాడుతూ.. మేము తరచూ కలుసుకోము. కానీ కలుసుకున్నప్పుడు మాత్రం అజయ్ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు. ఇష్క్ సినిమాలో ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు ఒక చింపాజీ సడన్‌గా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అన్నాడు. పారిపోండి అంటూ ఒకటే పరుగుఇంతలో అజయ్ కలుగజేసుకుంటూ.. చింపాజీ కుదురుగానే కూర్చుంది. ఆమిర్ ఎప్పుడైతే దానిపై నీళ్లు చిలకరించి విసుగు తెప్పించాడో అప్పుడే సమస్య మొదలైంది. అది వెంటపడటంతో పారిపోండి పారిపోండి అని అరుస్తూ పరిగెత్తాడు అని తెలిపాడు. అప్పుడు నన్ను అజయే రక్షించాడంటూ ఆమిర్ పగలబడి నవ్వాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి పిలుపు.. ఆ అవమానాలు నా వల్ల కాదు: నటుడు -
హీరో సూర్య తలకు గాయం.. నిర్మాత క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వర్కింగ్ టైటిల్ సూర్య44 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో హీరో సూర్యకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయనకు తలకు బలమైన గాయమైనట్లు కోలీవుడ్‌లో వార్తలు రావడంతో ఫ్యాన్స్‌కు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్న ట్విటర్ వేదికగా పంచుకున్నారు.నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా సూర్య గాయంపై స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని.. అయితే చిన్నదేనని తెలిపారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా.. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా అక్టోబరు 10న విడుదల కానుంది.Dear #AnbaanaFans, It was a minor injury. Pls don’t worry, Suriya Anna is perfectly fine with all your love and prayers. 🙏🏼— Rajsekar Pandian (@rajsekarpandian) August 9, 2024 -
స్టార్ హీరో తనయుడు.. ఒక్క సినిమాతో తెగ నచ్చేశాడు! (ఫోటోలు)
-
స్టార్ హీరో ఒంటరిగా రమ్మని పిలిచాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ అనగానే కలల ప్రపంచమని మనందరికీ తెలుసు. అంతే కాదు ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవొచ్చు. మరి ముఖ్యంగా హీరోయిన్గా రాణించాలంటే కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న వారే. తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇషా కొప్పికర్.. ఈ పేరు తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ లాంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌కు చెందిన బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించి ఆకట్టుకుంది. చివరిసారిగా శివ కార్తికేయన్ నటించిన అయలాన్ చిత్రంలో మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ తనకెదురైన షాకింగ్ అనుభవాన్ని వెల్లడించింది. 18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు వివరించింది.ఇషా మాట్లాడుతూ.. "ఒక నటుడు డ్రైవర్ లేకుండా అతన్ని ఒంటరిగా కలవమని అడిగాడు. ఇప్పటికే నాపై చాలా రూమర్స్ ఉన్నాయి. అందుకే ఎవరికైనా తెలిస్తే మరిన్ని రూమర్స్ సృష్టిస్తారని నన్ను రిక్వెస్ట్ చేశాడు. దీంతో నేను వెంటనే అతని విజ్ఞప్తిని తిరస్కరించా. అతనెవరో కాదు.. ఆ టైంలో అతను బాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్నారు.' అని తెలిపింది .అంతే కాదు గతంలో తనను చాలామంది అసభ్యంగా తాకేవారని ఇషా కొప్పికర్ వెల్లడించింది. పని కావాలంటే హీరోలతో స్నేహంగా మెలగాలని కొందరు సలహాలు కూడా ఇచ్చారని తెలిపింది. తాను 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని నటి తెలిపింది. కాగా.. ఇషా 1998లో ఏక్ థా దిల్ ఏక్ థీ ధడ్కన్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో టిమ్మీ నారంగ్‌ను పెళ్లాడిన ఆమె.. 14 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. -
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
కోలీవుడ్ హీరో ధనుశ్ తన మంచి మనసును చాటుకున్నారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన భవనానికి రూ. కోటి విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్‌ను నటుడు నాజర్‌కు అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ వెల్లడించింది.కాగా.. ప్రస్తుతం నటుడు నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తి కోశాధికారిగా నడిగర్ సంఘంలో పని చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు భవనం కోసం విరాళాలు అందచేశారు. కమల్ హాసన్, విజయ్‌లు గతంలోనే రూ.కోటి సాయమందించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికి నిర్మాణం పూర్తి చేయనున్నారు. కాగా.. ధనుశ్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నారు. అంతేకాకుండా స్వీయ దర్శకత్వంలో రాయన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. -
ఆ స్టార్ హీరో సలహాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిరంజీవి (ఫోటోలు)
-
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రేర్ పిక్స్..
-
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర వివాహా వార్షికోత్సవ వేడుక (ఫొటోలు)
-
వెంకటేశ్ చిత్రంలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సైంధవ్. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రంలో మరో హీరో నటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి) ఆ హీరోకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఆర్య ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్లో ఆర్య లుక్ ఫ్యాన్సను తెగ ఆకట్టుకుంటోంది. తుపాకీ చేతపట్టి ఆర్య నడుస్తూ కనిపిస్తోన్న లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. కాగా.. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 22న సైంధవ్ విడుదల కానుంది. (ఇది చదవండి: రక్షాబంధన్ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!) Meet the talented @arya_offl as MANAS from #SAINDHAV 🔥#SaindhavOn22ndDEC @Nawazuddin_S@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @maniDop @Garrybh88 @tkishore555 @NeerajaKona @artkolla @UrsVamsiShekar #Venky75 pic.twitter.com/6TlHJGGQRy — Venkatesh Daggubati (@VenkyMama) August 30, 2023 -
రోజుకో కారు మెయింటెన్ చేసిన స్టార్ హీరో.. చివరి రోజుల్లో మురికివాడలో
డబ్బుతో ఏం చేస్తారు? ఇదేం ప్రశ్న అనుకునేరు.. డబ్బును అందరూ ఒకేలా వాడరు. కొందరు పొదుపు చేస్తారు, కొందరు ఖర్చు చేస్తారు, మరికొందరేమో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. బోలెడంత డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువశాతం జనాలు విలాసాలకే వినియోగిస్తుంటారు. ఇలా ఉన్నదంతా ఖర్చు పెట్టి చివరికి కడు పేదరికాన్ని గడిపిన సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంది. అందులో ఒకరే బాలీవుడ్ స్టార్ హీరో భగవాన్ దాదా. మిల్లులో పనిచేసి.. ఈయన కార్మికుడు, నటుడు, డ్యాన్సర్, దర్శకుడు, నిర్మాత! భగవాన్ దాదా అసలు పేరు భగవాన్ ఆబాజీ పలావ్. కుస్తీ పోటీల్లో ప్రతిభ చూపిన ఇతడిని అందరూ ముద్దుగా భగవాన్ దాదా అని పిలిచుకునేవారు. మొదట ఈయన బాంబేలోని వస్త్ర మిల్లులో పని చేశాడు. విరామం లేకుండా పని చేస్తున్న ఈయనకు ఎప్పటికైనా సినిమాల్లోకి రావాలన్న ఆశ, ఆసక్తి రెండూ ఉండేవి. ఈ ఆసక్తితోనే సినిమా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయడం ప్రారంభించాడు. చిన్న సినిమాలతో హిట్ చిత్రయూనిట్‌కు భోజనం సమకూర్చడం దగ్గరి నుంచి నటీనటుల దుస్తుల ఎంపిక వరకు అన్నీ తనే స్వయంగా చూసుకుని బడ్జెట్ పెరగకుండా జాగ్రత్తపడేవాడు. 1938లో బహదూర్ కిసాన్ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. తర్వాత చిన్నాచితకా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అవి సక్సెస్ కావడంతో తక్కువ కాలంలోనే అతడి పేరు మార్మోగిపోయింది. ఈ ధైర్యంతో భగవాన్ నిర్మాతగానూ మారాడు. ప్రేమ, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. రోజుకో కారు, అతి పెద్ద బంగ్లా అయితే ఏదైనా సామాజిక చిత్రం తీయమని 1951లో రాజ్‌కపూర్ సలహా ఇవ్వడంతో అల్బెలా తీశాడు. ఇది ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా అందులోని షోలా జో భడ్కే అనే పాటకు భగవాన్ వేసిన స్టెప్పులు హైలైట్ అయ్యాయి. బాలీవుడ్లో గొప్ప డ్యాన్సర్‌గా ఇతడిని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇకపోతే జమేలా, భాగం భాగ్ అనే సూపర్ హిట్స్ బాలీవుడ్‌కు అందించాడు. ఊహించని విజయాలతో అతడికి పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చింది. ఒకేసారి స్టార్డమ్ స్టేటస్ రావడంతో విలాసాలకు బాగా ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో ముంబై జుహులో 25 గదులు ఉన్న పెద్ద బంగ్లా కొని అందులోనే నివసించాడు. వారం రోజులపాటు రోజుకో కారులో తిరిగేలా ఏడు లగ్జరీ కార్లను మెయింటైన్ చేశాడు. భార్య నగలు కూడా అమ్మేయాల్సిన దుస్థితి కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. అతడి సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. 1960 నుంచి భగవాన్.. హీరో స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచే స్థాయికి పడిపోయాడు. నెమ్మదిగా ఆ కాస్త అవకాశాలు రావడం కూడా కనుమరుగైపోయాయి. ఆర్థిక అవసరాల కోసం ఒక్కో కారును, ఇంటిని, భార్య నగలను కూడా అమ్మేయాల్సి వచ్చింది. చివరికి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో మురికివాడలో జీవనం కొనసాగించాడు. 2002లో 89 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే! రెండు పెళ్లిళ్లు ఫెయిల్.. ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
'ఐ యామ్ నాట్ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్'... ఆసక్తిగా టీజర్ ప్రోమో
కిచ్చా సుదీప్ టాలీవుడ్ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయకునిగా నటించారు. ఇటీవల కిచ్చా సుదీప్ హీరోగా కన్నడ చిత్రం విక్రాంత్ రోణాలో నటించారు. ఈ చిత్రం తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. (ఇది చదవండి: కోలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్) తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా46 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ది డెమోన్ వార్ బిగిన్స్ ప్రోమో పేరుతో ఈ టీజర్‌ను విడుదల చేశారు. వి క్రియేషన్స్ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిచ్చా నేరుగా తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బాడీలో బుల్లెట్స్ తీస్తూ మరింత వైల్డ్‌గా కిచ్చా సుదీప్ టీజర్లో కనిపించారు. ఈ టీజర్లో 'యుద్ధాన్ని ఆరంభించే వాడు నాకు నచ్చడు.. యుద్ధానికి భయపడి పారిపోయేవాడు నాకు నచ్చడు. రంగంలో దిగి శత్రువుని వెంటాడి, వేటాడి.. వాళ్లు రక్తంతో పరిగెత్తి పారిపోయేదాన్ని చూసేవాడు నేను.. దిగితే దయ, క్షమా, సంధానం లాంటిది ఏదీ ఉండదు.. ఐ యామ్ నాట్ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్..' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కాగా.. ఈ చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఇటీవల వరుసగా అసురన్, కర్ణన్, నానే వరువేన్ చిత్రాలు నిర్మించారు. వీటిలో అసురన్, కర్ణన్ చిత్రాలు సూపర్ హిట్ కాగా.. నానే వరువేన్ చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. (ఇది చదవండి: హాలీవుడ్ హారర్ మూవీ ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ రిలీజ్ డేట్ ఇదే) -
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి..?
-
ఆ ట్విస్ట్‌లు తెలుసుకోవడానికి వచ్చేస్తున్నారీ సైంటిస్ట్స్
అంతరిక్షంలో ఏం ఉందో తెలుసుకోవాలి.. కావాలి ఓ సైంటిస్ట్. అంతరిక్షానికి పంపడానికి రాకెట్ కావాలి.. ఆ రాకెట్ తయారీకి కావాలి ఓ సైంటిస్ట్. కళ్లు చెదిరే రంగు రాయి దొరికింది. ఆ రాయి విలువ తెలియాలంటే కావాలి ఓ సైంటిస్ట్. సైంటిస్ట్‌లు చేసే ట్విస్ట్‌లు భలే ఉంటాయి. సిల్వర్ స్క్రీన్‌పై ఆ ట్విస్ట్‌లు చాలా మజానిస్తాయి. నిర్మాణంలో ఉన్న కొన్ని చిత్రాల్లో సైంటిస్టులుగా కనిపించనున్న స్టార్స్ ఎవరో చూద్దాం. మొన్నామధ్య బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ చేరుకుని పరిశోధనలు చేశారు. ‘ప్రాజెక్ట్ కె’ సక్సెస్ కావడం కోసమే అమితాబ్ ఈ ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారట. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇది సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ అని, ఈ చిత్రానికి టైమ్ ట్రావెల్ టచ్ ఉందని వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తారన్నది తాజా వార్త. పరిశోధనల్లో భాగంగా అమితాబ్ చేసే ఓ ప్రయోగం వల్లే ‘ప్రాజెక్ట్ కె’ కథ మరింత ఆసక్తికరంగా సాగుతుందట. ఈ ‘ప్రాజెక్ట్ కె’లో సైంటిస్ట్‌గా అమితాబ్ ఇచ్చే ట్విస్టులు చూడాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక హిందీలో రూపొందిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్ కపాడియా ప్రధాన తారాగణంగా నటించారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్ర దర్శకుడు. ఈ మూవీలో నాగార్జున పురాతత్త్వ శాస్త్రవేత్తగా కనిపిస్తారు. నాగార్జున చేసే పరిశోధనల నేపథ్యంలోనే ‘బ్రహ్మాస్త్ర’ కథ మొదలవుతుందట. అలాగే ఈ చిత్రంలో షారుక్ ఖాన్ ఓ కీలక పాత్ర చేశారు. షారుక్ సైంటిస్ట్ అనేది బాలీవుడ్ టాక్. శివలో (‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ పాత్ర పేరు) అతీంద్రీయ శక్తులు ఉన్నాయని సైంటిస్ట్‌గా ఈ సినిమాలో షారుక్ ఇచ్చే ట్విస్ట్‌తోనే కథ అసలు మలుపు తిరుగుతుందట. నాగార్జున, షారుక్ సైంటిస్ట్‌లుగా ఆడియన్స్‌కు ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తారనేది ఈ ఏడాదిలోనే చూడొచ్చు. షారుక్ ఖాన్, మాధవన్ ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ను ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా విడుదల కానుంది. సేమ్ టు సేమ్ ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున చేసిన పురాతత్త్వ శాస్త్రవేత్తగానే అక్షయ్ కుమార్ నటించారు. అక్షయ్ కుమార్ హీరోగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో హిందీలో ‘రామ సేతు’ అనే చిత్రం రూపొందింది. ఇందులోనే పురాతత్త్వ శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ నటించారు. రావణుడి బారి నుండి తన భార్య సీతను రక్షించడానికి భారతదేశం, శ్రీలంక మధ్య రాముడు నిర్మించినట్లుగా చెప్పుకుంటున్న రామసేతు అనే బ్రిడ్జ్ ఉన్న మాట నిజమా? కాదా? అనే అంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. ఈ బ్రిడ్జ్‌ను పూర్తి చేయడానికి శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ ఏం చేశారు? అనే అంశంతో కథ సాగుతుందట. హీరోయిన్లుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేశారు సత్యదేవ్. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఖగోళ శాస్త్రవేత్త, ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. కొన్ని అభియోగాల వల్ల నంబి నారాయణన్ ఇస్రో నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఈ పరిణామాలు, ఇస్రోలో ఆయన చేసిన పరిశోధనలు వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో నంబి నారాయణన్‌గా మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం వహించి, నిర్మించారు. నటి సిమ్రాన్ కీలక పాత్ర చేశారు. ‘బ్రహ్మాస్త్ర’లో ఓ గెస్ట్ రోల్ చేసినట్లుగానే ఈ చిత్రంలో కూడా షారుక్ అతిథిగా కనిపిస్తారని టాక్. అక్షయ్ కుమార్, హన్సిక ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను ఈ ఏడాది జూలై 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు హీరోయిన్ హన్సిక ఓ సైన్స్ ల్యాబ్‌లో సైంటిస్ట్‌గా జాయినయ్యారు. తన నెక్ట్స్ ఫిల్మ్ కోసమే హన్సిక సైంటిస్ట్‌గా మారారు. కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేత్ర అనే యంగ్ సైంటిస్ట్‌గా కనిపిస్తారు హన్సిక. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఆరంభమైంది. ఈ చిత్రం కోసం చెన్నైలోని ఓ స్టూడియోలో ఓ భారీ సైన్స్ ల్యాబ్ సెట్ వేశారు. షూటింగ్‌ను ఏప్రిల్ కల్లా పూర్తి చేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ పేర్కొంది. వీరితోపాటు మరికొందరు సినీ తారలు వెండితెర సైంటిస్టులుగా కనిపించనున్నారు. -
స్టార్ హీరో మిహిర్ దాస్ ఇకలేరు.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
భువనేశ్వర్: ఓలీవుడ్ స్టార్ హీరో, యాక్టర్ మిహిర్ దాస్(63) మంగళవారం కన్నుమూశారు. కటక్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో ఓలీవుడ్ సినీ కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం కొన్నిరోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. బహుళ అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. మయూర్భంజ్ జిల్లాలోని బరిపదలో 1959 ఫిబ్రవరి 11వ తేదీన మిహిర్ దాస్ జన్మించారు. 1979లో విడుదలైన తొలి కమర్షియల్ చిత్రం మధుర విజయ్ సూపర్ హిట్ కావడంతో ఆయన దశ తిరిగింది. లక్ష్మీ ప్రతిమ, ఫెరి ఆ మో సున్నా భొవుణి చలన చిత్రాలు ఆయనకు రాష్ట్ర ఫిల్మ్ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు సాధించిపెట్టాయి. రాఖీ బంధిలి మో రొఖిబొ మొనొ, ప్రేమొ ఒఢెయి ఒక్షొరొ చలన చిత్రాల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును ఆయన అందుకున్నారు. ప్రేక్షక హృదయాల్లో స్థానం సుస్థిరం.. అత్యుత్తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మిహిర్ దాస్ స్థానం సుస్థిరం సంతాపం ప్రకటించారు. ఒడియా చలన చిత్ర రంగం ప్రముఖ నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. –ప్రొఫెసరు గణేషీ లాల్, రాష్ట్ర గవర్నరు ఉన్నత శ్రేణి నటుడిని కోల్పోయింది.. రాష్ట్ర చలన చిత్ర రంగం ఉన్నత శ్రేణి నటుడిని కోల్పోయింది. బహుముఖ నటుడిగా మిహిర్ దాస్ పేరొందారు. 3 దశాబ్దాలుగా తిరుగులేని నటుడిగా హవా కొనసాగించి, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన లేరన్న వార్త మనసుని కలచివేసింది. – బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఒడియా చిత్ర రంగానికి తీరని లోటు.. మిహిర్ దాస్ మరణం ఒడియా చలన చిత్ర రంగానికి తీరని లోటు. తనదైన నటన, ప్రతిభాపాటవాలతో భావితరాలకు ప్రేరణగా నిలిచారు. ఓలీవుడ్ ఓ మంచి నడుడిని కోల్పోయింది. – నవీన్ పట్నాయక్, ముఖ్యమంత్రి అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన నటుడు.. ఓలీవుడ్లో అత్యంత ప్రేక్షాకాదరణ ఉన్న నటుడిగా మిహిర్ గుర్తింపు సాధించారు. ఆయన నటనతో ఒడియా సినిమాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు. ఆయన మరణం తీరని లోటు – సూర్యనారాయణ పాత్రో, రాష్ట్ర శాసనసభ స్పీకరు -
స్టార్ హీరోపై నెటిజన్ల ఫైర్.. ధీటుగా కౌంటర్ ఇచ్చిన నటుడు
లక్నో: తన మీద వస్తున్న ట్రోల్సింగ్పై బెంగాల్ స్టార్ హీరో ప్రోసెన్‌జీత్ ఛటర్జీ స్పందించారు. ఒక నటుడిగా కాకుండా దేశ పౌరుడిగా ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసినట్లు స్పష్టంచేశారు. ప్రజలకు సేవలు అందించే వారు మరింత భాద్యతయుతంగా ఉండాలనే ఉద్ధేశ్యంతోనే ఇలా చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల స్రోసెన్జీత్ స్వీగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయగా.. కానీ యాప్ వారు ఫుడ్ డెలివరీ చేయకుండానే.. డెలివరీ ఇచ్చినట్లు స్టేటస్ పంపించారు. డెలివరీ యాప్ ఆర్డర్‌ను అందించడంలో విఫలమైందంటూ ప్రధానమంత్రి, పశ్చిమ బెంగాల్ సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నట్లు ప్రోసెన్జిత్ లేఖలో పేర్కొన్నాడు. చదవండి: స్టార్ హీరోపై ట్రోలింగ్: ‘స్విగ్గీ వాళ్లు నా డబ్బులు రిటర్న్ చేయలేదు’ కాగా ఈ లేఖ రాయడం నటుడిపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా.. ఇదే దొరికిందా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘చాలా పెద్ద సమస్య.. దయచేసి బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి’ అంటూ నటుడిని ట్రోలింగ్‌కు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రోసెన్ జీత్ స్పందించారు. ‘ప్రజలకు సేవలు అందించే ప్రజలు మరింత భాద్యతయుతంగా ఉండాలనే ఉద్ధేశ్యంతోనే తాను ప్రధాని నరేంద్రమోదీ, సీఎం మమతాను ట్వీట్లో ప్రస్తావించానని తెలిపారు. ‘ఇటీవల కాలంలో అందరూ ఆన్లైన్ యాప్స్‌పైనే ఆధారపడుతున్నారు. నేను కూడా అంతే.. అయితే కొంతమంది ఎవరైతే యాప్స్ ద్వారా ఫుడ్, మెడిసిన్ అందిస్తున్నారో వారు మరింత భాద్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి సమయానికి మెడిసిన్ డెలివరీ అవ్వకుండే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో వంట చేయలేని, గెస్ట్స్ వచ్చిన సందర్భాల్లో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. అలాంటప్పుడు ఫుడ్ డెలీవరీ అవ్వకముందే అయినట్లు చూపిస్తే వారి పరిస్థితి ఏంటి. ప్రజలు ఆకలితో అలాగే ఉంటారా?. ఇదంతా ఆహారం కోసం. నేను ఒక నటుడిగా ట్వీట్ చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యను ఎవరూ ఎదుర్కోవద్ధనే పౌరునిగా చేశాను.’ అని క్లారిటీ ఇచ్చారు. -
స్టార్ హీరోపై ట్రోలింగ్: ‘స్విగ్గీ వాళ్లు నా డబ్బులు రిటర్న్ చేయలేదు’
కోల్‌కతా: ప్రస్తుతం దేశంలో ఆర్థికమాంద్యం, కోవిడ్, ఇంధన ధరల పెంపు, నిరుద్యోగం, వాయు కాలుష్యం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఓ వైపు విపక్షాలు.. ఆర్థిక, రాజకీయ రంగ నిపుణులు ఈ సమస్యల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్హీరో మాత్రం ఫుడ్ డెలివరీ యాప్‌ల తీరు సరిగా లేదు.. వాటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ.. ఏకంగా ప్రధాని, సీఎంలకు లేఖ రాశాడు. ఇది వైరలవ్వడమే కాక దేశంలో ఇన్ని సమస్యలుండగా.. నీకు ఇంత చిల్లర విషయం దొరికిందా ఫిర్యాదు చేయడానికి అంటూ సదరు నటుడిపై దుమ్ముత్తెపోస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ సూపర్ స్టార్ ప్రోసెన్జిత్ ఛటర్జీ శనివారం నరేంద్ర మోదీకి రాసిన లేఖ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ లేఖలో స్విగ్గి యాప్‌పై మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశాడు. లేఖలో ప్రసుత్తం జనాలు ఫుడ్ డెలివరీ యాప్‌ల మీద బాగా ఆధారపడుతున్నారు. దీన్ని అలుసుగా చేసుకుని వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపాడు ప్రోసెన్జిత్. (చదవండి: డెలివరీ బాయ్ నిర్వాకం: ‘మీ ఫుడ్‌ని చెత్తలో పడేశాను.. వెళ్లి తెచ్చుకోండి’) ‘‘కొన్ని రోజలు క్రితమే నేను స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాను. కానీ వారు నాకు ఆహారం డెలివరీ చేయకుండానే.. ఫుడ్ డెలివరీ ఇచ్చినట్లు స్టేటస్ పంపించారు. దీని గురించి స్విగ్గి యాప్‌లో ఫిర్యాదు చేసి.. నా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాను. కానీ వారు నిరాకరించారు. ప్రస్తుతం దేశంలో ఈ సమస్య బాగా పెరుగుతుంది. కనుక గౌరవ ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను’’ అని ప్రోసెన్జిత్ లేఖలో పేర్కొన్నాడు. (చదవండి: వెలకట్టలేని సెల్యూట్.. కోట్లు పెట్టినా దొరకని సంతోషం ) ఈ లెటర్ కాస్త వైరల్ కావడమే కాక ఓ రేంజ్లో ట్రోల్ అవుతుంది. ‘‘నువ్వేం హీరోవు నాయనా.. ఓ వైపు దేశంలో ఎన్నో క్లిష్ట సమస్యలు ఉంటే.. నీ ఈ చెత్త ప్రాబ్లం కోసం ప్రధానికి లేఖ రాస్తావా.. కొంచెం కూడా బుద్ధి లేదా’’ అంటూ ఓ రేంజ్లో విమర్శిస్తున్నారు నెటిజనుల. చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా' -
నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా?
List Of Kannada Star Heroes Who Died At Young Age: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ అకాల మరణాన్ని అభిమానులు సహా సినీ ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో నెంబర్1 హీరోలుగా ఉన్నవారు ఇలా అకాల మరణం చెందడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ పలువురు కన్నడ స్టార్ హీరోలు హఠాన్మరణం చెందారు. ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ విషయంలోనే ఇదే జరిగింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్29న గుండెపోటుతో మరణించారు. జిమ్ చేస్తుండగా తీవ్రమైన అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్ హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా 2020 జూన్7న గుండెపోటుతో కన్నుమూశారు. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే 39ఏళ్ల వయసులో ఆయన మరణించారు. చనిపోయే సమయానికి చిరంజీవి సర్జా చేతిలో సుమారు మూడు సినిమాలు ఉన్నాయి. ఈయన యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 2018లో ప్రముఖ నటి మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్న చిరంజీవి సర్జా..పెళ్లైన రెండేళ్లకే మేఘనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2009లో కన్నడ మెగాస్టార్ విష్ణువర్ధన్ 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. చనిపోయే సమయానికి ఆయన అగ్ర హీరో. 200కు పైగా సినిమ్లాల్లో నటించాడు. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ తర్వాత అంతటి స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. అయితే ఆయన కూడా పునీత్ మాదిరిగానే గుండోపోటుతో మరణించాడు. ఇక 1990లో శంకర్ నాగ్ అనే స్టార్ హీరో కూడా కేవలం 35 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి కన్నడలో స్టార్ హీరో. వరుస విజయాలతో చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. శంకర్ నాగ్ చనిపోయిన 4 ఏళ్ల వరకు ఆయన నటించిన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయంటే అతడి స్టార్ స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో శంకర్ నాగ్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం. ఒక సినిమా షూటింగ్లో భాగంగా కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు ఆయన. స్టేజ్ నటుడి నుంచి సినిమా నటుడిగా ఎదిగిన విజయ్ సంచారి. కన్నడ సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో సైతం నటించిన సంచారి విజయ్ 2021 జూన్ 15న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శాండల్‌వుడ్ చార్మింగ్ హీరో సునీల్ 1994 జులై 24న బాగల్కోట్ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సమయంలో ఆయన వయస్సు 30 సంవత్సరాలు. చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన సునీల్ మరణం అభిమానులను షాక్‌కి గురిచేసింది. -
స్టార్ హీరో పూరిగుడిసెకు రావడంపై పట్టలేని ఆనందం
-
అలా చేస్తే కమిట్మెంట్ ఇస్తానని చెప్పా : నటి ఖుష్బూ
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక కోలీవుడ్‌లో ఖుష్బూకున్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఎంతగానో ఆరాధించే అభిమానులు ఖుష్బూ కోసం ఏకంగా గుడి కూడా కట్టించారు. తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్గా ఖుష్బూ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అనూహ్యంగా ఓడిపోయింది. తాజాగా తన సినీ కెరీర్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్గా ఉన్న సమయంలో తెలుగులో ఓ స్టార్ హీరో తనను కమిట్మెంట్ అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరో అయి ఉండి అలా కమిట్మెంట్ అడిగేసరికి చాలా కోపం వచ్చిందని, దాంతో మీ కూతుర్ని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే నేను కూడా కమిట్మెంట్ ఇస్తానని సదరు హీరోకు చెంప చెళ్లుమనిపించే ఆన్సర్ ఇచ్చిందట. ఖుష్బూ చెప్పిన సమాధానం విని ఆ హీరో షాక్ అయ్యాడని, ఇక అప్పటి నుంచి తామిద్దరి మధ్యా మాటలు లేవని ఖుష్బూ పేర్కొంది. అయితే తనను కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ హీరో పేరు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో ఈ స్టార్ హీరో ఎవరు అయ్యింటారా అని నెటిజన్లు సందేహంలో మునిగిపోయారు. ఖుష్బూ తెలుగులో చేసింది కూడా తక్కువ సినిమాలే కావడం, వాటిలో కూతుళ్లు ఉన్న స్టార్ హీరోలు ఎవరుంటారబ్బా అని నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ఖుష్బూ నటించిన చివరి సినిమా అజ్ఞాతవాసి. -
చిన్న సినిమాకి బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరో
నూతన దర్శకుడు విద్యాసాగర్ రాజు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రచయిత’. థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల నిర్మిస్తున్నారు. ప్రీ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన రచయిత టీం.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకున్నారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూలిపల్ల మాట్లాడుతూ.. ‘స్వచ్చమైన-అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. భయం అనేది మనిషి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాగలదు, ఎలా ప్రభావం చూపగలదు అనేది ప్రధాన కథాంశం. 1950 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. పీరియాడిక్ ఫిలిమ్ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ఖర్చుతో రూపొందించాం. సంచితా పడుకోనే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం వైజాగ్ లో వేసిన భారీ సెట్, ఆ సెట్ లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆశ్చర్యపరుస్తాయి. మా డైరెక్టర్ కమ్ హీరో విద్యాసాగర్ నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాడు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నాం. ఇకపోతే.. మా సినిమాకి ఒక స్టార్ నటుడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. సినిమాకి బ్రాండ్ షిప్ చేయడం అనేది ఇదే మొదటిసారి’ అన్నారు. -
శ్రుతిమించుతున్న అభిమానం
కోలీవుడ్ సినీ అభిమానుల మధ్య ఉన్న విభేదాలు శ్రుతి మించుతున్నాయి. ఇన్నాళ్లు సినిమాల రిలీజ్ సమయంలో విమర్శలతో సరిపెట్టుకునే స్టార్ హీరోల అభిమానులు తాజాగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో హీరోలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఎదురైంది. కోలీవుడ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌కు పోటీ పడుతున్న అజిత్‌ను ఇతర హీరోల ఫ్యాన్స్ పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం 'వేదలం' సినిమా పనుల్లో బిజీగా ఉన్న అజిత్‌కు తీవ్ర గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు, ఆ అకౌంట్ ద్వారా అజిత్‌కు హార్ట్ ఎటాక్ అంటూ ప్రచారం చేశారు. అయితే వెంటనే స్పందించిన సురేష్ చంద్ర, అది తన అకౌంట్ కాదని వివరణ ఇచ్చినా అప్పటికే ఆ వార్తను చాలామంది ఫ్యాన్స్ షేర్ చేయడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీస్‌లకు ఫిర్యాదు చేసిన సురేష్, ఈ ప్రచారం మొదలుపెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అభిమానుల ఆందోళనను గమనించిన అజిత్.. తన వేదలం సినిమా ఫైనల్ ఎడిటింగ్ జరగుతున్న స్టూడియోలో అభిమానులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. దీంతో అభిమానులు అజిత్ ఆరోగ్యం విషయమై వచ్చిన వార్తలు ఏవీ నిజం కాదని ఊపిరి పీల్చుకున్నారు. -
ఫార్ములాను బ్రేక్ చేసిన యంగ్ హీరో
ఇండస్ట్రీలో స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలకు ఎదో ఒక స్టార్ ట్యాగ్ జోడించటం సినీ వర్గాలకు అలవాటు. అందుకే కొంతమంది యంగ్ హీరోలకు కెరీర్ స్టార్టింగ్ నుంచే స్టార్ ట్యాగ్ వచ్చేసింది. పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, యంగ్ టైగర్, ఇలా చాలా మంది యంగ్ హీరోలు స్టార్ ఇమేజ్ కన్నా ముందే స్టార్ ట్యాగ్ సాదించేశారు. అయితే వారసత్వంతో అడుగుపెట్టిన హీరోలకు మాత్రమే ఇలాంటి చాన్స్ ఉంటుంది. ఓ యంగ్ హీరో మాత్రం ఈ ఫార్ములాను బ్రేక్ చేశాడు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని తన తాజా చిత్రం భలే భలే మొగాడివోయ్ తో స్టార్ గా మారిపోయాడు. అలామొదలైంది, పిల్లజమిందార్, ఈగ లాంటి సూపర్ హిట్స్ తో అలరించిన నానికి, భలే భలే మొగాడివోయ్ టీం న్యాచురల్ స్టార్ ట్యాగ్ ను అందించింది. ఈ శుక్రవారం రిలీజ్ అయిన భలే భలే మొగాడివోయ్, హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో నాని కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమాతో తన కామెడీ టైమింగ్ కూడా ప్రూవ్ చేసుకున్న ఈ నాచురల్ స్టార్ ముందు ముందు మరిన్ని కొత్త తరహా పాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. -
బాలీవుడ్‌కి స్వర తరంగం
స్లో అండ్ స్టడీ అన్న సూత్రాన్ని ఫాలో అవుతూ నెమ్మదిగా నడుస్తున్న తెలుగు సినిమా సంగీతానికి కొత్త ఊపు తీసుకు వచ్చిన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ప్రతి సినిమాలో తన మార్క్ కనిపించేలా హై టెంపో మ్యూజిక్‌తో అలరించే ఈ స్వర తరంగం మెలోడీస్ కంపోజ్ చేయటంలోనూ అంతే సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా దేవీ స్వరపరిచిన ఐటమ్ నంబర్ సాంగ్స్ కోసం బాలీవుడ్ స్టార్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. దక్షిణాదిన ప్రముఖ హీరోలతో పనిచేసిన దేవీ శ్రీ చాలా రోజులుగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు.. ఇప్పటికే చాలా సార్లు ఆ అవకాశం వచ్చినా.. సౌత్ సినిమాలతో బిజీగా ఉండటంతో బాలీవుడ్లో తన స్టాంప్ వేయలేకపోయాడు. సల్మాన్ హీరోగా నటించిన రెడీ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేసిన దేవీ, ఆ ఒక్క పాటతోనే బాలీవుడ్ జనాలను తన వైపు తిప్పుకున్నాడు. అయితే అప్పటి నుంచి హిందీలో ఫుల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నా ఇంత వరకు సెట్ అవ్వలేదు. తాజాగా దేవీ శ్రీ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లు ఓ వార్త చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. తెలుగు, తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ.... ఓ బాలీవుడ్ స్టార్ హీరో పట్టుపట్టడంతో దేవీ శ్రీ ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా పూర్తి వివరాలను అతడు త్వరలోనే ప్రకటించనున్నాడు. -
స్టార్ హీరోల నుంచే నేర్చుకున్నా
సినిమా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ను మాత్రమే ఇస్తుంది. అది తనను నమ్ముకునే వారికి చాలానే అందిస్తుంది. డబ్బు, కీర్తి సంఘంలో గౌరవం ఇలా చాలానే ఇస్తుంది. కాకపోతే కాస్త అదృష్టం, మరి కాస్త కృషి అవసరం అవుతుంది. ఆ తరువాత వారు ఏది చెప్పినా, చేసినా వింతలు, విశేషాలే. అలా మొన్నటి వరకు తమిళంలో విజయం కోసం ఆరాటపడిన నటి సమంత కత్తి చిత్రంతో దాన్ని చేజిక్కించుకున్నారు. అంతకుముందే టాలీవుడ్లో పలు విజయాలను మూటకట్టుకున్నారన్నది వేరే విషయం. తమిళంలో మాత్రం ఈ చెన్నై చిన్నదాన్ని టాప్‌లో నిలబెట్టింది కత్తి చిత్రమే. ప్రస్తుతం టాప్‌స్టార్స్ విజయ్, విక్రమ్, ధనుష్‌లతో నటిస్తూ మంచి జోష్‌లో ఉన్న సమంతకు సినిమాల్లోకి రాకముందు డాన్స్ రాదట. చదువుకునే రోజుల్లో పాఠశాల కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల పాట పాడమన్నా సిగ్గుతో పాడేదాన్ని కాదన్నారు. అసలు నలుగురు చేరిన చోట వెళ్లేదాన్నే కాదని చెప్పారు. అలాంటి తాను సినిమాలోకి వచ్చిన తరువాత స్టార్ హీరోల ద్వారానే డాన్స్ నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు షూటింగ్ స్పాట్లో ఎంతమంది మధ్యనైనా డాన్స్ చేయడానికి రెడీ అని ఈ భామ అన్నారు. తన సినీ జీవితం మధ్యలో కాస్త బ్రేక్ అయినా ప్రస్తుతం బాగానే సాగుతోందని సమంత అంటున్నారు. -
స్టార్ హీరోలతో మళ్లీ సమంత
కోలీవుడ్‌లో సూపర్ గేర్‌లో పరుగులు తీస్తున్న హీరోయిన్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం సమంత అనే. ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతుక్కుని సాధిస్తున్న నటి ఈ చెన్నై చిన్నది. సమంత ఇక్కడ తొలి రోజుల్లో నటించిన చిత్రాలన్నీ ప్లాప్లే. నిజం చెప్పాలంటే కోలీవుడ్ ఆమె అందుకున్న ఏకైక విజయం కత్తి చిత్రం ద్వారానే. ఆ చిత్రం తరువాత ఇక్కడ అవకాశాలు క్యూ కడుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాదు స్టార్ హీరోలతో అవకాశాలు రీపీట్ అవుతున్నాయి. విక్రమ్‌తో నటిస్తున్న 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ధనుష్‌కు జంటగా వేలై ఇల్లా పట్టాదారి -2 చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా అంజాన్ చిత్రం తరువాత సూర్యతో మరోసారి 24 చిత్రంలో జతకట్టారు. అలాగే ఆమెకు తమిళంలో తొలి విజయాన్ని అందించిన కత్తి చిత్రం తరువాత మరోసారి నటుడు విజయ్‌తో జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని రాజారాణి చిత్రం ఫేమ్ అట్లి దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టాదారి -2 చిత్రంలో నటిస్తున్న సమంత తదుపరి వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వడచెన్నై చిత్రంలో ఆయనతో నటించనున్నారు. ఇక విక్రమ్‌తో 10 ఎండ్రదుకుళే చిత్రంలో నటిస్తున్న సమంత ఆయన తదుపరి చిత్రంలోను హీరోయిన్ తనేనని సమాచారం. ఇలా వరుసగా స్టార్ హీరోల సరసన రిపీట్ అవుతున్న ఏకైక నటి సమంతనే కావచ్చు.