మళ్లీ రిస్క్ చేస్తున్న హీరో నితిన్!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, నటనతో పాటు వ్యాపార రంగం మీద కూడా దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై అక్కినేని నటవారసుడు అఖిల్ను హీరోగా పరిచయం చేస్తూ అఖిల్ సినిమాను తెరకెక్కించిన నితిన్.. ఆ సినిమాతో విజయం సాధించలేకపోయాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన అఖిల్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో నితిన్కు నష్టాలే మిగిలాయి.
అఖిల్తో లాస్ అయిన నితిన్ మరోసారి రిస్క్ చేయడానికే రెడీ అవుతున్నాడు. సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24' సినిమాను తెలుగులో నితిన్ తన బ్యానర్పై రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే కొంత కాలంగా సూర్య సినిమాలు తెలుగులో పెద్దగా ఆడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 24 సినిమా రైట్స్ తీసుకోవటం రిస్క్ అంటున్నారు విశ్లేషకులు. తనకు ఇష్క్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ మీద నమ్మకంతో డబ్బింగ్ రైట్స్ తీసుకున్న నితిన్కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.