Ishq Not A Love Story Trailer Telugu: ఇష్క్‌ ట్రైలర్‌ వచ్చేసింది.. | Teja Sajja Priya Prakash Varrier Movie - Sakshi
Sakshi News home page

ఇష్క్‌ ట్రైలర్‌ వచ్చేసింది..

Apr 15 2021 11:45 AM | Updated on Oct 17 2021 4:16 PM

Teja Sajja Ishq Movie Trailer Released - Sakshi

అనూ, రేపు నైట్‌ నీ బర్త్‌డే ప్లాన్‌ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు, నేను కారులో, ఆ కారు బీచ్‌ రోడ్డులో..

పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన తేజ సజ్జ 'జాంబీరెడ్డి'తో హీరోగా మారాడు. ఈ చిత్రం అతనికి హీరోగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అతడు డర్టీహరి డైరెక్టర్‌ ఎంఎస్‌ రాజుతో దర్శకత్వంలో 'ఇష్క్'‌ అనే సినిమా చేస్తున్నాడు. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఇందులో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తేజతో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రిలీజ్‌ చేశాడు.

ఇందులో "అనూ, రేపు నైట్‌ నీ బర్త్‌డే ప్లాన్‌ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు, నేను కారులో, ఆ కారు బీచ్‌ రోడ్డులో.." అంటూ ఊహల్లో తేలుతున్నాడు హీరో. తీరా అనుకున్నట్లుగానే ప్రియా వారియర్‌ను కారులో ఎక్కించుకుని చక్కర్లు కొడుతున్న హీరో ధైర్యం చేసి 'ఒక ముద్దిస్తావా?' అంటూ మనసులో మాట అడిగేశాడు. అందుకు ఆ భామ సై అందా? లేదా? ఇంతలో వీళ్లిద్దరికీ ఏమైనా జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.

అసలు వీరి కారు ప్రయాణంలో ఏం జరిగింది? వీరిపై ఎవరు, ఎందుకు దాడి చేశారు? అన్న అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇష్క్‌ నాటే సింగిల్‌ లవ్‌స్టోరీ అనేట్లుగా ఉందీ ట్రైలర్‌. ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ నిర్మించనుంది. ఆర్‌.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్, పరాస్‌ జైన్‌ నిర్మించనున్నారు. శ్యామ్‌ కె నాయుడు కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు.

చదవండి: శ్రీకారం చుట్టుకుంది కొత్త చిత్రాలు

'జాంబీ రెడ్డి' సినిమా ఎలా ఉందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement