
టాలీవుడ్ హీరో నితిన్, షాలినిల వివాహ వేడుకలు హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్ ఫలక్‌నుమా హోటల్‌లో అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఈనేపథ్యంలో నవ వరుడు నితిన్‌కు ఓ అద్భుతమైన బహుమతి లభించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజ్ ఫలక్‌నుమా హోటల్‌కు శుక్రవారం చేరుకుని నితిన్‌ని ఆశీర్వదించారు. ఆయన వెంట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) ఉన్నారు. దీంతో పవన్ రాకతో అతని వీరాభిమాని నితిన్ ఆనందంలో మునిగిపోయారు.
వివాహ శుభాకాంక్షలు తెలియజేసేందుకు స్వయంగా వచ్చిన పవర్ స్టార్, త్రివ్రిక్రమ్, చినబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పెళ్లి కొడుకు ఫంక్షన్‌కు హాజరై విషెస్ తెలిపిన ముగ్గురు అతిథులకు చాలా చాలా థాంక్స్’ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. ఇక ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరుగనున్న ఈ పెళ్లి వేడుకలో ప్రభుత్వ నియమ నిబంధనలను పక్కాగా అనుసరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొననున్నారు.
(మెహందీలో మెరిసిన షాలిని-నితిన్)
Comments
Please login to add a commentAdd a comment