
సినిమా షూటింగ్‌లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓసారి చావు అంచులదాకా వెళ్లొచ్చాడట! ఆ సమయంలో అజయ్ దేవ్‌గణ్ అతడిని కాపాడాడు. వీళ్లిద్దరూ 1997లో వచ్చిన కామెడీ మూవీ ఇష్క్‌లో నటించారు. కాజోల్, జూహీ చావ్లా హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు.
చింపాంజీ దాడి
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమిర్ ఖాన్, అజయ్ 'ఇష్క్' మూవీ షూటింగ్‌లో జరిగిన ఓ ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ముందుగా ఆమిర్ మాట్లాడుతూ.. మేము తరచూ కలుసుకోము. కానీ కలుసుకున్నప్పుడు మాత్రం అజయ్ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు. ఇష్క్ సినిమాలో ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు ఒక చింపాజీ సడన్‌గా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అన్నాడు.
పారిపోండి అంటూ ఒకటే పరుగు
ఇంతలో అజయ్ కలుగజేసుకుంటూ.. చింపాజీ కుదురుగానే కూర్చుంది. ఆమిర్ ఎప్పుడైతే దానిపై నీళ్లు చిలకరించి విసుగు తెప్పించాడో అప్పుడే సమస్య మొదలైంది. అది వెంటపడటంతో పారిపోండి పారిపోండి అని అరుస్తూ పరిగెత్తాడు అని తెలిపాడు. అప్పుడు నన్ను అజయే రక్షించాడంటూ ఆమిర్ పగలబడి నవ్వాడు.
Comments
Please login to add a commentAdd a comment