
నేచురల్ స్టార్- వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం సరిపోదా శనివారం. ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.23.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.9 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.52.18 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పోస్టర్ ద్వారా పంచుుకంది. కాదా.. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లతో ఉత్తర అమెరికాలో తొలి బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మొదటి రోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సరిపోదా శనివారం వీకెండ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అభిరామి, అదితి బాలన్, పి సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు.
Bhaga Bhaga Bhaga..
Bhaga Bhaga Bhaga 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/zsVDRl772X— DVV Entertainment (@DVVMovies) September 1, 2024