స్లో అండ్ స్టడీ అన్న సూత్రాన్ని ఫాలో అవుతూ నెమ్మదిగా నడుస్తున్న తెలుగు సినిమా సంగీతానికి కొత్త ఊపు తీసుకు వచ్చిన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ప్రతి సినిమాలో తన మార్క్ కనిపించేలా హై టెంపో మ్యూజిక్తో అలరించే ఈ స్వర తరంగం మెలోడీస్ కంపోజ్ చేయటంలోనూ అంతే సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా దేవీ స్వరపరిచిన ఐటమ్ నంబర్ సాంగ్స్ కోసం బాలీవుడ్ స్టార్స్ కూడా వెయిట్ చేస్తుంటారు.
దక్షిణాదిన ప్రముఖ హీరోలతో పనిచేసిన దేవీ శ్రీ చాలా రోజులుగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు.. ఇప్పటికే చాలా సార్లు ఆ అవకాశం వచ్చినా.. సౌత్ సినిమాలతో బిజీగా ఉండటంతో బాలీవుడ్లో తన స్టాంప్ వేయలేకపోయాడు. సల్మాన్ హీరోగా నటించిన రెడీ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ కంపోజ్ చేసిన దేవీ, ఆ ఒక్క పాటతోనే బాలీవుడ్ జనాలను తన వైపు తిప్పుకున్నాడు. అయితే అప్పటి నుంచి హిందీలో ఫుల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నా ఇంత వరకు సెట్ అవ్వలేదు.
తాజాగా దేవీ శ్రీ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లు ఓ వార్త చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. తెలుగు, తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ.... ఓ బాలీవుడ్ స్టార్ హీరో పట్టుపట్టడంతో దేవీ శ్రీ ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా పూర్తి వివరాలను అతడు త్వరలోనే ప్రకటించనున్నాడు.
బాలీవుడ్కి స్వర తరంగం
Published Sat, Aug 29 2015 1:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM