టాలీవుడ్ సూపర్‌ 'హిట్‌' సిరీస్‌.. పార్ట్‌-3లో హీరో ఎవరంటే? | Tollywood Actor Natural Star Nani Announce Another Action Movie | Sakshi
Sakshi News home page

Nani: థియేటర్లలో సరిపోదా శనివారం.. అంతలోనే మరో హిట్‌కు రెడీ!

Published Thu, Sep 5 2024 11:30 AM | Last Updated on Thu, Sep 5 2024 11:37 AM

Tollywood Actor Natural Star Nani Announce Another Action Movie

సరిపోదా శనివారం అంటూ ఇటీవలే సినీ ప్రియులను అలరించిన టాలీవుడ్ హీరో నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. అంతలోనే మరో కొత్త మూవీని ప్రకటించారు. ఈ సినిమా నాని కెరీర్‌లో 32వ చిత్రంగా నిలవనుంది. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేయండి.

గతంలో టాలీవుడ్‌లో హిట్‌ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హిట్ పేరుతో వచ్చిన మూవీలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించారు. ఆ తర్వాత హిట్‌-2లో లీడ్‌ రోల్‌లో అడివి శేష్‌ కనిపించారు. ఈ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రం హిట్‌-3. ఇందులో టాలీవుడ్‌ నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్.

కాగా.. ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌లో మే 1న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నారు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement