
Teja Sajja, Priya Prakash Varrier: సినిమా ట్రైలర్‌లో హీరోయిన్‌ను ముద్దిస్తావా? అని అంత ఈజీగా అడిగేసిన తేజ సజ్జ రియల్ లైఫ్‌లో మాత్రం ఎవరినీ ఆ ప్రశ్న అడగలేదట. సినిమా ఇస్తావా? అని చాలామంది దర్శకనిర్మాతలను అడిగానే తప్ప ఇలా ముద్దు కోసం అమ్మాయిల వెంట పడలేదని తెలిపాడు. అంతేకాదు తనకు రొమాన్స్ సీన్లలో నటించడమన్నా కూడా చాలా భయమని చెప్తున్నాడు.
తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన చిత్రం 'ఇష్క్'. ఈ సినిమా జూలై 30న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు సాక్షితో ముచ్చటించారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ.. 'ఇష్క్' సినిమాలో హీరోగా తన నటనకు 8 మార్కుల వరకు వేసుకోవచ్చన్నాడు. ఇక ఫస్ట్‌డే ఫస్ట్ షాటే ముద్దు సీన్ అవడంతో కొంత ఇబ్బందిగా అనిపించిందన్నాడు. ఫేమస్ హీరోయిన్‌తో నటించడం ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె కన్ను కొట్టింది, తాను తొడ కొట్టాను అంటూ చిలిపిగా బదులిచ్చాడు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఇంకా ఏమేం ముచ్చటించారో కింద వీడియోలో చూసేయండి.