సూర్య.. 24లో ఆ సీన్స్ కట్ చేశాడు
సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం 24. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన 24 ,ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాల పరంగా డివైడ్ టాక్ ఉన్నా.. సూర్య నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే భారీ బడ్జెట్తో తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించిన సూర్య, ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమాను చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
సినిమాలో సూర్య, సమంతల మధ్య వచ్చే లవ్ ట్రాక్ బోర్ కొట్టిస్తుందన్న టాక్ వినిపిస్తుండటంతో ఆ సీన్స్ను రీ ఎడిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ హాఫ్తో పాటు సెకండ్ హాఫ్లోనూ కలిపి దాదాపు 9 నిమిషాలను తీసేయాలని నిర్ణయించారట. ఆదివారం నుంచే ఎడిట్ చేసిన వర్షన్ థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఆ సీన్స్ తీసేసిన తరువాత అయినా 24కు సూపర్ హిట్ టాక్ వస్తుందేమో చూడాలి.