ఇష్క్ కాంబినేషన్లో మరో సినిమా | Nithin wants to do a love story with Vikram Kumar | Sakshi
Sakshi News home page

ఇష్క్ కాంబినేషన్లో మరో సినిమా

Published Sat, Jun 18 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

ఇష్క్ కాంబినేషన్లో మరో సినిమా

ఇష్క్ కాంబినేషన్లో మరో సినిమా

వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న నితిన్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇష్క్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, యూత్ ఆడియన్స్కు విపరీతంగా నచ్చేసింది.

వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న నితిన్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ఇష్క్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, యూత్ ఆడియన్స్కు విపరీతంగా నచ్చేసింది. దీంతో దశాబ్దకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్కు ఒక్కసారిగా స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఇష్క్ ఇచ్చిన కిక్తో నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం 24 సక్సెస్తో విక్రమ్, అ..ఆ.. సక్సెస్తో నితిన్ మంచి ఫాంలో ఉన్నారు. ఇదే సమయంలో తమ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే విక్రమ్ కె కుమార్, అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. అదే సమయంలో నితిన్ కూడా సంపత్ నంది, కిశోర్ తిరుమల లాంటి దర్శకులకు కమిట్మెంట్స్ ఇచ్చాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి ఇష్క్ మ్యాజిక్ రిపీట్ చేస్తారా..? లేక అనుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేశాక వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement