'మీ ఓటు మన పార్టీకే'.. మేనిఫెస్టో రిలీజ్ చేసిన హీరో నాని! | Tollywood Hero Nani Released Manifesto Of Hai Nanna Movie | Sakshi
Sakshi News home page

Nani: మీ ఓటు నాకే.. యూత్‌పై వరాలు కురిపించిన హీరో నాని!

Published Sun, Nov 19 2023 10:55 AM | Last Updated on Sun, Nov 19 2023 11:07 AM

Tollywood Hero Nani Released Manifesto Of Hai Nanna Movie - Sakshi

ఒకవైపు ఎలక్షన్స్ హడావుడి.. మరోవైపు వరల్డ్ కప్ ఫైనల్ సందడి.. ప్రస్తుతం ఈ రెండింటి మీదే అందరి దృష్టి ఉంది. తెలంగాణలో మరో పది రోజుల్లో ఎలక్షన్ జరగనుంది. అన్ని పార్టీలు హోరాహోరీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అయితే ఈ మధ్యలో కొత్త సినిమాలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. ఎంత పెద్ద సినిమా ‍అయినా మొదటి వారంలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత రోజుల్లో వసూళ్ల రావడం కష్టమే. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్‌కు ముందు మూవీ ప్రమోషన్స్ చాలా ముఖ్యం. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో.. అదేవిధంగా సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లడం అంతే. అందుకే నేచురల్ స్టార్ కొత్త పంథాను ఎంచుకున్నారు. ఈ ఏడాది దసరాతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన నాని మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయారు. ఈ సందర్భంగా హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్‌లో వినూత్నంగా ఆకట్టుకుంటున్నారు. ఎలక్షన్స్‌ తరహాలో ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. అదేంటో మీరు చూసేయండి. 

నాని మాట్లాడుతూ.. 'మనపార్టీ హాయ్ నాన్న. ఈరోజు మనం ఎలక్షన్‌ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. మనపార్టీ అధికారంలోకి వస్తే యూత్ అందరికీ విచ్చలవిడిగా రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్స్, లైటింగ్ సెటప్ కిట్స్ పంచిపెడతాం. అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం. థియేటర్ల ఆదాయం.. అలాగే పక్కనున్న కిరాణకొట్టు ఆదాయం కూడా. సబ్జెక్ట్ లేకుండా ఇష్టమొచ్చినట్లు వాగే  వాళ్ల ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం. నన్ను గెలిపిస్తే ప్రతి జంక్షన్‌లో నా బొమ్మ, అలాగే ప్రతి థియేటర్లో మా బొమ్మ ఉండేలా చూస్తా. వరల్డ్‌ కప్ ఫైనల్‌కి టికెట్స్ డిస్కౌంట్‌లో ఇప్పిస్తాం(వచ్చే వరల్డ్‌ కప్‌కి).' అని నవ్వుతూ అన్నారు. 

ఆ తర్వాత మాట్లాడుతూ..'మీ పార్టీ హాయ్ నాన్నను గెలిపించుకోవడానికి తండ్రీ, కూతుళ్ల రిలేషన్‌ కాబట్టి.. ప్రతి తండ్రి, కూతురికి రెండు ఓట్లు ఉండేలా చూసుకుంటున్నాం. ప్రతి చిన్న పిల్లాడి నుంచి మా పార్టీకి ఓట్లు వేయొచ్చు. ముందస్తు ఎన్నికల్లాగే మేము కూడా ఒకరోజు ముందుగానే వస్తున్నాం. ఎన్‌ఆర్‌ఐల కోసం అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య, సుదర్శన్ నిర్మించాలకుంటున్నాం. అలాగే డిసెంబర్ 7న బస్తా పేపర్లు తెచ్చుకుంటే.. అవి విసరడానికి కావాల్సిన కంటెంట్ మేమే ఇస్తాం. మా పార్టీకే ఓటేయండి అని పొలిటీషియన్లు ఎన్నైనా చెబుతారు. అలాగే మా సినిమానే చూడండని యాక్టర్స్ చాలా చెబుతారు. కానీ మీ మనసుకు తెలుసు.. మంచోడికే ఓటేయండి.. మంచి సినిమాను థియేటర్లోనే చూడండి. హాయ్ నాన్న ఆన్ డిసెంబర్ 7.' అంటూ నాని తనదైన స్టైల్లో మేనిఫోస్టో రిలీజ్ చేశారు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement