భారీ ధరకు సైంధవ్‌ ఓటీటీ రైట్స్‌.. పోటీపడి మరీ దక్కించుకున్న ఆ సంస్థ! | Venkatesh Saindhav Movie OTT Rights Locked this Platform | Sakshi
Sakshi News home page

Saindhav Movie OTT Rights: భారీ ధరకు సైంధవ్‌ ఓటీటీ రైట్స్‌.. పోటీపడి దక్కించుకున్న సంస్థ!

Jan 13 2024 1:56 PM | Updated on Jan 13 2024 2:23 PM

Venkatesh Saindhav Movie OTT Rights Locked this Platform - Sakshi

టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్‌. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీలైన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్‌డ్‌ టాక్ వినిపిస్తోంది. ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్ర ఇప్పటికే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వెంకటేశ్ సైతం సైంధవ్‌ సినిమాతో పోటీలో నిలిచారు. 

అయితే ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ గురించి నెట్టింట చర్చ మొదలైంది. వెంకీమామ చిత్రం ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైంధవ్‌ ఓటీటీ డీల్‌ వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ మూవీ డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పోటీపడి సొంతం చేసుకున్నట్లు నెట్టింట వార్త తెగ వైరలవుతోంది. అయితే సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే  ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement