పది రోజుల్లో వంద కోట్లు | 24 first 100 crore film for suriya | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో వంద కోట్లు

Published Fri, May 27 2016 8:10 AM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

పది రోజుల్లో వంద కోట్లు

పది రోజుల్లో వంద కోట్లు

సౌత్ ఇండియన్ స్టార్ సూర్య హీరోగా,  క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 24. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న 24 తాజాగా సౌత్ ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకుంది.

దక్షిణాది వందకోట్ల వసూళ్లు సాధించటం సామాన్యమైన విషయం కాదు. రజనీకాంత్, విజయ్ లాంటి తమిళ స్టార్లు, తెలుగులో మహేష్ లాంటి సూపర్ స్టార్లు మాత్రమే ఈ అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ హీరోల సరసన స్థానం సంపాదించాడు సూర్య. 24 సినిమాతో కేవలం 10 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి తన కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటించాడు. తొలిసారి గా నెగెటివ్ పాత్రలోనూ నటించి ఆకట్టుకున్నాడు. కాలంలో ప్రయణించటం అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన 24, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తమిళ్తో పోలిస్తే తెలుగులోనే మంచి వసూళ్లను సాధించటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement