'ఐ యామ్ నాట్‌ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్'... ఆసక్తిగా టీజర్ ప్రోమో | Sudeep Kicha46 Movie Teaser Released Today | Sakshi
Sakshi News home page

Kicha46: 'యుద్ధానికి భయపడి పారిపోయేవాడు నాకు నచ్చడు'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్

Published Sun, Jul 2 2023 2:58 PM | Last Updated on Sun, Jul 2 2023 3:32 PM

Sudeep Kicha46 Movie Teaser Released Today - Sakshi

కిచ్చా సుదీప్ టాలీవుడ్‌ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయకునిగా నటించారు. ఇటీవల కిచ్చా సుదీప్ హీరోగా కన్నడ చిత్రం విక్రాంత్‌ రోణాలో నటించారు. ఈ చిత్రం తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది.

(ఇది చదవండి: కోలీవుడ్‌లో పాన్‌ ఇండియా మూవీతో ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్‌)

తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న కిచ్చా46 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ది డెమోన్ వార్ బిగిన్స్‌ ప్రోమో పేరుతో ఈ టీజర్‌ను విడుదల చేశారు. వి క్రియేషన్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిచ్చా నేరుగా తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  బాడీలో బుల్లెట్స్ తీస్తూ మరింత వైల్డ్‌గా కిచ్చా సుదీప్ టీజర్‌లో కనిపించారు. ఈ టీజర్‌లో 'యుద్ధాన్ని ఆరంభించే వాడు నాకు నచ్చడు.. యుద్ధానికి భయపడి పారిపోయేవాడు నాకు నచ్చడు. రంగంలో దిగి శత్రువుని వెంటాడి, వేటాడి.. వాళ్లు రక్తంతో పరిగెత్తి పారిపోయేదాన్ని చూసేవాడు నేను.. దిగితే దయ, క్షమా, సంధానం లాంటిది ఏదీ ఉండదు.. ఐ యామ్ నాట్‌ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్..' అనే డైలాగ్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కాగా.. ఈ చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌ థాను ఇటీవల వరుసగా అసురన్‌, కర్ణన్‌, నానే వరువేన్‌ చిత్రాలు నిర్మించారు. వీటిలో అసురన్‌, కర్ణన్‌ చిత్రాలు సూపర్‌ హిట్‌ కాగా.. నానే వరువేన్‌ చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 

(ఇది చదవండి: హాలీవుడ్‌ హారర్‌ మూవీ ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ రిలీజ్‌ డేట్‌ ఇదే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement