స్టార్ హీరోలతో మళ్లీ సమంత | samantha acting with star heroes | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోలతో మళ్లీ సమంత

Published Mon, May 25 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

స్టార్ హీరోలతో మళ్లీ సమంత

స్టార్ హీరోలతో మళ్లీ సమంత

కోలీవుడ్‌లో సూపర్ గేర్‌లో పరుగులు తీస్తున్న హీరోయిన్ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం సమంత అనే. ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతుక్కుని సాధిస్తున్న నటి ఈ చెన్నై చిన్నది. సమంత ఇక్కడ తొలి రోజుల్లో నటించిన చిత్రాలన్నీ ప్లాప్‌లే. నిజం చెప్పాలంటే కోలీవుడ్ ఆమె అందుకున్న ఏకైక విజయం కత్తి చిత్రం ద్వారానే. ఆ చిత్రం తరువాత ఇక్కడ అవకాశాలు క్యూ కడుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాదు స్టార్ హీరోలతో అవకాశాలు రీపీట్ అవుతున్నాయి. విక్రమ్‌తో నటిస్తున్న 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ధనుష్‌కు జంటగా వేలై ఇల్లా పట్టాదారి -2 చిత్రంలో నటిస్తున్నారు.
 
 అదే విధంగా అంజాన్ చిత్రం తరువాత సూర్యతో మరోసారి 24 చిత్రంలో జతకట్టారు. అలాగే ఆమెకు తమిళంలో తొలి విజయాన్ని అందించిన కత్తి చిత్రం తరువాత మరోసారి నటుడు విజయ్‌తో జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని రాజారాణి చిత్రం ఫేమ్ అట్లి దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టాదారి -2 చిత్రంలో నటిస్తున్న సమంత తదుపరి వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వడచెన్నై చిత్రంలో ఆయనతో నటించనున్నారు. ఇక విక్రమ్‌తో 10 ఎండ్రదుకుళే చిత్రంలో నటిస్తున్న సమంత ఆయన తదుపరి చిత్రంలోను హీరోయిన్ తనేనని సమాచారం. ఇలా వరుసగా స్టార్ హీరోల సరసన రిపీట్ అవుతున్న ఏకైక నటి సమంతనే కావచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement