Hero Nani Shared About His Struggles In Career Starting Days - Sakshi
Sakshi News home page

Nani: ఆ డైరెక్టర్ మాటకు తీవ్ర మనోవేదనకు గురయ్యా: నాని

Published Thu, Mar 23 2023 2:55 PM | Last Updated on Thu, Mar 23 2023 3:20 PM

Hero Nani Shared About His Struggles In Career Starting Days - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంది. వరుస పెట్టి ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నాని. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. కొత్తలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అందులో ప్రధానంగా ఓ దర్శకుడు అందరి ముందే తనను అవమానించారని చెప్పుకొచ్చారు. 

(ఇది చదవండి: ఆ సీన్స్‌లో నిజంగానే మందు కొట్టి నటించారట, నిజమెంత? నాని క్లారిటీ)

నాని మాట్లాడుతూ..' కెరీర్ ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది అర్థం కాదు. సాయం చేయడానికి ఎవరూ లేరు. మనం నేర్చుకుంటున్న సమయంలోనే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఆ తర్వాత సక్సెస్‌ మనకు సంతోషన్నిస్తుంది. నేను కూడా ఎన్నో సవాళ్లు, తిరస్కరణలు ఎదుర్కొన్నా.  మిగిలిన వారితో పోలిస్తే నా ఇబ్బందులు చిన్నవే. నాకంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడిన వాళ్లు కూడా ఉన్నారు. ఎవరెన్ని మాటలు అన్నా నేనెప్పుడూ బాధపడలేదు. కానీ, ఓ దర్శకుడు మాత్రం సెట్‌లో అందరి ముందు అవమానించాడు. నేను ఎప్పటికీ దర్శకుడిని కాలేనని అన్నాడు. ఆ మాట నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. అలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఈ రోజు నేని ఈ స్థాయికి వచ్చా.'అని  అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement