భార్యతో రొమాన్స్ కు మరోసారి సిద్ధం.. | Film with Jyotika will be announced in May, says actor Suriya | Sakshi
Sakshi News home page

భార్యతో రొమాన్స్ కు మరోసారి సిద్ధం..

Published Fri, May 6 2016 12:09 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

భార్యతో రొమాన్స్ కు మరోసారి సిద్ధం.. - Sakshi

భార్యతో రొమాన్స్ కు మరోసారి సిద్ధం..

చెన్నై: మంచి కథ దొరికితే భార్య జ్యోతికతో కలిసి నటిస్తానని తమిళ స్టార్ హీరో సూర్య అంటున్నాడు. నేడు సూర్య హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ '24' విడుదలైంది. ఇందులో సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించాడు. ముందుగా ఏప్రిల్ నెలాఖరున సినిమా రిలీజ్కు ప్లాన్ చేసినా టాలీవుడ్లో సరైనోడు రిలీజ్ ఉండటంతో కొన్ని రోజులు వాయిదా వేశామని తెలిపాడు. మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి జ్యోతిక కూడా సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే.

సూర్యతో వివాహం తర్వాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక సుమారు తొమ్మిదేళ్ల తరువాత ఇటీవల 36 వయదినిలే అనే తమిళ చిత్రంలో నటించగా, సూర్య అతిథి పాత్రలో కనిపించి ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచాడు. మరోసారి జ్యోతికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని, ఈ నెలఖరులోగా సూర్య తన తర్వాతి ప్రాజెక్టు వివరాలు వెల్లడిస్తానన్నాడు. ఇప్పటికే భార్య జ్యోతికతో కలిసి 5 తమిళ సినిమాల్లో నటించినట్లు తెలిపాడు. ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా తన బ్యానర్ లోనే తీయాలనుకుంటున్నాని, అందుకే ఓ మంచి కథ కోసం వేట మొదలు పెట్టినట్లు సూర్య వివరించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement