Hero Nani Crazy Comments About His Tollywood Career, Deets Inside - Sakshi
Sakshi News home page

Nani: నాకు డబ్బు మేనేజ్‌మెంట్‌ అసలు తెలీదు

Published Tue, Mar 21 2023 5:18 PM | Last Updated on Tue, Mar 21 2023 5:51 PM

Hero Nani Crazy Comments About His Tollywood Career - Sakshi

న్యాచురల్‌ స్టార్‌గా టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాని. ప్రస్తుతం నాని నటించిన దసరా మూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ నటించింది. పాన్‌ ఇండియాగా రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ  చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన నాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దసరా సినిమాపై శ్రీకాంత్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేశారని నాని అన్నారు. చిత్రబృందం కూడా అందరూ చాలా బాగా సహకరించారని తెలిపారు. దసరాతో నాకు మొత్తం సెట్‌ అయిపోతుందని నమ్ముతున్నానని.. ఈ ధైర్యంతో మరో పది సినిమాలు ఈజీగా చేయగలనని పేర్కొన్నారు. 

నాని మాట్లాడూతూ..' నాకు డబ్బు మేనేజ్‌మెంట్‌ అసలు తెలీదు. సినిమా కోసం డబ్బు లెక్కచేయను. ఎందుకంటే సినిమా ఇచ్చిందే కదా ఆ డబ్బు. కథ బాగుంటే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడమే నా పని. నెక్ట్స్‌ సినిమా ఏంటీ అనేదే ఆలోచన. నాచురల్ స్టార్ అనే ట్యాగ్ ఇష్టం లేదు. మన పేరే మనకు పెద్ద బ్రాండ్. ఏ ఇండస్ట్రీలో అయినా కొత్తవారికి సమయం పడుతుంది. నెపోటిజం అనేది కరెక్ట్ కాదు. నాకు డైరెక్షన్‌ చేయాలనే ఉద్దేశం లేదు. నాకంటూ ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోను. కుటుంబం విషయానికొస్తే మా బాబు అర్జున్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తా. వాడికి ఇప్పుడు ఆరేళ్లు. నా భార్య కూడా ఒక ప్రేక్షకుడిలాగే నన్ను సపోర్ట్ చేస్తుంది. నా సినీ ప్రయాణంలో ఎక్కడా ఇబ్బంది పడలేదు. కథ కోసం డిఫరెంట్‌ పాత్రలు చేస్తా. హీరోనే కాకుండా ఏ పాత్రలోనైనా చేస్తా.' ‍అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement