సియాన్‌తో సమంత
చెన్నై చిన్నది సమంతకు కోలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా పేరు పొందారు. నిజం చెప్పాలంటే సమంత టాలీవుడ్‌లోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు హిట్ ఖాతాను ప్రారంభించలేదు. ఈ చెన్నై సుందరి ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సరసన కత్తి , లింగుస్వామి దర్శక, నిర్మాతగా రూపొందిస్తున్న అంజాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు విజయావకాశాలు మెండుగా ఉన్న భారీ చిత్రాలు. సమంతను మరో లక్కీచాన్స్ వరించిందనే తాజా సమాచారం. సియాన్ విక్రమ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నదే ఆ విశేషం. విక్రమ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఐ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది.
ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆడియో త్వరలో జరగనుంది. విక్రమ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించనున్నారు. ఏఆర్ మురుగదాస్ నిర్మించనున్న ఈ చిత్రంలో బబ్లీగర్ల్ పాత్రకు సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం కొందరు ప్రముఖ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరికి ఈ లక్కీ చాన్స్ సమంతను వరించినట్టు తెలిసింది. సమంత ఇప్పటికే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సరసన నటిస్తున్నందు న ఆమె కు విక్రమ్ కు జంటగా నటించే అవకాశం వరించిందని సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ జూన్ లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.