Raviteja Ramarao Onduty Again Postponed From June 17th Deets Inside - Sakshi
Sakshi News home page

Ramarao On Duty Postponed: నిర్మాత, హీరో మధ్య మనస్పర్థలు?, అందుకే పదేపదే వాయిదా!

Published Tue, May 31 2022 5:07 PM | Last Updated on Tue, May 31 2022 9:31 PM

Raviteja Ramarao Onduty Again Postponed From June 17th - Sakshi

మాస్‌ మహారాజా నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్‌ 17న థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉంటే జూన్‌ 17న మూవీని రిలీజ్‌ చేయడం లేదని తాజాగా మరో ప్రకటన ఇచ్చారు మేకర్స్‌. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘రామారావు ఆన్‌డ్యూటీ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, వాటి జాప్యం కారణంగా రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం చెప్పింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రానున్న ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

చదవండి: బర్త్‌డే రోజునే సూపర్‌ స్టార్‌ కృష్ణకు అరుదైన గౌరవం

అంతేకాక ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్లు, టీజర్‌, ఫస్ట్‌లుక్‌లు మూవీపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. రామారావు డ్యూట్‌ మరోసారి వాయిదా పడటంతో ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో వాయిదా పడ్డ సినిమాలన్ని పెద్ద, చిన్న సినిమాలన్ని రిలీజై మంచి విజయం సాధించాయి. ఇప్పుడు పోటీగా ఎలాంటి పెద్ద సినిమా లేదు. కానీ రామరావు ఆన్‌డ్యూటీ పదే పదే ఎందుకు వాయిదా పడుతుందా? అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ ఓ షాకింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే నిజానికి ఈ మూవీ నిర్మాత, హీరో రవితేజకు మధ్య మనస్పర్థలు తలెత్తడం వ్లలే సినిమా వాయిదా పుడుతున్నట్లు మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

చదవండి: నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్‌ రావిపూడి

ఈ తాజా బజ్‌ ప్రకారం.. మూవీ స్టార్ట్‌ చేసేముందే బిజినెస్‌ను బట్టి హీరో, నిర్మాత, డైరెక్టర్‌ల మధ్య ఒప్పందం జరిగిందట. ఈ క్రమంలో విడుదలైన మూవీ పోస్టర్లు, టీజర్‌ ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అవడంతో బిజినెస్‌ పరంగానూ థియేట్రికల్‌, శాటిలైట్‌, ఒటీటీ ఇతర హక్కులకు సంబంధించి రామారావు ఆన్‌డ్యూటీ మంచి బిజినెస్‌ జరిగిందట. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం బిజినెస్‌ను బట్టి తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని రవితేజ డిమాండ్ చేశాడని, అయితే ఈ సినిమా కాగితాల వరకు బిజినెస్ జరిగినా ఇంకా చేతికి డబ్బులు అందలేదని ప్రొడ్యూసర్ చెప్పినట్టు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య కాస్తా విభేదాలు తలెత్తాయని, అందుకే పోస్ట్‌ ప్రొడక్షన్‌లు పనులు వాయిదా పడ్డట్లు సమాచారం. వీరిద్దరు ఒక నిర్ణయానికొస్తే చివరి దశలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, ఈ సినిమా రిలీజ్ అవుతుందని వినికిడి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement