కళ్యాణ్ పేరు బాగా అచ్చొచ్చింది | Nithin's Courier Boy Kalyan | Sakshi
Sakshi News home page

కళ్యాణ్ పేరు బాగా అచ్చొచ్చింది

Published Sun, Sep 29 2013 1:17 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

కళ్యాణ్ పేరు బాగా అచ్చొచ్చింది - Sakshi

కళ్యాణ్ పేరు బాగా అచ్చొచ్చింది

ఇందులో నా పేరు కళ్యాణ్. నాకు ఎంతో అచ్చొచ్చిన పేరది. ‘ఇష్క్’ ఆడియోకి పవన్‌కళ్యాణ్‌గారొచ్చారు. సినిమా పెద్ద హిట్. ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కళ్యాణ్‌గారి పాట పెట్టుకున్నాం. ఆ సినిమా పెద్ద హిట్. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందనిపించింది. అందుకే  ఈ సినిమాకు ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ అనే టైటిల్ ఖరారు చేశాం’’ అని నితిన్ అన్నారు. ఆయన కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’. ప్రేంసాయి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సోమసుందరం, రేష్మ నిర్మాతలు. తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ -‘‘మనకున్న సెన్సిబుల్ దర్శకుల్లో గౌతమ్‌మీనన్ ఒకరు. ఆయన డెరైక్షన్‌లో నటించలేకపోయినా... ఆయన సంస్థలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది’’ అని చెప్పారు. ‘‘లవ్, రొమాన్స్ కలగలిపిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. త్వరలో పాటలను, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని గౌతమ్‌మీనన్ తెలిపారు. నితిన్‌కి ఇది హ్యాటిక్ హిట్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement