
‘‘వింక్ సెన్సేషన్ అంటూ నా వీడియో వైరల్ అయిన టైమ్‌లో చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ టైమ్‌లో చదువు ముఖ్యమనుకున్నాను. గత ఏడాదే బీ.కామ్ పూర్తి చేశాను. అప్పట్లో వచ్చినన్ని ఆఫర్లు ఇప్పుడు రానందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే బాధపడుతూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేం’’ అన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్.
తేజా సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా ఎస్.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇష్క్’. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30 విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ – ‘‘మలయాళ ‘ఇష్క్’ చిత్రాన్ని చూసి తెలుగు రీమేక్ ‘ఇష్క్’ ఒప్పుకున్నాను. ఇది రోటీన్ లవ్‌స్టోరీలా ఉండదు. మలయాళ స్టోరీ సోల్‌ను తీసుకుని, ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్లు మార్పులు చేశారు దర్శకులు రాజుగారు. తెలుగు భాష అర్థం చేసుకోగలను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment