ప్రేమకథ కాదు | Teja Sajja New Movie Ishq | Sakshi
Sakshi News home page

ప్రేమకథ కాదు

Published Sat, Jan 9 2021 6:22 AM | Last Updated on Sat, Jan 9 2021 6:22 AM

Teja Sajja New Movie Ishq - Sakshi

‘డర్టీహరి’ హిట్‌తో డైరెక్టర్‌గా మంచి మార్కులు వేయించుకున్నారు నిర్మాత యం.యస్‌. రాజు. ఆయన దర్శకత్వంలో ‘ఇష్క్‌’ అనే చిత్రం రూపొందనుంది. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది టాగ్‌లైన్‌. తేజ సజ్జా, ప్రియాప్రకాశ్‌ వారియర్‌లు జంటగా నటించనున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ నిర్మించనుంది. ఆర్‌.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్, పరాస్‌ జైన్‌ నిర్మించనున్నారు. 2021లో ఈ చిత్రం ద్వారా తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు సూపర్‌గుడ్‌  ఫిలింస్‌ నిర్మాతలు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూరుస్తుండగా శ్యామ్‌.కె.నాయుడు కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement