హీరో నాని నటిస్తున్న 30వ చిత్రం షురూ అయింది. శౌర్యువ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై చెరుకూరి మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి, మూర్తి కలగర నిర్మిస్తున్న ఈ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
నిర్మాత సి. అశ్వినీదత్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ఠ, వివేక్ ఆత్రేయ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. నేటి నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఈవీవీ సతీష్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: భాను ధీరజ్ రాయుడు.
Comments
Please login to add a commentAdd a comment