
సాక్షి, హైదరాబాద్: నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ' విజయం సాధించడంతో నితిన్‌తో పాటు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల పవన్ కల్యాణ్‌ని కలిసారు. ఈ సందర్భంగా పవన్ చిత్ర బృందాన్ని, నితిన్‌ను అభినందించారు. ‘భీష్మ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్‌ను పవర్ స్టార్ ప్రశంసించారు. ఈ విషయంపై నితిన్ తన ట్విటర్ అకౌంట్‌లో ఫోటోలు షేర్ చేస్తూ.. 'వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సర్’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్’
ఇక దర్శకుడు వెంకీ కుడుముల కూడా తన ట్విటర్ ఖాతాలో.. ‘భీష్మ సినిమా తీసినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను అభినందించారు. ఈ క్షణం నాకైతే జీవితాంతం గుర్తిండిపోతుంది’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. భీష్మ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళని రాబడుతూ.. నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకుపోతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ‘భీష్మ’ మూవీ రివ్యూ
POWERSTAR congratulating BHEESHMA team for its success!! Priceless moment..love you forever sirr 😍😍😍🤗🤗🤗@VenkyKudumula @vamsi84 @SitharaEnts pic.twitter.com/y38ZKF66zr
— nithiin (@actor_nithiin) February 24, 2020