ఫార్ములాను బ్రేక్ చేసిన యంగ్ హీరో | nani got natural star tag | Sakshi
Sakshi News home page

ఫార్ములాను బ్రేక్ చేసిన యంగ్ హీరో

Published Sun, Sep 6 2015 9:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

ఫార్ములాను బ్రేక్ చేసిన యంగ్ హీరో

ఫార్ములాను బ్రేక్ చేసిన యంగ్ హీరో

ఇండస్ట్రీలో స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలకు ఎదో ఒక స్టార్ ట్యాగ్ జోడించటం సినీ వర్గాలకు అలవాటు. అందుకే కొంతమంది యంగ్ హీరోలకు కెరీర్ స్టార్టింగ్ నుంచే స్టార్ ట్యాగ్ వచ్చేసింది. పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, యంగ్ టైగర్, ఇలా చాలా మంది యంగ్ హీరోలు స్టార్ ఇమేజ్ కన్నా ముందే స్టార్ ట్యాగ్ సాదించేశారు. అయితే వారసత్వంతో అడుగుపెట్టిన హీరోలకు మాత్రమే ఇలాంటి చాన్స్ ఉంటుంది.

ఓ యంగ్ హీరో మాత్రం ఈ ఫార్ములాను బ్రేక్ చేశాడు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని తన తాజా చిత్రం భలే భలే మొగాడివోయ్ తో స్టార్ గా మారిపోయాడు. అలామొదలైంది, పిల్లజమిందార్, ఈగ లాంటి సూపర్ హిట్స్ తో అలరించిన నానికి, భలే భలే మొగాడివోయ్ టీం న్యాచురల్ స్టార్ ట్యాగ్ ను అందించింది.

ఈ శుక్రవారం రిలీజ్ అయిన  భలే భలే మొగాడివోయ్, హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో నాని కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమాతో తన కామెడీ టైమింగ్ కూడా ప్రూవ్ చేసుకున్న ఈ నాచురల్ స్టార్ ముందు ముందు మరిన్ని కొత్త తరహా పాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement