
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు, సింగర్ సాగర్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అన్న సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాగర్. ఈయన 2019లో డాక్టర్ మౌనికను పెళ్లాడాడు. కొద్ది నెలల క్రితం మౌనిక గర్భం దాల్చగా తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 21న ఆమె డెలివరీ అయినట్లు తెలుస్తోంది. సాగర్ దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఇది చూసిన అభిమానులు దేవిశ్రీప్రసాద్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదని బాధపడుతున్నారు. త్వరలో దేవిశ్రీప్రసాద్ పెళ్లి అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న డీఎస్పీ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి!
చదవండి: షణ్ముఖ్ అన్న ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో..
Comments
Please login to add a commentAdd a comment