Ishq
-
చింపాంజీ దాడి.. ఆ హీరోనే రక్షించాడు: ఆమిర్ ఖాన్
సినిమా షూటింగ్లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓసారి చావు అంచులదాకా వెళ్లొచ్చాడట! ఆ సమయంలో అజయ్ దేవ్‌గణ్ అతడిని కాపాడాడు. వీళ్లిద్దరూ 1997లో వచ్చిన కామెడీ మూవీ ఇష్క్‌లో నటించారు. కాజోల్, జూహీ చావ్లా హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు.చింపాంజీ దాడితాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమిర్ ఖాన్, అజయ్ 'ఇష్క్' మూవీ షూటింగ్లో జరిగిన ఓ ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ముందుగా ఆమిర్ మాట్లాడుతూ.. మేము తరచూ కలుసుకోము. కానీ కలుసుకున్నప్పుడు మాత్రం అజయ్ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు. ఇష్క్ సినిమాలో ఓ సీన్ చిత్రీకరించేటప్పుడు ఒక చింపాజీ సడన్‌గా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అన్నాడు. పారిపోండి అంటూ ఒకటే పరుగుఇంతలో అజయ్ కలుగజేసుకుంటూ.. చింపాజీ కుదురుగానే కూర్చుంది. ఆమిర్ ఎప్పుడైతే దానిపై నీళ్లు చిలకరించి విసుగు తెప్పించాడో అప్పుడే సమస్య మొదలైంది. అది వెంటపడటంతో పారిపోండి పారిపోండి అని అరుస్తూ పరిగెత్తాడు అని తెలిపాడు. అప్పుడు నన్ను అజయే రక్షించాడంటూ ఆమిర్ పగలబడి నవ్వాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి పిలుపు.. ఆ అవమానాలు నా వల్ల కాదు: నటుడు -
ఇష్క్ @ 10
-
తేజ సజ్జ ‘ఇష్క్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇష్క్.. నాట్ ఎ లవ్‌స్టోరి జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ నటీనటులు : తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ నిర్మాణ సంస్థ : మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ దర్శకత్వం : యస్.యస్. రాజు సంగీతం : మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు ఎడిటర్ : ఎ. వరప్రసాద్ విడుదల తేది : జూలై 30, 2021 చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన తేజ సజ్జా‘జాంబి రెడ్డి’తో హీరోగా మారిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ జానర్‌తో తొలిసారే ప్రయోగం చేసి, తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘ఇష్క్. కన్నుగీటుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్. క్రేజీ కాంబినేషన్ లవ్ స్టోరీ ఊహిస్తే.. నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇష్క్ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెంచుతూ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (జూలై 30)న థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘ఇష్క్’ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో తేజ సజ్జా మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. కథ వైజాగ్‌కు చెందిన సిద్దార్థ్ అలియాస్ సిద్దు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనసూయ అలియాస్ అను(ప్రియా ప్రకాశ్ వారియర్)తో ప్రేమలో ఉంటాడు. అను బర్త్‌డే సందర్భంగా ఆమెతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తాడు సిద్దు. కారులో అనును తీసుకొని వైజాగ్ బీచ్ రోడ్‌కి వెళ్తాడు. ఇద్దరు కలిసి డే మొత్తాని ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం సమయంలో అనుని ఓ ముద్దు ఇవ్వమని కోరతాడు సిద్దు. దాని వల్ల వీరికి ఓ పెద్ద సమస్య వచ్చిపడుతుంది. అను, సిద్దు సన్నిహితంగా ఉన్న పోటోలు, వీడియోలు తీసిన మాధవ్(రవీందర్), పోలీసు ఆఫీసర్ని అని చెప్పి వారికి బ్లాక్ మెయిల్ చేస్తాడు. రాత్రంతా కారులోనే వారితో ప్రయాణం చేసి, అనుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. పోలీసు ఆఫీసర్ అనే భయంతో మాధవ్‌ని సిద్దు ఏం చేయలేకపోతాడు. కట్ చేస్తే.. మరుసటి ఉదయం సిద్ధుకి మాధవ్ గురించి ఓ నిజం తెలుస్తుంది. ఇంతకి సిద్ధుకి తెలిసిన నిజం ఏంటి? మాధవ్ నిజంగా పోలీసు ఆఫీసరా? కాదా? తన ప్రియురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన మాధవ్‌కు సిద్ధు ఏ విధంగా బుద్ది చెప్పాడు? చివరకు అను, సిద్ధుల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. నటీ నటులు సిద్దు పాత్రలో తేజ సజ్జ బాగానే నటించాడు. ఫస్టాఫ్‌లో రొమాంటిక్ యాంగిల్లో కనిపించిన సిద్దు.. సెకండాఫ్‌లో రివేంజ్ తీర్చుకునే ప్రేమికుడిగా అద్భుతంగా నటనను కనబరిచాడు. భయపడుతూనే.. తమ జంటను హింసించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. అను పాత్రలో ప్రియా ప్రకాశ్ వారియర్ మెప్పించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగానే చేసింది. ఇక శాడిస్ట్ పాత్రలో రవీంద్ర విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీ, నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ మలయాళం ఇష్క్ సినిమాకి రీమేకే.. ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ. ఆ సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసిన దర్శకుడు యస్ యస్ రాజు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఫస్టాఫ్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లను విలన్ వేధించిన తీరు మరీ లెంతీగా చూపించడం సినిమాకు ప్రతికూల అంశమే. అలాగే సెకండాఫ్‌లో కూడా హీరో రివేంజ్ తీర్చుకునే సన్నివేశాలు కూడా సాగదీతగా, బోరింగ్‌గా ఉంటాయి. ఒకే పాయింట్‌ని పట్టుకొని సాగదీయడం సినిమాకి పెద్ద మైనస్. జంటలపై దాడుల, వేధింపులు అనే పాయింట్ కొత్తగానే ఉన్నా... తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. అయితే ఎండింగ్లో సిద్ధు, అనుల మధ్య వచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుట్టుంది. ఇక సినిమాకి ఉన్నంతలో ప్లస్ పాయింట్ ఏంటంటే మహతి స్వరసాగర్ సంగీతం. ఒక్క పాట మినహా మిగతా పాటలు ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ ఎ. వరప్రసాద్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. మొత్తంగా ఇష్క్ సినిమా చూడడం కాస్త రిస్కే. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఏపీ దిశ యాప్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది
‘‘భారతదేశంలో సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో విధానంలో అనుమతి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఏపీలోని ఏ ప్రాంతంలోనైనా షూటింగ్ చేసుకునే అనుమతులు వచ్చే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు కల్పించారు. మా ఎగ్జిబిటర్స్ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళితే తప్పకుండా పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఎన్వీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. థియేటర్లో సినిమా చూస్తే వచ్చే థ్రిల్ ఓటీటీలో రాదు. లాక్డౌన్ వల్ల థియేటర్ల వ్యవస్థ బాగా దెబ్బతింది. థియేటర్స్ మూత పడ్డా కూడా జీతాలు చెల్లించాలి. కరెంటు అనేది ప్రతి థియేటర్‌కి మినిమం లక్ష రూపాయలు చెల్లించాల్సిందే. మా అగ్రిమెంట్ ప్రకారమే చెల్లిస్తున్నాం. ఒకప్పుడు సినిమా వాళ్లకి ఐడీబీఎల్ లోన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎవరూ లోన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం ఇస్తున్న సినిమా ఇండస్ట్రీని నాన్ ప్రియారిటీ సెక్షన్లో పెట్టడం ఎంత వరకు సమంజసం? థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ప్రేమకథలోనే థ్రిల్లింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ‘ఇష్క్’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాలు డబ్ అవుతుండటం సంతోషం. థియేటర్లు ప్రారంభం అవుతున్నాయి కాబట్టే ఓటీటీ వాళ్లు ఇప్పుడు మరింత డబ్బు ఇచ్చి, సినిమాలు కొనేందుకు వస్తారు.. నిర్మాతలు జాగ్రత్తపడాలి. చిరంజీవిగారితో మేము నిర్మించనున్న సినిమా ఆగస్టు 13న ప్రారంభం అవుతుంది. -
ఆమె కన్ను కొట్టింది, నేను తొడ కొట్టాను: యంగ్ హీరో
Teja Sajja, Priya Prakash Varrier: సినిమా ట్రైలర్లో హీరోయిన్ను ముద్దిస్తావా? అని అంత ఈజీగా అడిగేసిన తేజ సజ్జ రియల్ లైఫ్‌లో మాత్రం ఎవరినీ ఆ ప్రశ్న అడగలేదట. సినిమా ఇస్తావా? అని చాలామంది దర్శకనిర్మాతలను అడిగానే తప్ప ఇలా ముద్దు కోసం అమ్మాయిల వెంట పడలేదని తెలిపాడు. అంతేకాదు తనకు రొమాన్స్ సీన్లలో నటించడమన్నా కూడా చాలా భయమని చెప్తున్నాడు. తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన చిత్రం 'ఇష్క్'. ఈ సినిమా జూలై 30న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు సాక్షితో ముచ్చటించారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ.. 'ఇష్క్' సినిమాలో హీరోగా తన నటనకు 8 మార్కుల వరకు వేసుకోవచ్చన్నాడు. ఇక ఫస్ట్‌డే ఫస్ట్ షాటే ముద్దు సీన్ అవడంతో కొంత ఇబ్బందిగా అనిపించిందన్నాడు. ఫేమస్ హీరోయిన్‌తో నటించడం ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె కన్ను కొట్టింది, తాను తొడ కొట్టాను అంటూ చిలిపిగా బదులిచ్చాడు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఇంకా ఏమేం ముచ్చటించారో కింద వీడియోలో చూసేయండి. -
ఆఫర్లు రానందుకు నాకేం బాధగా లేదు : హీరోయిన్
‘‘వింక్ సెన్సేషన్ అంటూ నా వీడియో వైరల్ అయిన టైమ్‌లో చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ టైమ్‌లో చదువు ముఖ్యమనుకున్నాను. గత ఏడాదే బీ.కామ్ పూర్తి చేశాను. అప్పట్లో వచ్చినన్ని ఆఫర్లు ఇప్పుడు రానందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే బాధపడుతూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేం’’ అన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. తేజా సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా ఎస్.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇష్క్’. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30 విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ – ‘‘మలయాళ ‘ఇష్క్’ చిత్రాన్ని చూసి తెలుగు రీమేక్ ‘ఇష్క్’ ఒప్పుకున్నాను. ఇది రోటీన్ లవ్‌స్టోరీలా ఉండదు. మలయాళ స్టోరీ సోల్‌ను తీసుకుని, ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్లు మార్పులు చేశారు దర్శకులు రాజుగారు. తెలుగు భాష అర్థం చేసుకోగలను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలో నటిస్తున్నారు. -
ట్రైలర్: హీరోయిన్ బర్త్‌డే ప్లాన్, అంతలో ఏమైంది?
Ishq Movie Trailer: తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన చిత్రం ఇష్క్. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ప్రియాతో ప్రేమలో పడిన తేజ ఆమె బర్త్‌డేను స్పెషల్‌గా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తాడు. కానీ ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురై అంతా తలకిందులు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ అన్న క్యాప్షన్ చూస్తుంటే హీరో నిజంగానే హీరోయిన్ను ప్రేమించాడా? లేదా అన్న అనుమానం రాక మానదు. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేసిదిగా ఉంది. యస్.యస్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలవుతోంది. -
ఇష్క్ మూవీ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
ఆ నిర్మాతలను అనుసరించాను : దిల్ రాజు
‘‘రామానాయుడుగారు, ఆర్బీ చౌదరిగారు.. ఇలా కథల మీద మంచి పట్టు ఉన్న ప్రొడ్యూసర్స్‌ని స్టడీ చేసి, నా ప్రతి సినిమాకు దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. అలాంటి సూపర్ గుడ్ ఫిలింస్‌లో వస్తోన్న ‘ఇష్క్’ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘కరోనా ప్రభావం ఫిలిం ఇండస్ట్రీ మీద ఎక్కువగా పడింది. థియేటర్లలో ప్రేక్షకులు మాస్కులు వేసుకునే సినిమా చూడాలి’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది.. అందరూ ఆదరించాలి’’ అన్నారు వాకాడ అప్పారావు. ‘‘కొత్త కథతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’’ అన్నారు ఎస్ఎస్ రాజు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ పాల్గొన్నారు. -
'ఇష్క్' రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు: తేజ సజ్జ
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. ఈనెల 30న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ చిత్ర మాట్లాడుతూ..అందరూ అనుకున్నట్లుగా ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. యూత్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా తెరకెక్కించినప్పటికీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. స్టోరీ చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది. పాత్రలు ఎక్కడా కూడా పరధి దాటి వెళ్లవు. ఎక్కడా బోర్ అనిపించదు. సినిమా మొదటి నుంచి ముగిసే వరకు ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. థ్రిల్ ఫీలయ్యే సందర్బాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. మహతి స్వరసాగర్ అందించిన పాటలు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని పేర్కొన్నాడు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం తేజ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో హనుమాన్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇష్క్: సిద్ శ్రీరామ్ మెలోడీ సాంగ్ వచ్చేసింది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆనందమా.. ఆనందమదికే’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి శ్రీమణి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. -
ఊహించని సంఘటన అది: సుస్మిత బాయ్ ఫ్రెండ్
సాక్షి, ముంబై: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రియుడు కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షా షూటింగ్లో అనుకోకుండా ఒక చిన్నప్రమాదంలో ఇరుక్కు న్నాడట. దీనికి సంబంధించిన వీడియోను రోహ్మాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్టార్హీరో అమీర్ ఖాన్ 1997 నాటి ఇష్క్ మూవీ షూటింగ్ దృశ్యాలను తాజాగా ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఫన్నీ వీడియోను ఫ్యాన్స్‌కు షేర్ చేశాడు. ఇష్క్ మూవీ షూటింగ్లో కృష్ణుడి వేషంలో కొలనులో గోపికలతో ఒక సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఈ ఊహించని పరిణామం ఎదురైంది. పువ్వులతో అలంకరించిన ఒక ఊయలలో రోహ్మాన్ షూట్ కొనసాగుతుండగా, ఒకవైపు తాడు తెగిపోయింది. దీంతో అతను పడిపోబోయాడు. కానీ వెంటనే బ్యాలెన్స్ చేసుకొని పడిపోకుండా నొలదొక్కుకున్నాడు. ఈ పరిణామంతో అక్కడున్న సిబ్బంది కాసేపు ఖంగారుపడ్డారని తెలిపాడు. అంతేకాదు త్రిపాఠి నమ్రతా ఆందోళనగా పరిగెత్తుకు రావడాన్నిప్రస్తావించాడు రోహ్మాన్ షా . View this post on Instagram A post shared by rohman shawl (@rohmanshawl) -
'ఇష్క్' హీరో తేజ వెరీ డెడికేటెడ్ ఫెలో..
యంగ్ హీరో తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఇష్క్". యస్.యస్. రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్‌హయాత్ హోటల్లో 'ఇష్క్' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో ఇష్క్ మూవీ బిగ్ టికెట్‌ని వేణు శ్రీరామ్, నారా రోహిత్, సందీప్ కిషన్, నందినీ రెడ్డి, శ్రీ విష్ణు, ప్రశాంత్ వర్మ సంయుక్తంగా ఆవిష్కరించారు. దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ సూపర్ గుడ్ ఫిలింస్. ఈ బ్యానర్లో వర్క్ చేయడం తేజకి నిజంగా ప్రౌడ్ మూమెంట్. సాగర్‌కి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా చాలా అందంగా ఉంది. ఈ సినిమాతో మరిన్న అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. తేజలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఎంత సేపు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడుతాడు. వెరీ డెడికేటెట్ ఫెలో. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేస్తున్నాడు. తేజకు ఇది హ్యాట్రిక్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను' అన్నారు. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్ బి చౌదరి మాట్లాడుతూ.. 'ఇది మా బేనర్లో తెరకెక్కుతోన్న 94వ చిత్రం. మా బేనర్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులని, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశాం. ఇప్పుడు మరో టాలెంటెడ్ డైరెక్టర్ యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఇష్క్ సినిమా ఏప్రిల్ 23న థియేటర్లలో రిలీజవుతుంది. 23 తర్వాత ఈ మూవీ సక్సెస్ మీట్లో మళ్లీ కలుద్దాం' అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. 'మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో `సుస్వాగతం` లాంటి యూత్ కి సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఖచ్చితంగా మిమ్మల్నందరినీ అలరిస్తుంది. తేజ జూనియర్ ఆర్టిస్టుగా మనకు ఎప్పటినుంచో పరిచయం, అయితే ఓబేబి, జాంబీరెడ్డి వంటి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక సీనియర్ యాక్టర్‌లాగా మంచి పెర్ఫామెన్స్ చేశాడు. ప్రస్తుతం యువ హీరోలు ప్రమోషన్స్ అనేవి ఒక బాధ్యతాయుతంగా భావించి వాటిలో భాగం అవడం చాలా హ్యాపీ' అన్నారు. చిత్ర దర్శకుడు యస్.యస్. రాజు మాట్లాడుతూ - 'నేను డైరెక్టర్ అవడానికి కారణం అయిన మా గురువు గారు సమీర్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్, జైన్ గారు, వాకాడా అప్పారావు గారికి థ్యాంక్స్. ఈ సినిమాను 29 డేస్‌లో ఇంత క్వాలిటీగా చేయడానికి కారణం శ్యామ్‌కేనాయుడు గారు. తేజ, ప్రియా, రవీందర్ ఇలా అందరు బాగా చేశారు. మహతి స్వరసాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా టీమ్‌లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. టీమ్ అందరికీ థ్యాంక్స్' అన్నారు. హీరోలు నారా రోహిత్, శ్రీ విష్ణు, సందీప్ కిషన్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. చదవండి: ఒక ముద్దిస్తావా?: ధైర్యం చేసి అడిగేసిన హీరో 'ఇష్క్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు -
'ఇష్క్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
‘ఇష్క్’పై ప్రియా ప్రకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
`ఓరు ఆధార్ లవ్` అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియా ప్రకాశ్ వారియర్... ఒకే ఒక్క కన్ను గీటుతో 'వింక్‌గాళ్'గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం తర్వాత తెలుగులో నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు.. ‘నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత నేను చేసిన సెకండ్ స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఇష్క్`. నాట్ ఏ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఒక కొత్త సబ్జెక్ట్‌తో రూపొందిన సినిమా ఇది. టీమ్ అందరం కలిసి ఓ మంచి ప్రయత్నం చేశాం. ఈ కథకు తప్పకుండా ప్రతి ఆడియన్ రిలేట్ అవుతారు. సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్లో ఏం జరుగుతుందా? అనే ఎగ్జైట్ మెంట్ సినిమా సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల మైండ్‌లో కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా చూసి ఆడియన్స్ తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు. ఈ చిత్రంలో నేను అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్రలో నటించాను. తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న కాలేజ్ గాళ్. తన క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ‘చెక్’ సినిమాలో నా స్క్రీన్ ప్రజెన్స్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుంది. తేజ సజ్జా మంచి కో స్టార్. ఇంకా చెప్పాలంటే నా ఏజ్‌గ్రూప్‌తో సరిపోయే యాక్టర్. సో సెట్స్‌లో చాలా ఫన్ ఉండేది. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో నేను కాస్త ఇబ్బందిపడ్డప్పుడు తేజ నాకు బాగా హెల్ప్ చేశాడు. దర్శకుడిగా ఎస్ఎస్ రాజుకి ఇది సినిమా తొలి ప్రాజెక్ట్. అయినా చాలా కాన్సన్ట్రేటెడ్గా చేశారు. సెట్లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. క్యారెక్టర్ సోల్‌ను మైండ్‌లో పెట్టుకుని నా స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేయమని చెప్పి దర్శకుడు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం మేజర్‌గా నైట్ షూట్స్ చేయాల్సి వచ్చింది. కొంతగ్యాప్ తర్వాత మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ చేసిన తెలుగు సినిమా ఇది. ఈ ఆఫర్ నాకు సడన్‌గా వచ్చింది. పెద్దగా ప్లాన్ కూడా చేసుకోలేదు. మెగాసూపర్ గుడ్ ఫిలింస్ వంటి మంచి బ్యానర్లో సినిమా చేయడం నా కెరీర్‌కు ఫ్లస్ అవుతుందని వెంటనే `ఇష్క్` సెట్స్‌లో జాయినైపోయాను. ఇక ఇష్క్ ఓ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్. ఆ సినిమా బేస్ లైన్ నాకు బాగా నచ్చింది. కథ బాగా కుదరిందని అనిపించింది. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేశారు. తెలుగు డైలాగ్స్‌లో పలకడం నేర్చుకుంటున్నాను. ఇష్క్ సినిమా చేసేప్పుడు టీమ్ నాకు హెల్ప్ చేశారు. ముందురోజే డైలాగ్స్ తీసుకుని నేను ప్రాక్టీస్ చేసి సెట్స్‌కు వచ్చేదాన్ని. అదీ నాకు కొంత హెల్ప్ అయ్యింది. మలయాళంలో నేను నటించిన తొలి సినిమా ‘ఓరు ఆడార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’గా విడుదలై రెండేళ్లు అవుతుంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఏడాది నా రెండు సినిమాలతో (ఇష్క్, చెక్) తెలుగు ప్రేక్షకులను పలరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా లేకపోతే చెక్ సినిమా గత ఏడాదే విడుదలయ్యేది. ఇష్క్ ఈ ఏడాది వచ్చేది. ఇలా ఏడాదికో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. మనం నటించిన అన్ని సినిమాలు ఆడవు. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకాదరణ లభిస్తుంది. కానీ ఫెయిల్యూర్స్ నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఇప్పటివరకు నేను చేసిన రోల్స్ అన్ని నాకు డిఫరెంట్‌గానే అనిపించాయి. ఇష్క్‌లో నేను చేసిన అనసూయ పాత్ర మోర్ ఇంటెన్స్ అండ్ డ్రమటిక్‌గా ఉంటుంది. సందీప్‌కిషన్ నెక్ట్స్ మూవీలో నేను ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఆ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కర్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.’ అని తెలిపింది. -
గంగవ్వ, ‘కన్ను గీటు భామ’ మూతి తిప్పుడు వీడియో వైరల్
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యస్.యస్. రాజు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయడం అవుతున్నాడు. ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది చిత్రబృందం. రోటీన్‌గా కాకుండా కాస్త డిఫెరెంట్, ఫన్ వేలో ‘ఇష్క్’ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఓ సెలబ్రిటీని పిలవడానినికి తేజ పడిన కష్టాలు చూడడంటూ ఓ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ విడియో సోషల్ మీడియాలో వైరలై నవ్వులు పూయించింది. తాజాగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్, బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన దగ్గరకు వచ్చిన ప్రియా ప్రకాష్‌కు తనదైన మాటలు, చేష్టలతో చుక్కలు చూపించింది గంగవ్వ. కన్నుకొట్టుడు కాదు మూతులు తిప్పుడంటూ.. ప్రియాకు మూతి తిప్పుడు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా యువ హృదయాలను కొల్లగొట్టిన ‘ఈ కన్నుగీటు భామ’.. మూతి తిప్పినా ముద్దుగానే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఇదో కొత్త అనుభూతిని ఇస్తుంది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా యస్.యస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సమష్టిగా నిర్మించిన ‘ఇష్క్’ సినిమా ట్రై లర్‌ను సోషల్ మీడియాలో హీరో సాయితేజ్ విడుదల చేశారు. ఈ సినిమాను ఈ నెల 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ – ‘‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్ సినిమా తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్’. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించే మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థవారు కొంత గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన ఈ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘యూనిట్లో అందరి సహకారంతో తక్కువ రోజుల్లో మంచి క్వాలిటీతో ఈ సినిమాను పూర్తి చేశాను. హీరోహీరోయిన్లు తేజ, ప్రియలతో పాటు ఆర్టిస్టు రవీందర్ కూడా బాగా నటించారు’’ అన్నారు యస్.యస్. రాజు. ‘‘సూపర్‌గుడ్ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ రెండూ ఒక్కటే. మా బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఆరేడేళ్ల నుంచి తెలుగులో సినిమాలు చేయలేకపోయాం. ఇప్పుడు ‘ఇష్క్’ చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు వాకాడ అప్పారావు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వరసాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, పి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక ముద్దిస్తావా?: ధైర్యం చేసి అడిగేసిన హీరో
పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన తేజ సజ్జ 'జాంబీరెడ్డి'తో హీరోగా మారాడు. ఈ చిత్రం అతనికి హీరోగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అతడు డర్టీహరి డైరెక్టర్ ఎంఎస్ రాజుతో దర్శకత్వంలో 'ఇష్క్' అనే సినిమా చేస్తున్నాడు. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ తేజతో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. ఇందులో "అనూ, రేపు నైట్ నీ బర్త్‌డే ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు, నేను కారులో, ఆ కారు బీచ్ రోడ్డులో.." అంటూ ఊహల్లో తేలుతున్నాడు హీరో. తీరా అనుకున్నట్లుగానే ప్రియా వారియర్‌ను కారులో ఎక్కించుకుని చక్కర్లు కొడుతున్న హీరో ధైర్యం చేసి 'ఒక ముద్దిస్తావా?' అంటూ మనసులో మాట అడిగేశాడు. అందుకు ఆ భామ సై అందా? లేదా? ఇంతలో వీళ్లిద్దరికీ ఏమైనా జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే. అసలు వీరి కారు ప్రయాణంలో ఏం జరిగింది? వీరిపై ఎవరు, ఎందుకు దాడి చేశారు? అన్న అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇష్క్ నాటే సింగిల్ లవ్‌స్టోరీ అనేట్లుగా ఉందీ ట్రైలర్. ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మించనుంది. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్, పరాస్ జైన్ నిర్మించనున్నారు. శ్యామ్ కె నాయుడు కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. చదవండి: శ్రీకారం చుట్టుకుంది కొత్త చిత్రాలు 'జాంబీ రెడ్డి' సినిమా ఎలా ఉందంటే? -
ప్రేమకథ కాదు
‘డర్టీహరి’ హిట్‌తో డైరెక్టర్‌గా మంచి మార్కులు వేయించుకున్నారు నిర్మాత యం.యస్. రాజు. ఆయన దర్శకత్వంలో ‘ఇష్క్’ అనే చిత్రం రూపొందనుంది. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది టాగ్లైన్. తేజ సజ్జా, ప్రియాప్రకాశ్ వారియర్లు జంటగా నటించనున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మించనుంది. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్, పరాస్ జైన్ నిర్మించనున్నారు. 2021లో ఈ చిత్రం ద్వారా తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మాతలు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరాలు సమకూరుస్తుండగా శ్యామ్.కె.నాయుడు కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హిట్ పెయిర్.. ఏడేళ్లు మాట్లాడుకోలేదట..!
ఒకప్పుడు బాలీవుడ్లో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జోడి ఆమిర్ ఖాన్, జూహీ చావ్లా. ఖయామత్ సే ఖయామత్ తక్, లవ్ లవ్ లవ్, ఇష్క్ లాంటి సినిమాలో కలిసి నటించిన ఈ జోడి ఓ చిన్న గొడవ కారణంగా ఏకంగా ఏడేళ్ల పాటు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఇష్క్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆమిర్, జూహీల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో దూరమైన ఆమిర్, జూహీలు ఏడేళ్ల పాటు మాట్లాడుకోలేదట. అయితే ఆమిర్, రీనాలు విడాకులు తీసుకుంటున్నట్టుగా తెలియటంతో జూహీచావ్లానే గొడవ పక్కన పెట్టి ఆమిర్, రీనాలను వారించే ప్రయత్నం చేసిందట. దీంతో ఆమిర్, జూహీల మధ్య తిరిగి స్నేహం చిగురించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమిర్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. -
ఇష్క్ కాంబినేషన్లో మరో సినిమా
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న నితిన్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇష్క్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, యూత్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. దీంతో దశాబ్దకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఒక్కసారిగా స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఇష్క్ ఇచ్చిన కిక్‌తో నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం 24 సక్సెస్‌తో విక్రమ్, అ..ఆ.. సక్సెస్‌తో నితిన్ మంచి ఫాంలో ఉన్నారు. ఇదే సమయంలో తమ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే విక్రమ్ కె కుమార్, అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. అదే సమయంలో నితిన్ కూడా సంపత్ నంది, కిశోర్ తిరుమల లాంటి దర్శకులకు కమిట్మెంట్స్ ఇచ్చాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి ఇష్క్ మ్యాజిక్ రిపీట్ చేస్తారా..? లేక అనుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేశాక వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
వెంటనే ఓకే చెప్పేశా - నితిన్
‘‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇది. ‘ఇష్క్’ తర్వాత రకరకాల కథలు వింటున్నప్పుడు గౌతమ్‌మీనన్ ఈ కథ గురించి చెప్పారు. కథ విని వెంటనే ఓకే చెప్పేశా’’ అని హీరో నితిన్ చెప్పారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ సమర్పణలో నితిన్, యామీ గౌతమ్ జంటగా వెంకట్ సోమసుందరం, రేష్మ ఘటాల, సునీత తాటి నిర్మించిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ప్రేమ్‌సాయి దర్శకుడు. కార్తీక్, అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల్ మాట్లాడుతూ-‘‘గౌతమ్ మీనన్‌గారు డెరైక్ట్ చేసిన సినిమాల్లో కథలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తొలి సారిగా ఆయన తెలుగులో నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ప్రేమ్‌సాయి చాలా ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. అన్ని కష్టాలను దాటి ఇప్పుడు ఈ సినిమాతో ముందుకు వ స్తున్నాం’’ అని నిర్మాత గౌతమ్‌మీనన్ తెలిపారు. నితిన్‌తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్ అని దర్శకుడు ప్రేమ్‌సాయి అన్నారు. ఈ వేడుకలో రచయిత కోన వెంకట్, హీరోలు నాగైచె తన్య, నాని, రానా, నిర్మాతలు ‘మల్టీ డైమన్షెన్’ రామ్మోహనరావు, సునీత తాటి తదితరులు పాల్గొన్నారు. -
13 కిలోలు తగ్గిన హన్సిక
హన్సిక బిజీ బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో దాదాపు తొమ్మిది సినిమాలున్నాయి. వీటితో పాటు కొత్త సినిమాలకు డేట్స్ కేటాయించడానికి డైరీ చెక్ చేసుకుంటున్నారామె. ఇన్ని సినిమాలు ఉన్నందువల్లో ఏమో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేశారు హన్సిక. కెరీర్‌ని అంత సీరియస్‌గా తీసుకున్నారు కాబట్టే, ట్రెండ్‌కి తగ్గట్టుగా స్లిమ్‌గా ఉండాలనుకున్నారు. అందుకే సన్నబడ్డారు. అది కూడా నాలుగైదు కిలోలు కాదు.. ఏకంగా 13 కిలోలు తగ్గారామె. తన పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని హన్సిక చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి ఆమె మాట్లాడుతూ -‘‘తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో విష్ణు సరసన కథానాయికగా నటిస్తున్నాను. ఇంకా తమిళ, తెలుగు భాషల్లో ‘బిర్యానీ’, తమిళంలో ‘అరణ్మణై’, ‘మాన్ కరాటే’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. వీటిన్నిటిలోనూ నావి మంచి పాత్రలే కావడం ఆనందంగా ఉంది. నటిగా నన్ను నేను మరింతగా నిరూపించుకోవడానికి ఆస్కారం ఉన్న పాత్రలివి’’ అని చెప్పారు. ఇవి కాకుండా ‘ఇష్క్’ తమిళ రీమేక్‌లో, శింబు సరసన ఓ తమిళ చిత్రం, నాగచైతన్య సరసన ఓ సినిమా, రవితేజతో ఓ సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది. ఇంకొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని హన్సిక తెలిపారు. తెలుగు చిత్రాల ద్వారా కథానాయిక అయ్యి, ఇక్కడ సంపాదించుకున్న గుర్తింపు ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం కావడం, అక్కడా బిజీ అవ్వడంపట్ల హన్సిక ఆనందం వ్యక్తం చేశారు. -
కళ్యాణ్ పేరు బాగా అచ్చొచ్చింది
ఇందులో నా పేరు కళ్యాణ్. నాకు ఎంతో అచ్చొచ్చిన పేరది. ‘ఇష్క్’ ఆడియోకి పవన్కళ్యాణ్గారొచ్చారు. సినిమా పెద్ద హిట్. ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కళ్యాణ్‌గారి పాట పెట్టుకున్నాం. ఆ సినిమా పెద్ద హిట్. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందనిపించింది. అందుకే ఈ సినిమాకు ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ అనే టైటిల్ ఖరారు చేశాం’’ అని నితిన్ అన్నారు. ఆయన కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’. ప్రేంసాయి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సోమసుందరం, రేష్మ నిర్మాతలు. తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ -‘‘మనకున్న సెన్సిబుల్ దర్శకుల్లో గౌతమ్‌మీనన్ ఒకరు. ఆయన డెరైక్షన్‌లో నటించలేకపోయినా... ఆయన సంస్థలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది’’ అని చెప్పారు. ‘‘లవ్, రొమాన్స్ కలగలిపిన యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. త్వరలో పాటలను, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని గౌతమ్‌మీనన్ తెలిపారు. నితిన్‌కి ఇది హ్యాటిక్ హిట్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.