Tragic Life Story Of Bhagwan Dada A Once Richest Actor Spent Last Days In Chawl - Sakshi
Sakshi News home page

Tragic Life Story Of Richest Actor: దేశంలోనే రిచ్‌ హీరో.. చివరికి బంగ్లా, కార్లు, భార్య నగలు సైతం అమ్మేసి మురికివాడలో..

Published Mon, Jul 31 2023 12:32 PM | Last Updated on Mon, Jul 31 2023 1:25 PM

Tragic Life Story Of Bhagwan Dada A Once Richest Actor Spent Last Days In Chawl - Sakshi

డబ్బుతో ఏం చేస్తారు? ఇదేం ప్రశ్న అనుకునేరు.. డబ్బును అందరూ ఒకేలా వాడరు. కొందరు పొదుపు చేస్తారు, కొందరు ఖర్చు చేస్తారు, మరికొందరేమో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. బోలెడంత డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువశాతం జనాలు విలాసాలకే వినియోగిస్తుంటారు. ఇలా ఉన్నదంతా ఖర్చు పెట్టి చివరికి కడు పేదరికాన్ని గడిపిన సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంది. అందులో ఒకరే బాలీవుడ్‌ స్టార్‌ హీరో భగవాన్‌ దాదా.

మిల్లులో పనిచేసి..
ఈయన కార్మికుడు, నటుడు, డ్యాన్సర్‌, దర్శకుడు, నిర్మాత! భగవాన్‌ దాదా అసలు పేరు భగవాన్‌ ఆబాజీ పలావ్‌. కుస్తీ పోటీల్లో ప్రతిభ చూపిన ఇతడిని అందరూ ముద్దుగా భగవాన్‌ దాదా అని పిలిచుకునేవారు. మొదట ఈయన బాంబేలోని వస్త్ర మిల్లులో పని చేశాడు. విరామం లేకుండా పని చేస్తున్న ఈయనకు ఎప్పటికైనా సినిమాల్లోకి రావాలన్న ఆశ, ఆసక్తి రెండూ ఉండేవి. ఈ ఆసక్తితోనే సినిమా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయడం ప్రారంభించాడు.

చిన్న సినిమాలతో హిట్‌
చిత్రయూనిట్‌కు భోజనం సమకూర్చడం దగ్గరి నుంచి నటీనటుల దుస్తుల ఎంపిక వరకు అన్నీ తనే స్వయంగా చూసుకుని బడ్జెట్‌ పెరగకుండా జాగ్రత్తపడేవాడు. 1938లో బహదూర్‌ కిసాన్‌ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. తర్వాత చిన్నాచితకా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అవి సక్సెస్‌ కావడంతో తక్కువ కాలంలోనే అతడి పేరు మార్మోగిపోయింది. ఈ ధైర్యంతో భగవాన్‌ నిర్మాతగానూ మారాడు. ప్రేమ, యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు.

రోజుకో కారు, అతి పెద్ద బంగ్లా
అయితే ఏదైనా సామాజిక చిత్రం తీయమని 1951లో రాజ్‌కపూర్‌ సలహా ఇవ్వడంతో అల్బెలా తీశాడు. ఇది ఆ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా అందులోని షోలా జో భడ్కే అనే పాటకు భగవాన్‌ వేసిన స్టెప్పులు హైలైట్‌ అయ్యాయి. బాలీవుడ్‌లో గొప్ప డ్యాన్సర్‌గా ఇతడిని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇకపోతే జమేలా, భాగం భాగ్‌ అనే సూపర్‌ హిట్స్‌ బాలీవుడ్‌కు అందించాడు. ఊహించని విజయాలతో అతడికి పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చింది. ఒకేసారి స్టార్‌డమ్‌ స్టేటస్‌ రావడంతో విలాసాలకు బాగా ఖర్చు చేసేవాడు. ఈ ‍క్రమంలో ముంబై జుహులో 25 గదులు ఉన్న పెద్ద బంగ్లా కొని అందులోనే నివసించాడు. వారం రోజులపాటు రోజుకో కారులో తిరిగేలా ఏడు లగ్జరీ కార్లను మెయింటైన్‌ చేశాడు.

భార్య నగలు కూడా అమ్మేయాల్సిన దుస్థితి
కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. అతడి సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. 1960 నుంచి భగవాన్‌.. హీరో స్థాయి నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పనిచే స్థాయికి పడిపోయాడు. నెమ్మదిగా ఆ కాస్త అవకాశాలు రావడం కూడా కనుమరుగైపోయాయి. ఆర్థిక అవసరాల కోసం ఒక్కో కారును, ఇంటిని, భార్య నగలను కూడా అమ్మేయాల్సి వచ్చింది. చివరికి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో మురికివాడలో జీవనం కొనసాగించాడు. 2002లో 89 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు.

చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలివే!
రెండు పెళ్లిళ్లు ఫెయిల్‌.. ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement