

కానీ రానురానూ మాస్ సినిమాలవైపే ఎక్కువ మొగ్గు చూపాడు. క్లాస్ మూవీస్‌కు ఎక్కువ వసూళ్లు రావడం లేదని, దీనివల్ల నిర్మాతలు నష్టపోవడం ఇష్టంలేదనే అలాంటి చిత్రాలు చేయడం లేదన్నాడు.

తాజాగా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ 2024కు హాజరైన చిరంజీవి.. తనకు ఓ స్టార్ హీరో అద్భుతమైన సలహా ఇచ్చాడని చెప్పాడు

'ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్స్ ఇప్పుడు లేరు..

ఉన్నవాళ్లంతా కొత్తవాళ్లే! అభిమానులే దర్శకులైతే వారిపై ఆధారపడటమే మంచిది.. మనల్ని ఎలా చూపించాలన్నది వారికే బాగా తెలుసు' అని రజనీకాంత్ చెప్పాడన్నాడు మెగాస్టార్.

అలా తన అభిమాని బాబీతో వాల్తేరు వీరయ్య మూవీ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టానన్నాడు.

