స్టార్‌ హీరో ఒంటరిగా రమ్మని పిలిచాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ | Star Hero Asked Me To Meet Him Alone Says Isha Koppikar Goes Viral, Deets Inside | Sakshi
Sakshi News home page

అసభ్యంగా తాకేవారు.. వారితో ఫ్రెండ్లీగా ఉండాలంటూ సలహాలు: హీరోయిన్

Published Fri, Jun 21 2024 5:28 PM | Last Updated on Fri, Jun 21 2024 6:12 PM

Star Hero Asked Me To Meet Him Alone Says Heroine Goes Viral

సినీ ఇండస్ట్రీ అనగానే కలల ప్రపంచమని మనందరికీ తెలుసు. అంతే కాదు ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవొచ్చు. మరి ముఖ్యంగా హీరోయిన్‌గా రాణించాలంటే కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న వారే. తాజాగా మరో హీరోయిన్‌ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 

ఇషా కొప్పికర్.. ఈ పేరు తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్‌లో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ లాంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌కు చెందిన బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించి ఆకట్టుకుంది. చివరిసారిగా శివ కార్తికేయన్ నటించిన అయలాన్‌ చిత్రంలో మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ తనకెదురైన షాకింగ్‌ అనుభవాన్ని వెల్లడించింది. 18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్‌ బారిన పడినట్లు వివరించింది.

ఇషా  మాట్లాడుతూ.. "ఒక నటుడు డ్రైవర్ లేకుండా అతన్ని ఒంటరిగా కలవమని అడిగాడు. ఇప్పటికే నాపై చాలా రూమర్స్‌ ఉన్నాయి. అందుకే ఎవరికైనా తెలిస్తే మరిన్ని రూమర్స్‌ సృష్టిస్తారని నన్ను రిక్వెస్ట్‌ చేశాడు. దీంతో నేను వెంటనే అతని విజ్ఞప్తిని తిరస్కరించా. అతనెవరో కాదు.. ఆ టైంలో అతను బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఉన్నారు.' అని తెలిపింది .

అంతే కాదు గతంలో తనను చాలామంది అసభ్యంగా తాకేవారని ఇషా కొప్పికర్‌ వెల్లడించింది. పని కావాలంటే హీరోలతో స్నేహంగా మెలగాలని కొందరు సలహాలు కూడా ఇచ్చారని తెలిపింది. తాను 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని నటి తెలిపింది. కాగా.. ఇషా 1998లో ఏక్ థా దిల్ ఏక్ థీ ధడ్కన్‌ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో టిమ్మీ నారంగ్‌ను పెళ్లాడిన ఆమె.. 14 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement