చిన్న సినిమాకి బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరో | a popular artist agreed to become brand ambassador for RACHAYITHA | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాకి బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరో

Published Sat, Nov 11 2017 2:48 PM | Last Updated on Sat, Nov 11 2017 2:50 PM

a popular artist agreed to become brand ambassador for RACHAYITHA  - Sakshi

నూతన దర్శకుడు విద్యాసాగర్‌ రాజు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రచయిత’. థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల నిర్మిస్తున్నారు. ప్రీ లుక్‌ తో అందరి దృష్టిని ఆకర్షించిన రచయిత టీం.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకున్నారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూలిపల్ల మాట్లాడుతూ.. ‘స్వచ్చమైన-అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. భయం అనేది మనిషి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాగలదు, ఎలా ప్రభావం చూపగలదు అనేది ప్రధాన కథాంశం. 1950 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇది. పీరియాడిక్ ఫిలిమ్ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ఖర్చుతో రూపొందించాం. సంచితా పడుకోనే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా కోసం వైజాగ్ లో వేసిన భారీ సెట్, ఆ సెట్ లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆశ్చర్యపరుస్తాయి. మా డైరెక్టర్ కమ్ హీరో విద్యాసాగర్ నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాడు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నాం. ఇకపోతే.. మా సినిమాకి ఒక స్టార్ నటుడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. సినిమాకి బ్రాండ్ షిప్ చేయడం అనేది ఇదే మొదటిసారి’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement