తేజ సజ్జ ‘ఇష్క్‌’ మూవీ రివ్యూ Ishq Not a Love Story Movie Review and Rating in Telugu | Sakshi
Sakshi News home page

Ishq Not a Love Story Movie Review: ఇష్క్‌ మూవీ రివ్యూ

Published Fri, Jul 30 2021 3:21 PM | Last Updated on Fri, Jul 30 2021 7:41 PM

Ishq Not a Love Story Movie Review and Rating in Telugu - Sakshi

టైటిల్‌ : ఇష్క్‌.. నాట్‌ ఎ లవ్‌స్టోరి
జానర్ : రొమాంటిక్‌ థ్రిల్లర్‌
నటీనటులు :  తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
నిర్మాణ సంస్థ : మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్
నిర్మాతలు :   ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
దర్శకత్వం : య‌స్‌.య‌స్‌. రాజు
సంగీతం : మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు
ఎడిటర్‌ : ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
విడుదల తేది : జూలై 30, 2021

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన తేజ సజ్జా‘జాంబి రెడ్డి’తో హీరోగా మారిన సంగతి తెలిసిందే. డిఫరెంట్‌ జానర్‌తో తొలిసారే ప్రయోగం చేసి, తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో నటించిన తాజా చిత్రం ‘ఇష్క్‌. కన్నుగీటుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌. క్రేజీ కాంబినేషన్ లవ్ స్టోరీ ఊహిస్తే.. నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇష్క్ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశారు. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచి అంద‌రిలో ఆస‌క్తి పెంచుతూ వ‌చ్చింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (జూలై 30)న థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘ఇష్క్‌’ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో తేజ సజ్జా మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం.



కథ
వైజాగ్‌కు చెందిన సిద్దార్థ్‌ అలియాస్‌  సిద్దు ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అనసూయ అలియాస్‌ అను(ప్రియా ప్రకాశ్‌ వారియర్‌)తో ప్రేమలో ఉంటాడు. అను బర్త్‌డే సందర్భంగా ఆమెతో లాంగ్‌ డ్రైవ్‌ ప్లాన్‌ చేస్తాడు సిద్దు. కారులో అనును తీసుకొని వైజాగ్‌ బీచ్‌ రోడ్‌కి వెళ్తాడు. ఇద్దరు కలిసి డే మొత్తాని ఎంజాయ్‌ చేస్తారు. సాయంత్రం సమయంలో అనుని ఓ ముద్దు ఇవ్వమని కోరతాడు సిద్దు. దాని వల్ల వీరికి ఓ పెద్ద సమస్య వచ్చిపడుతుంది. అను, సిద్దు సన్నిహితంగా ఉన్న పోటోలు, వీడియోలు తీసిన మాధవ్‌(రవీందర్‌), పోలీసు ఆఫీసర్‌ని అని చెప్పి వారికి బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు. రాత్రంతా కారులోనే వారితో ప్రయాణం చేసి, అనుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. పోలీసు ఆఫీసర్‌ అనే భయంతో మాధవ్‌ని సిద్దు ఏం చేయలేకపోతాడు. కట్‌ చేస్తే.. మరుసటి ఉదయం సిద్ధుకి మాధవ్‌ గురించి ఓ నిజం తెలుస్తుంది. ఇంతకి సిద్ధుకి తెలిసిన నిజం ఏంటి? మాధవ్‌ నిజంగా పోలీసు ఆఫీసరా? కాదా?  తన ప్రియురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన మాధవ్‌కు సిద్ధు ఏ విధంగా బుద్ది చెప్పాడు? చివరకు అను, సిద్ధుల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. 

నటీ నటులు
సిద్దు పాత్రలో తేజ సజ్జ బాగానే నటించాడు. ఫస్టాఫ్‌లో రొమాంటిక్‌ యాంగిల్‌లో కనిపించిన సిద్దు.. సెకండాఫ్‌లో రివేంజ్‌ తీర్చుకునే ప్రేమికుడిగా అద్భుతంగా నటనను కనబరిచాడు. భయపడుతూనే.. తమ జంటను హింసించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. అను పాత్రలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మెప్పించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగానే చేసింది. ఇక శాడిస్ట్‌ పాత్రలో రవీంద్ర విజయ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీ, నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

 

విశ్లేషణ
మలయాళం ఇష్క్‌ సినిమాకి రీమేకే.. ఇష్క్‌.. నాట్‌ ఏ లవ్‌ స్టోరీ.  ఆ సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసిన దర్శకుడు యస్‌ యస్‌ రాజు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఫస్టాఫ్‌ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లను విలన్‌ వేధించిన తీరు  మరీ లెంతీగా చూపించడం సినిమాకు ప్రతికూల అంశమే. అలాగే సెకండాఫ్‌లో కూడా హీరో రివేంజ్‌ తీర్చుకునే సన్నివేశాలు కూడా సాగదీతగా, బోరింగ్‌గా ఉంటాయి.


ఒకే పాయింట్‌ని పట్టుకొని సాగదీయడం సినిమాకి పెద్ద మైనస్‌. జంటలపై దాడుల, వేధింపులు అనే పాయింట్‌ కొత్తగానే ఉన్నా... తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. అయితే ఎండింగ్‌లో సిద్ధు, అనుల మధ్య వచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుట్టుంది. ఇక సినిమాకి ఉన్నంతలో ప్లస్‌ పాయింట్‌ ఏంటంటే మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌ సంగీతం. ఒక్క పాట మినహా మిగతా పాటలు ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. మొత్తంగా ఇష్క్‌ సినిమా చూడడం కాస్త రిస్కే.

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement