వెంకటేశ్‌ చిత్రంలో మరో స్టార్ హీరో.. ఎవరంటే? | Arya As Manas In Venkatesh's Saindhav Movie - Sakshi
Sakshi News home page

Saindhav: సైంధవ్‌లో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Published Wed, Aug 30 2023 9:18 PM | Last Updated on Thu, Aug 31 2023 9:23 AM

Arya Lead Role In Venkatesh Saindhav  - Sakshi

వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సైంధవ్. ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రంలో మరో హీరో నటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి)

ఆ హీరోకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఆర్య ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్‌లో ఆర్య లుక్‌ ఫ్యాన్సను తెగ ఆకట్టుకుంటోంది. తుపాకీ చేతపట్టి ఆర్య నడుస్తూ కనిపిస్తోన్న లుక్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. కాగా.. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా..  తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 22న సైంధవ్‌ విడుదల కానుంది. 

(ఇది చదవండి: రక్షాబంధన్‌ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement