samnatha
-
విజయ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సమంత
విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా సమంత అతడికి సర్ప్రైజ్ ఇచ్చింది. సోమవారం(మే 9) విజయ్ పుట్టిన రోజు కావడంతో ఆదివారం రాత్రి అతడితో కేక్ కట్ చేయించింది సమంత. కాగా వీరిద్దరు ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు విజయ్ బర్త్‌డే కావడంతో సామ్ సెట్స్‌లో అతడి పుట్టినరోజును సెలబ్రేట్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపింది. చదవండి: అశును వరస్ట్ కంటెస్టెంట్ అన్న రవి, షో మధ్యలో నుంచి వెళ్లిపోయిన నటి కాగా మొన్నామధ్య సమంత బర్త్‌డే రోజు విజయ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ చేసినట్టే చేసి సమంత బర్త్‌డేని సెలబ్రేట్ చేశాడు. తాజాగా ఇప్పుడు సమంత వంతు వచ్చింది. విజయ్‌కు తెలియకుండానే సెట్లోనే అతడి బర్త్‌డే వేడుకకు అన్ని ఏర్పాట్లు చేసింది సామ్. ఇందుకోసం ఓ రూం అంతా డెకరేట్ చేసి, మూవీ టీంతో స్పెషల్‌గా కేక్ తెప్పించింది. ఆదివారం అర్థరాత్రి సమంత, మూవీ టీం కలిసి విజయ్‌తో కేక్ కట్ చేయించారు. కాగా ఈ పార్టీలో డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నాలుగు పదుల వయసులోనూ పదహారేళ్లలా 'యోగా' భామలు
యోగా..శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా యోగా వైపే అడుగులేస్తున్నారు. యోగాతో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే చాలామంది హీరోయిన్లు యోగాతో తమ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. నాలుగు పదుల వయసులోనూ పడుచుపిళ్లలా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా, ఫిట్‌గా తయారువుతున్న హీరోయిన్లు యోగా గురించి ఏం అంటున్నారో తెలుసుకుందాం. బాలీవుడ్ హీరోయిన్లలో యోగా క్వీన్ అనగానే గుర్తొచ్చేది శిల్పాశెట్టి. 46ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యోగాపై ఏకంగా ఒక పుస్తకమే రాసేసింది. యోగాతోనే తన డే రొటీన్ మొదలవుతుందని పలుమార్లు చెప్పిన శిల్పా..ప్రతిరోజూ ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. అందుకే ఇప్పటికీ వన్నెతరగని అందంతో సూపర్ ఫిట్‌గా అలరిస్తుంది. యోగా నేర్చుకోవాలనుకునే చాలామంది శిల్పాశెట్టి వీడియోలు ఫాలో అవుతారంటే యోగాపై ఆమెకున్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఫిట్నెస్తో యంగ్ హీరోయిన్లకు సైతం సవాలు విసురుతున్న మరో బాలీవుడ్ నటి మలైకా అరోరా. 50కి దగ్గర్లో ఉన్నా నేటికీ ఎంతో ఫిట్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. నిత్యం గంటల తరబడి యోగా చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ప్రియుడు అర్జున్‌కపూర్ చేత కూడా యోగాసానాలు వేయిస్తుంది. యోగాపై అవగాహన కల్పించేందుకు #StartTohKaro అనే ఒక కార్యక్రమం సైతం చేపట్టింది. ఫిట్నెస్ విషయంలో సమంత చాలా శ్రద్ధ తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అబ్బాయిలకు సమానంగా బరువులు ఎత్తుతూ తన స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసిన సామ్..రోజులో కొంత సమయాన్ని యోగా కోసం తప్పకుండా కేటాయించాలని అభిమానులకు సూచిస్తున్నారు. భర్త నాగచైతన్యతో కలిసి యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. హీరోయిన్ కరీనా కపూర్ ప్రతిరోజు ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. ప్రతిరోజూ యోగా తన దినచర్యలో భాగమైపోయిందని చెప్పుకొచ్చింది. అందుకే డెలీవరీ తర్వాత కూడా నిపుణుల సూచనలతో యోగాసనాలు వేస్తూ నేటికీ జీరో సైజ్ కాపాడుకుంటుంది. యోగాతో అందంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అలవడుతుందని అంటోంది నటి మంచు లక్ష్మి. ఆమె పన్నెండేళ్లుగా యోగా చేస్తోంది. ప్రతిరోజూ యోగా కోసం కొంత సమయం కేటాయించాలని పేర్కొంటుంది. కూతురు నిర్వాణతో కలిసి ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. యోగాతో మరింత దృఢంగా మారొచ్చని అంటోంది మంచు లక్ష్మి. రకుల్‌ప్రీత్ సింగ్‌కు ఫిట్నెస్ మీద ఎంతో ఫోకస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ తర్వాత యోగా చేయనిదే వేరే పని చేయదట. ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా యోగా వల్లే తాను కరోనా నుంచి కోలుకున్నానని చెప్పుకొచ్చింది. యోగా దినోత్సవం సందర్భంగా కంజుర్ క్రియతో తన దినచర్యను ప్రారంభిస్తున్నానని పేర్కొంటూ ఆ ఫోటోలను ఇన్స్టాగగ్రామ్లో షేర్ చేసింది. ప్రతిరోజు తన దినచర్యలో యోగా భాగమైపోయిందంటోంది నటి మాధురీ దీక్షిత్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలను షస్త్రర్ చేసిన ఆమె.. నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి అంటూ అభిమానులను ప్రోత్సహించింది. -
శ్రీమతికో కేక్
లాక్డౌన్ వేళ సమంత జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. మంగళవారం (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భార్య కోసం నాగచైతన్య స్వయంగా ఓ కేక్‌ను తయారు చేశారు. చైతన్య కేక్ బేక్ చేసిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సమంతకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. నాగచైతన్య, సమంత -
‘నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు’
పెళ్లి తరువాత డిఫరెంట్ సినిమాలు చేస్తున్న సమంత, మరో చాలెంజింగ్ రోల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రంగస్థలం, యూటర్న్, మజిలి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సామ్, ఓ బేబి అంటూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సీనియర్ లక్ష్మీ మరో ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య, రావూ రమేష్, రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
గళం గాళ్స్
కళ్లు మూసుకున్నా వీళ్లే కనపడతారు. అవునూ.. తెర మీద ఈ బంగారు బొమ్మలు కనపడుతుంటే కళ్లు మూసుకునే ఫూల్ ఎవరైనా ఉంటారా? చాన్స్ లేదు. కళ్లు మూసే చాన్సే లేదు. మరి.. కళ్లు మూసుకున్నా వీళ్లే కనపడతారంటున్నారు. వాయిస్ అమ్మా వాయిస్. ఇక యాక్టింగ్, పెర్ఫార్మెన్సే కాదు.. డబ్బింగ్ కూడా వాళ్లే చెప్పుకుంటున్నారు. వీళ్లిక గ్లామర్ గాళ్సే కాదు.. గళం గాళ్స్ కూడా. చెప్పాం కదా.. ఇక ముందు కళ్లు మూసుకున్నా వీళ్లే కనిపిస్తారు... కాదు.. వినిపిస్తారు. పాత రోజుల్లో మన హీరోయిన్లు ఎంచక్కా వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకుని పాటలు కూడా పాడుకునేవారు. ఆ తర్వాత బొంబాయి హీరోయిన్ల దిగుమతి ప్రారంభం కావడంతో వాళ్లు షూటింగ్ స్పాట్లో హిందీలో చిలుక పలుకులు పలికితే దానికి మన తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు వెనుక నుంచి గాత్రదానం చేయడం మొదలైంది. ఆ తర్వాత అడపాదడపా మన భాష రాని హీరోయిన్లు తెలుగు భాష నేర్చుకొని మరీ డబ్బింగ్‌లు చెబుతున్నారు. ఈ మధ్య ఈ జోరు పెరిగింది. ఇప్పుడు కథానాయికలు మాకింక మాట సాయం వద్దు అంటున్నారు. పాత్రకు పరిపూర్ణత తీసుకురావడం కోసం తమ సొంత గొంతుని వినిపించడానికి రెడీ అవుతున్నారు. అలా ఈ ఏడాది ఇప్పటివరకూ వచ్చిన, రానున్న చిత్రాల్లో తమ సొంత గొంతునే వినిపించడానికి ప్రిపేర్ అయిన హీరోయిన్లు ఎవరో చూద్దాం. దేవదాస్‌లో సొంత గొంతు ‘ఛలో, గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ దిశగా అడుగులేస్తున్న నటి రష్మికా మండన్నా. తన నెక్ట్స్ రిలీజ్ నాగార్జున, నానీ మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఈ సినిమాలో తన గొంతుతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చెయ్యడానికి ఉవ్విళ్లూరుతున్నారు రష్మిక. సెప్టెంబర్ నెలాఖరులో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు ఈ కన్నడ భామ. కన్నడం, తెలుగు కొంచెం దగ్గర దగ్గరగా ఉండటంతో తెలుగు మాట్లాడటం తనకు పెద్ద కష్టం అనిపించకపోవచ్చు. సొంత గొంతు సమేతంగా..! ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’లో అరువు గొంతుకు స్ట్రిక్ట్‌గా నో అన్నారు పూజా హెగ్డే. త్రివిక్రమ్ సినిమాల్లో సంభాషణలకే ఫస్ట్ సీట్ దక్కుతుంది. అలాంటప్పుడు భాష మీద పట్టుంటే తప్ప అనుకున్నంత సులువు అవ్వదు తెలుగు డబ్బింగ్. అయినా రిస్క్ తీసుకోదలిచారు పూజా హెగ్డే. ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారామె. ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. దసరాకు రిలీజ్ కానున్న ఈ సినిమాలో పూజ ఫస్ట్ టైమ్ తెలుగు సంభాషణలు ఎలా పలుకుతారో వేచి చూడాలి. ఆల్రెడీ ఈ ఏడాది రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో హీరోయిన్స్ కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌తో తెలుగు డబ్బింగ్ చెప్పించిన త్రివిక్రమ్ ‘అరవింద సమేత..’కు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సూటిగా నత్తి లేకుండా నటిగా ఎనిమిదేళ్ల కెరీర్, తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నారు సమంత. కానీ చాలా సంవత్సరాలు తన గొంతును మనకు వినిపించలేదు. ఆమె సక్సెస్‌లో చిన్న వాటా సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి దక్కక మానదు. సమంత తొలి తెలుగు సినిమా ‘ఏ మాయ చేసావె’లో జెస్సీ పాత్రకు ఆమె చెప్పిన డబ్బింగ్ స్పెషల్ అట్రాక్షన్. అప్పుడు మొదలైన ఈ మాట సాయం చాలా కాలం సాగింది. చిన్మయి వాయిస్ సమంతదేనా అనిపించేంత పాపులర్ అయిందంటే మామూలు విషయం కాదు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘మహానటి’ సినిమా ద్వారా అభిమానులకు తన సొంత గొంతును వినిపించారు సమంత. మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్ర. పేరుకే మధురవాణి కానీ సూటిగా సుత్తి లేకుండా మధురంగా మాట్లాడలేదు. కంగారు వస్తే నత్తి వచ్చేస్తుంది. నిజానికి నత్తి నత్తిగా డబ్బింగ్ చెప్పడం కష్టం. పైగా ఫస్ట్ టైమ్ డబ్బింగ్. కానీ సమంత నత్తి డైలాగ్స్ పలికి చప్పట్లు కొట్టించుకున్నారు. రీలీజ్‌కు రెడీ అయిన ఆమె లేటెస్ట్ సినిమా ‘యు టర్న్’ సినిమాలో కూడా తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ ద్విభాషా చిత్రంలోనూ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నారామె. సమంత తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న రెండు సినిమాల్లో ఆమె జర్నలిస్ట్ పాత్ర పోషించడం విశేషం. ‘హలో.. నమష్కారం’ అంటూ ఆడియో వేడుకల్లో, ప్రెస్‌మీట్స్‌లో ముద్దు ముద్దుగా తెలుగు పలికే పరభాషల కథానాయికలు తెలుగు నేర్చుకుని మరీ సొంత గొంతు వినిపించాలనుకోవడం అభినందనీయం. సొంత గొంతు వినిపిస్తే ‘కంప్లీట్ ఆర్టిస్ట్’ అనిపించుకునే అవకాశం ఉందని డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు. కొన్ని సార్లు పరిపూర్ణత కోసం అత్యుత్సాహం ప్రదర్శించి డబ్బింగ్ చెప్పుకున్నా పదాలు సరిగ్గా రాకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే భాషలోని మాధుర్యం బట్టీ పడితే వచ్చేది కాదు కదా. అందుకే వీలైనంత పర్ఫెక్ట్ తెలుగు సంభాషణలు పలకడానికి కథానాయికలు ట్రై చేస్తున్నారు. ఇలా ఆల్రెడీ డబ్బింగ్ చెప్పుకున్న వాళ్లందరూ ఇక మీదట కంటిన్యూ చేస్తామని అంటున్నారు. రాబోతున్న నటీమణులు కూడా త్వరలోనే సొంతంగా డబ్బింగ్ చెబుతాం అంటున్నారు. ఇలా హీరోయిన్స్ అందరూ తమ పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకోవడం మంచి పరిణామమే. ఈ లిస్ట్ ఇలానే పెరుగుతూ ఉంటుందని, ఉండాలని కోరుకుందాం. వంక పెట్టలేని కీర్తి ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఫస్ట్ టైమ్ తన గొంతును వినిపించారు కీర్తీ సురేశ్. అదో చాలెంజ్. ఆ తర్వాత మరో పెద్ద చాలెంజ్‌ను ఎంచుకున్నారామె. అదేంటంటే.. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రను పోషించడమే కాకుండా ఆ పాత్రకు స్వయంగా సంభాషణలు చెప్పడం. కానీ ఎక్కడా కూడా వంక పెట్టలేనట్టుగా నటించడమే కాకుండా సంభాషణలు కూడా బాగా పలికారు కీర్తీ సురేశ్. సావిత్రి జీవితంలో అన్ని దశలను చూపించిన కథ ఇది. యవ్వనంలోని కొంటెతనం, సూపర్ సక్సెస్‌లో ఉన్నప్పుడు హుందాతనం, అన్నీ కోల్పోయిన తర్వాత నైరాశ్యం.. ఇలా అన్ని రకాల్లో సంభాషణలు పలకడం కష్టం. కానీ వీటన్నింటినీ అవలీలగా చేసి చూపించారు కీర్తి. తాగుడుకు బానిస అయిన పాత్రలో లావుగా కనిపిస్తారు. ఆ సీన్స్‌కు డబ్బింగ్ చెప్పడం కోసం నోట్లో దూదులు ఉంచుకొని మరీ డబ్బింగ్ చెప్పారామె. ఈ కష్టాన్నంతా బాక్సాఫీస్ సక్సెస్ ఇచ్చి తుడిచేసింది. కో–స్టార్స్‌కీ డబ్బింగ్! విశేషం ఏంటంటే తమ పాత్రలకే కాదు తమ కో–స్టార్స్‌కి కూడా కొన్ని సందర్భాల్లో డబ్బింగ్ చెప్పి ఆశ్చర్యపరిచారు పరభాష నటీమణులు. ‘చందమామ’ సినిమాలో కాజల్ పాత్రకు చార్మీ డబ్బింగ్ చెప్పారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు మరో హీరోయిన్ ఇషా తల్వార్ పాత్రకు కూడా గొంతు సాయం చేశారు నిత్యామీనన్. వీళ్లకన్నా ముందు ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నవాళ్ల గురించి తెలుసుకున్నాం. వీళ్లకంటే ముందే ఈ లిస్ట్‌లో ఉన్న కొందరు నటీమణుల లిస్ట్ గమనిస్తే ‘అలా మొదలైంది’లో నిత్యామీనన్, ‘రాఖీ’ సినిమాలో చార్మీ, ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో నయనతార, ‘మొగుడు’ సినిమా కోసం తాప్సీ, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్, ఇంకా నివేథా థామస్, రాశీ ఖన్నా, అనుపమా పరమేశ్వరన్ సొంత గొంతు వినిపించారు. ‘ఫిదా’లో సాయి పల్లవి తెలంగాణ యాస నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పారు. కుర్ర తారలు ఎంత పట్టుదలగా ఉన్నారో చెప్పడానికి ఇదో నిదర్శనం. తెలుగు రాని సూపర్ స్టార్ మణిరత్నం ‘చెలియా’ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు బాలీవుడ్ బ్యూటీ అదితీ రావ్ హైదరీ. అయితే అది డబ్బింగ్ సినిమా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత తెలుగులో చేసిన ‘సమ్మోహనం’లో తన గొంతునే వినిపించారు. ఈ సినిమాలో తెలుగు వచ్చీ రానీ, తెలుగుతో ఇబ్బంది పడే స్టార్ హీరోయిన్ సమీరా రాథోడ్లా నటించారు అదితీరావ్ హైదరీ. సో.. అక్కడక్కడా పదాల ఉచ్ఛారణ స్పష్టంగా లేకపోయినా పాత్ర స్వభావంలో కొట్టుకుపోయింది. పాత్ర నచ్చడంతో డబ్బింగ్ చెప్పుకున్నాను అని పేర్కొన్నారామె. తన నటనకే కాకుండా డబ్బింగ్‌కి కూడా మంచి మార్క్స్ పడ్డాయి. సినిమాతో పాటు అదితీ కూడా సూపర్ హిట్ అయ్యారు. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
పది రోజుల్లో వంద కోట్లు
సౌత్ ఇండియన్ స్టార్ సూర్య హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 24. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న 24 తాజాగా సౌత్ ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాది వందకోట్ల వసూళ్లు సాధించటం సామాన్యమైన విషయం కాదు. రజనీకాంత్, విజయ్ లాంటి తమిళ స్టార్లు, తెలుగులో మహేష్ లాంటి సూపర్ స్టార్లు మాత్రమే ఈ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ హీరోల సరసన స్థానం సంపాదించాడు సూర్య. 24 సినిమాతో కేవలం 10 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి తన కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటించాడు. తొలిసారి గా నెగెటివ్ పాత్రలోనూ నటించి ఆకట్టుకున్నాడు. కాలంలో ప్రయణించటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 24, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తమిళ్‌తో పోలిస్తే తెలుగులోనే మంచి వసూళ్లను సాధించటం విశేషం. -
వంద కోట్ల క్లబ్లో సూర్య
సౌత్ ఇండియన్ స్టార్ సూర్య హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 24. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న 24 తాజాగా సౌత్ ఇండస్ట్రీలో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాది వందకోట్ల వసూళ్లు సాధించటం సామాన్యమైన విషయం కాదు. రజనీకాంత్, విజయ్ లాంటి తమిళ స్టార్లు, తెలుగులో మహేష్ లాంటి సూపర్ స్టార్లు మాత్రమే ఈ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ హీరోల సరసన స్థానం సంపాదించాడు సూర్య. 24 సినిమాతో కేవలం 10 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి తన కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటించాడు. తొలిసారి గా నెగెటివ్ పాత్రలోనూ నటించి ఆకట్టుకున్నాడు. కాలంలో ప్రయణించటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 24, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తమిళ్‌తో పోలిస్తే తెలుగులోనే మంచి వసూళ్లను సాధించటం విశేషం. -
మహేశ్ సమంతను టార్గ్‌ట్ చేశాడా?