![Isq Movie Is Not A Love Story : Hero Teja Sajja - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/24/teja1.jpg.webp?itok=xD6Hw367)
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. ఈనెల 30న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ చిత్ర మాట్లాడుతూ..అందరూ అనుకున్నట్లుగా ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. యూత్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా తెరకెక్కించినప్పటికీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. స్టోరీ చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది. పాత్రలు ఎక్కడా కూడా పరధి దాటి వెళ్లవు. ఎక్కడా బోర్ అనిపించదు. సినిమా మొదటి నుంచి ముగిసే వరకు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
థ్రిల్ ఫీలయ్యే సందర్బాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. మహతి స్వరసాగర్ అందించిన పాటలు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని పేర్కొన్నాడు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం తేజ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో హనుమాన్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment