నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న థియేటర్లలో రిలీజైంది ఈ చిత్రం. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజే ఏకంగా నైజాంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కలెక్షన్ల పరంగా చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా మూవీ ఆదివారం రోజే రూ.16 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. పలు భాషల్లో విడుదలైన దసరాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకపోవడంతో మరికొన్ని ఇదే జోరు కొనసాగనుంది.
కేవలం మూడు రోజుల్లోనే నైజాం (తెలంగాణ)తో పాటు, ఓవర్సీస్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. మరికొన్ని చోట్ల నాలుగో రోజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కడం.. ఇక్కడి ప్రజలకు ఈ చిత్రం కనెక్ట్ కావడంతో ఇక్కడ వసూళ్లలో దుమ్ము దులుపుతోంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment