ప్రేక్షకులు మారిపోయారంటున్నాడు హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn). ఒకప్పుడు తమ తప్పుల్ని జనాలు చూసీచూడనట్లు వదిలేసేవారని, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని భూతద్దంలో చూస్తున్నారంటున్నాడు. ప్రస్తుతం అజయ్ ఆజాద్ (Azaad Movie) అనే సినిమా చేస్తున్నాడు.
మా తప్పుల్ని క్షమించేవాళ్లు
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అజయ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మేము పని చేస్తున్న ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకునేవాళ్లం. అప్పుడు నేర్చుకోగలిగేంత సమయం, స్వేచ్ఛ ఉండేవి. అప్పటి ప్రేక్షకులు మా తప్పుల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు వారి కంటపడ్డా క్షమించేవాళ్లు.
కానీ ఇప్పుడున్నవాళ్లు ప్రతిదాన్ని పట్టిపట్టి చూస్తున్నారు. ఏమాత్రం తప్పులు కనిపించినా అస్సలు క్షమించట్లేదు. భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి వారి అంచనాల్ని అందుకునేందుకు నటీనటులు మరింత సిద్ధంగా ఉండాలి. అయినా ఈ జనరేషన్ యాక్టర్స్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు అని చెప్పుకొచ్చాడు.
సినిమా
కాగా అజయ్.. గతంలో అనేక సినిమాల్లో గుర్రపు సార్వీ చేశాడు. అలాగే తన లేటెస్ట్ మూవీ ఆజాద్ చిత్రంలోనూ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడట! ఈ చిత్రంతో అజయ్ బంధువు ఆమన్ దేవ్‌గణ్, రవీనా టండన్ కూతురు రాషా తడానీ వెండితెరకు పరిచయం కానున్నారు. డయానా పెంటనీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రగ్యా కపూర్, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 17న విడుదల కానుంది.
అజయ్ దేవ్‌గణ్ అసలు పేరు?
అజయ్ అసలు పేరు విశాల్. ఇండస్ట్రీలో చాలామంది విశాల్ పేరుతో ఉండటంతో అతడు పేరు మార్చుకున్నాడు. 1991లో ఫూల్ ఔర్ కాంటే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మార్కులు కొట్టేసి ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. అతడు హీరోగా నటించిన రెండో సినిమా జిగార్. ఇందులో మార్షల్ ఆర్ట్స్ కూడా చేశాడు. కరిష్మా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
(చదవండి: Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా)
హీరోగా, విలన్‌గా..
నాజయజ్, జకమ్, హమహ దిల్ దే చుకే సనమ్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ అండ్ కంపెనీ, కంపెనీ, గంగాజల్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సింగం, తాన్హాజీ, దృశ్యం.. ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. దీవాంగే, ఖాకీ, కాల్ వంటి చిత్రాల్లో విలన్‌గానూ యాక్ట్ చేశాడు. ఇటీవలే సింగం అగైన్, నామ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
నిర్మాతగా..
హిందుస్తాన్ కీ కసమ్, దిల్ క్యా కరే, రాజు చాచా, యు మి ఔర్ హమ్, సన్ ఆఫ్ సర్దార్, సింగం రిటర్న్స్, తాన్హాజీ, భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, రన్‌వే 34, సింగం అగైన్ వంటి పలు చిత్రాలను నిర్మించాడు. బాలీవుడ్‌లో సొంత ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన మొదటి హీరో కూడా ఈయనే! ఈయన తెలుగులో నటించిన ఏకైక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR Movie).
చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!
Comments
Please login to add a commentAdd a comment