Ramarao On Duty Movie
-
ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే..
కరోనా కాలంలో ఓటీటీలకు ప్రేక్షకాదరణ బాగా పెరిగింది. ఇక థియేటర్లో వచ్చిన చిత్రాలను మళ్లీ చూడాలనుకుంటే ఓటీటీలే వేదికగా నిలుస్తున్నాయి. దీంతో తమకు నచ్చిన సినిమాను ఎప్పుడైనా, ఎక్కడైన చూసే వేసులుబాటు కల్పిస్తున్నాయి ఓటీటీలు. ఈ నేపథ్యంలో ఇటీవల బిగ్స్క్రీన్పై సందడి చేసిన పలు చిత్రాలు ఈ రోజు(సెప్టెంబర్ 16న) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటితోపాటు పలు వెబ్‌సిరీస్‌లు కూడా అలరించబోతున్నాయి. అలా ఈ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి అవేంటో చూద్దామా! ‘సోనిలివ్’లో రామారావు ఆన్‌డ్యూటీ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా నటించారు. జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చాలా గ్యాప్ అనంతరం నటుడు వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. థియేటర్లో పెద్దగా ఆడని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. సోనీలివ్‌లో ఈ రోజు నుంచే రామారావు ఆన్‌డ్యూటీ స్ట్రీమింగ్ అవుతుంది. ‘హాట్‌స్టార్’లో విక్రాంత్ రోణ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ కలెక్షన్లను రాబట్టింది. అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. మరి బిగ్ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్: దహన్ – సిరీస్ 1(హిందీ) అమెజాన్ ప్రైమ్: గుడ్ నైట్ మమ్మీ – ఇంగ్లీష్ ఆహా: మోసగాళ్లు(తెలుగు) కిరోసిన్(తెలుగు) సోనీ లివ్: కాలేజీ రొమాన్స్ – సిరీస్ 3(హిందీ) జీ5: టైంపాస్ 3 – మరాఠీ నెట్ ఫ్లిక్స్: జోగి – హిందీ అటెన్షన్ ప్లీజ్ – హిందీ ఫైండింగ్ హబ్బీ 2 – ఇంగ్లీష్ ఫేట్: ది వింక్స్ సాగా – సిరీస్ 2(ఇంగ్లీష్) స్కాండల్: బ్రింగింగ్ డౌన్ వైర్ కార్డ్ – డాక్యుమెంటరీ సిరీస్(ఇంగ్లీష్) శాంటో – సిరీస్ 1(స్పానిష్) లవ్ ఈజ్ బ్లైండ్ – సిరీస్ 2(ఇంగ్లీష్) జిమ్నాటిక్స్ అకాడమీ: ఏ సెకండ్ ఛాన్స్ – సిరీస్ 2(ఇంగ్లీష్) డు రివెంజ్ – ఇంగ్లీష్ ఐ యూజ్డ్ టు బి ఫేమస్ – ఇంగ్లీష్ ది బ్రేవ్ వన్స్ – ఇంగ్లీష్ డ్రిఫ్టింగ్ హోమ్ – జాపనీస్ మరి ఇంకేందుకు ఆలస్యం ఇంట్లోనే ఎంచక్కా మీకు నచ్చిన ఈ కొత్త సినిమాలను ఓటీటీల వేదికగా చూసి ఎంజాయ్ చేయండి. -
ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. తొలిసారి డిప్యూటీ కలెక్టర్ పాత్రను పోషించాడీ హీరో. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా నటించారు. యంగ్ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 29న విడుదలవగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. థియేటర్లో పెద్దగా సక్సెస్ అవకపోయినా ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీ రిలీజ్ డేట్ రానే వచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్లలో జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by SonyLIV (@sonylivindia) చదవండి: లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ ఏం చేశాడో తెలుసా? 'నా సినిమా థియేటర్స్‌లో విడుదలై మూడేళ్లు అయ్యింది' -
రిలీజ్‌కు ముందే సీక్వెల్ ప్రకటన.. ఇప్పుడెలా?
ఒక సినిమా రిలీజ్ కు ముందే సీక్వెల్ ప్రకటించి.. మూవీ హిట్టైన తర్వాత సీక్వెల్ తీస్తే ఎక్కడ లేని కిక్. కాని సీక్వెల్ ఉంటుందని ముందే ఎనౌన్స్ చేసిన తర్వాత మూవీ ఫట్ అయితే మాత్రం ఎక్కడలేని ఇబ్బంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ది వారియర్, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల దర్శకులు. ఈ రెండు చిత్రాలు కూడా జులైలోనే రిలీజ్ అయ్యాయి. వీటి సక్సెస్ పై హీరోలు మాత్రమే కాదు,దర్శకులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే రిలీజ్ కు ముందే సీక్వెల్స్ స్టోరీస్ రెడీగా ఉన్నట్లు తెలిపారు.సీన్ కట్ చేస్తే రామ్ నటించిన వారియర్, రవితేజన కనిపించిన రామారావు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి.ఇప్పుడు ఈ సినిమా దర్శకులు, హీరోలు సీక్వెల్స్ తో తిరిగొస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. (చదవండి: రీ-రిలీజ్‌కు ముస్తాబవుతున్న చిరు, పవన్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు!) సీక్వెల్ అంటేనే హిట్ సినిమాకు కొనసాగింపు.అలాంటిది మొదటి సినిమానే పరాజయం పాలైతే ఇక ఆ సినిమా నుంచి వచ్చే సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ ఉండదు.అందుకే పార్ట్ 2తో ఫెయిల్యూర్ కాగానే కొంతమంది హీరోలు పార్ట్ 3కి దూరంగా ఉండిపోయారు. శంకర్ దాదా జిందాబాద్, సర్దార్ గబ్బర్ సింగ్, రాజు గారి గది 2, మన్మథుడు 2 చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. ఈ లెక్కన రవితేజ, రామ్ లు రామారావు, వారియర్ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. -
‘రామారావు ఆన్ డ్యూటీ’ హీరోయిన్ రజిషా విజయన్ (ఫొటోలు)
-
రవితేజ లిస్ట్‌లోకి మరో సీక్వెల్.. దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో!
ఒక స్టోరీని రవితేజను దృష్టిలో పెట్టుకుని రాస్తే ఆ క్యారెక్టర్ తనదైన శైలిలో లైఫ్ ఇస్తాడు మాస్ మహా రాజా. అందుకే ఆ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసేందుకు దర్శకులు ముందుగానే సీక్వెల్ ఐడియా రాసుకుంటారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ శరత్ మండవ కూడా చేరిపోయాడు. రామారావు ఆన్ డ్యూటీకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చాడు. పైగా సీక్వెల్లో మాస్ మహా రాజా ను మరింత పవర్ ఫుల్ కు షిఫ్ట్ చేసాడు. (చదవండి: రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ) కాగా, రవితేజ ఇప్పటికే కిక్ సీక్వెల్ కిక్ 2 చేశాడు. అయితే ఈ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అందుకే రవితేజ సీక్వెల్స్ కు కొంత బ్రేక్ ఇచ్చాడు. కాని మాస్ రాజాతో మూవీస్ తీస్తున్న దర్శకులు మాత్రం ఆయన కోసం సీక్వెల్ స్టోరీస్ రెడీ చేసి పెట్టుకున్నారు. రాజా ది గ్రేట్ సీక్వెల్ స్టోరీతో అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు. రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విచ్చేసిన సందర్భంలో కూడా రాజా ది గ్రేట్ సీక్వెల్ గురించి మాట్లాడాడు. గతేడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మాస్ రాజా కమ్ బ్యాక్ మూవీ క్రాక్ కు సీక్వెల్ కు స్టోరీని రాసిపెట్టుకున్నాడు గోపీచంద్ మలినేని. రవితేజ డేట్స్ ఇస్తే మరోసా భూమ్ బద్దలయ్యే బ్లాక్ బస్టర్ అందిస్తానంటున్నాడు. మొత్తంగా మాస్ రాజా చేయాల్సిన సీక్వెల్స్ లిస్ట్ 3కు పెరిగింది. వీటిల్లో ఏ సీక్వెల్ కు రవితేజ ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. -
‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. రవితేజకు భారీ షాక్!
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యువ దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది.దీంతో ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. (చదవండి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం రూ.3.30 కోట్ల షేర్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో రూ.2.82 కోట్లను రాబట్టి..ఇటీవల కాలంలో రవితేజ కెరీర్లో ఫస్ట్‌డే అతి తక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. రవితేజ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే... ఖిలాడీ రూ. 4.30 కోట్లు, క్రాక్ రూ. 6.25, డిస్కో రాజా రూ.2.54 అమర్ అక్బర్ ఆంటోని రూ. 3.40 కోట్ల షేర్స్ అందుకున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.85 లక్షలు ► సీడెడ్ - రూ.52 లక్షలు ► ఈస్ట్ - రూ.31 లక్షలు ► వెస్ట్ - రూ.16 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45 లక్షలు ► గుంటూరు- రూ.24 లక్షలు ► కృష్ణా - రూ.17 లక్షలు ► నెల్లూరు - రూ.12 లక్షలు ► రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ - రూ.58 లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 3.30 కోట్ల షేర్ -
రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ
టైటిల్ : రామారావు ఆన్ డ్యూటీ నటీనటులు : రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: శరత్ మండవ సంగీతం : సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ విడుదల తేది: జులై 29, 2022 మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. ‘క్రాక్’తర్వాత రవితేజ ఖాతాలో బిగ్ హిట్ పడిందే లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. తన స్టయిల్ని పక్కన పెట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల ఈ శుక్రవారం(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామరావు ఆన్ డ్యూటీ’ని ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1993-94 ప్రాంతంలో జరుగుతుంది. రామారావు(రవితేజ) ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. కోర్టు తీర్పుతో చిత్తూరు జిల్లాలోని తన సొంత ప్రాంతానికి ఎమ్మార్వోగా నియమించబడతాడు. అక్కడి ప్రజలను సమస్యలను తనదైన స్టైల్లో తీర్చుతుంటాడు. తను ప్రేమించిన యువతి మాలిని(రజిషా విజయన్)భర్త సురేంద్ర అనుమానస్పదంగా మిస్ అయినట్లు తెలుసుకొని విచారణ మొదలు పెడతాడు. రామారావు ఇన్వెస్టిగేషన్లో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సురేంద్ర మాదిరే ఆ ప్రాంతానికి చెందిన మరో 20 మంది మిస్ అయినట్లు తెలుస్తుంది. దీని వెనక గంధపు చెక్కల స్మగ్లింగ్ ఉన్నట్లు గుర్తిస్తాడు. అసలు గంధపు చెక్కల స్మగ్లింగ్‌కు ఈ 20 మందికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న గంధపు చెక్కల స్మగ్లింగ్ వెనుక ఎవరు ఉన్నారు? ఒక ఎమ్మార్వోగా తనకు ఉన్న అధికారంతో రామారావు ఈ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో రామారావుకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు శరత్ మండవ. ఇదొక ఎమోషనల్ ఇన్వెస్ట్ గేటివ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సినిమా ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. అడవిలో కప్పిపుచ్చిన ఓ శవం భారీ వర్షానికి బయటకు కనిపిస్తుంటే.. ఓ ముసలాయన ఆ శవం చేతులు నరికేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రామారావు ఎంట్రీ.. ఆయన గొప్పతనం, నిజాయితీ, వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్దత తదితర అంశాలను చూపిస్తూ.. హీరో ఎలివేషన్లకి ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఇక్కడ సినిమా కాస్త నెమ్మెదిగా సాగినట్లు అనిపిస్తుంది. రామారావు మాజీ ప్రియురాలు మాలిని భర్త సురేంద్ర కేసు విచారణ చేపట్టినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఈ మిస్సింగ్ కేసుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధం ఉందని తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌ని కాస్త ఎమోషనల్ థ్రిల్లర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రామారావు తండ్రి(నాజర్) హత్య, దాని వెనక ఓ గ్యాంగ్ ఉండడం తదితర అంశాలను ఇంట్రెస్టింగ్ చూపించాడు. అయితే కొన్ని రీపీటెడ్ సీన్స్ వల్ల సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం దర్శకుడు కొన్ని సీన్లను కావాలనే యాడ్ చేశారనే ఫిలీంగ్ కలుగుతుంది. గంధపు స్మగ్లింగ్ మాఫియా లీడర్ విరాజ్‌తో రామారావు యుద్దం పార్ట్2లో ఉండబోతుంది. ఎవరెలా చేశారంటే.. మాములుగా రవితేజ సినిమాలలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. ఎమ్మార్వో రామారావు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. పోలీసులకు మాత్రమే కాదు ఎమ్మార్వోకు కూడా ఇన్ని అధికారాలు ఉంటాయా? అనేలా ఆయన పాత్ర ఉంటుంది. రొమాన్స్(పాటలతో మాత్రమే)తో పాటు యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వేణుతొట్టంపూడి ఎస్సైగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన పాత్రకి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం కాస్త మైనస్. రామారావు భార్య నందిని పాత్రలో దివ్యాంశ కౌశిక్ ఒదిగిపోయింది. సాధారణ గృహిణిగా చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. రామారావు మాజీ ప్రియురాలు మాలినిగా రజిషా విజయన్ ఉన్నంతలో బాగానే నటించింది. కథని మలుపు తిప్పే పాత్ర ఆమెది. నాజర్, నరేశ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎటిటర్ ప్రవీణ్ కేఎల్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘దమ్ము’ తర్వాత అందుకే సినిమాలు చేయలేదు: వేణు తొట్టెంపూడి
‘‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో సీఐ మురళి పాత్ర చేశాను. ఇలాంటి జోనర్ సినిమా నేను చేయలేదు. పైగా వైడ్ రీచ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్లీ నటిస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే అభిప్రాయంతోనే ఈ సినిమా చేశాను’’ అని నటుడు వేణు తొట్టెంపూడి అన్నారు. రవితేజ హీరోగా దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి పంచుకున్న విశేషాలు. ► ‘దమ్ము’ చిత్రం తర్వాత నేను సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. మాకున్న వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాల గురించి ఆలోచించే తీరిక లేదు. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా తిరస్కరించేవాణ్ణి. అయితే కరోనా టైమ్‌లో ఇంట్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నప్పుడు మళ్లీ సినిమాపై ఆసక్తి కలిగింది. ఆ సమయంలో శరత్ మండవ చెప్పిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ నచ్చడంతో ఓకే చెప్పేశాను. ► ‘స్వయంవరం’ సినిమాలో రవితేజగారు నాతో కలిసి పని చేయాల్సి ఉన్న విషయం గురించి నిజంగా నాకు తెలీదు. అప్పుడు కుదరకపోయినా ‘రామారావు ఆన్ డ్యూటీ’తో మా కాంబినేషన్ కుదిరింది. మొదటి నుంచి కూడా నేను మల్టీస్టారర్ సినిమాలకి ఆసక్తి చూపేవాణ్ణి. ‘చిరునవ్వుతో’ వంటి హిట్ తర్వాత ‘హనుమాన్ జంక్షన్’ సినిమా చేశాను. చాలామంది నటీనటులతో కలసి నటించడం ఓ పండగలా ఉంటుంది. ► నేను హిట్ సినిమాలు చేసినప్పటికీ నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి ఉండేది. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో నేనే డబ్బింగ్ చెప్పడం తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెబుతాను. రవితేజగారి లాంటి మాస్ స్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ. ఇలాంటి మంచి చిత్రంతో నాకు ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్, శరత్ మండవలకు థ్యాంక్స్. ► నా సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు. తను దర్శకుడు అయ్యాక ‘అతడు’లో సోనూ సూద్ చేసిన పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోవడంతో సోనూ సూద్ చేశారు. నాకు సరిపడే పాత్ర ఉంటే త్రివిక్రమ్ తప్పకుండా నాకు చెబుతారు. నా ఫిట్నెస్ సీక్రెట్ ఏం లేదు.. మంచి ఆహారం తింటాను. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్‌కు దూరంగా ఉంటాను. శరీరాన్ని పాడుచేసే ఏ చెడ్డ అలవాటు లేదు. మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదం. ►ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను. అలాగే వెబ్ కంటెంట్‌పై కూడా దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఛాయ్ బిస్కెట్ నిర్మా ణంలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా చర్చల్లో ఉంది. -
రవితేజకు షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్!
మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఎట్టకేలకు నేడు(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సమయంలో చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలింది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే.. అంటే జులై 28న ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి. రవితేజ పవర్ఫుల్ డైలాగ్‌తో విలన్లకు వార్నింగ్ ఇస్తున్న ఆ సీన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. (చదవండి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ట్విటర్ రివ్యూ) ఎడిటింగ్ రూం నుండే ఈ వీడియో బయటకు వచ్చినట్లు చిత్రబృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫ్యిరాదు చేసినట్లు తెలుస్తోంది.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. -
‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యంగ్ డైరెక్టర్ శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచేశాయి. ఈ సారి రవితేజ కొంచెం కొత్త ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తనదైన స్టైల్లో మాస్ డైలాగ్స్‌తో ట్రైలర్ వదలడంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 29) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల రామారావు డ్యూటీ ఎక్కేశాడు. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #RamaRaoOnDuty #RamaRaoOnDutyFromJuly29th #RamaRaoOnDutyFromTomorrow Blockbuster comeback for ravanna Awesome movie Mainly mass scenes vere level Introduction scene Pre intervel scene Climax scene goose bumbs Songs 💙 Bgm 🔥🔥🔥 Overall rating 3.25/5 pic.twitter.com/BJaalgSfob — vallepu_raghavendra (@vallepuraghav) July 29, 2022 రవితేజకు భారీ హిట్ లభించిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని , క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొంత మంది ఏమో రామారావు ఆన్ డ్యూటీ యావరేజ్ మూవీ అంటున్నారు. #RamaRaoOnDuty Review: An Above Average Thriller Drama ✌️#RaviTeja performs well in his usual swag 👍 Casting Is Decent 👍 Music is OK but BGM works ✌️ Action Scenes are very good 👍 Decent Story but underwhelming execution 🙏 Rating: ⭐⭐⭐/5#RamaRaoOnDutyReview pic.twitter.com/4uLZVjZEvx — Kumar Swayam (@KumarSwayam3) July 29, 2022 రవితేజ యాక్టింగ్ బాగుందని, పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇంట్రడక్షన్ డీసెంట్‌గానే ఉందని, ఫస్టాఫ్ వరకు కథలో కొత్తదనం ఏం కనిపించడం లేదంటున్నారు. @RaviTeja_offl sir, #RamaRaoOnDuty movie chusanu. Chala bagundi from NJ, USA. — Abhishek (@abhiabhi799) July 29, 2022 #RamaRaoOnDuty Review FIRST HALF: A Decent One 👍#RaviTeja is in his elements & looks perfect ✌️ Songs are average but BGM is Terrific 👏 Production Values Looks Good 👍 Second Half is the key 🙏#RamaRaoOnDutyReview #DivyanshaKaushik #RamaRaoOnDuty — Fancy Motion Pictures (@Fancymotionpic) July 29, 2022 US distrubutor Rating: ⭐️⭐️⭐️2.5/5#RamaRaoOnDutyReview #SarathMandava has picked up the MASSIEST TALE and showcased it on the SILVER screen with his GRAND VISION of presenting #RaviTeja in a massy avatar. #RamaRaoOnDuty reminds you of the olden days. pic.twitter.com/SE0kKP8goB — Praveen Chowdary Kasindala (@PKasindala) July 27, 2022 #RamaRaoOnDuty 1st half way too good...superb interval bang....@RaviTeja_offl in completely mass avatar — Mahesh (@Urkrishh) July 29, 2022 -
రామారావు ఆన్‌డ్యూటీ సీన్స్ లీక్...
-
Ramarao On Duty Stills: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
అందుకే రవితేజ పాత్రకి రామారావు అని పేరు పెట్టా: శరత్ మండవ
రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీ గా ఆయన పేరు వచ్చింది. తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బిగ్ హీరో. అలాగే కేటీఆర్ కూడా గ్రేట్ లీడర్. అందుకే రవితేజ పాత్రకి రామారావు అని పేరు పెట్టాను అని అన్నారు ‘రామారావు ఆన్ డ్యూటీ చిత్రం దర్శకుడు శరత్ మండవ. మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టెర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న తాజాగా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శరత్ మండవ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్'రామారావు ఆన్ డ్యూటీ' . ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్ గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఇందులో చాలా యునిక్ పాయింట్. ►చాలా యునిక్‌గా ఈ కథ ఉంటుంది. పాత్ బ్రేకింగ్ కథ అని చెప్పను కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని మాత్రం చెప్పగలను. రవితేజ గారి గత సినిమాల ఛాయలని రిపీట్ కాకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ►ఇందులో చాలా కీలకమైన సిఐ పాత్ర ఉంది. ఈ పాత్రకు ఎవరైతే బావుంటుదని ఆలోచిస్తున్నప్పుడు వేణు తొట్టెంపూడి స్ట్రయిక్ అయ్యారు. ఆయన సినిమాలు, వీడియోలు ఇప్పటికీ చాలా పాపులర్. సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ పాత్రకు ఆయన అయితే బావుంటుదని వెళ్లి ఆయన్ని కలిశాను. లక్కీగా ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. ఎమోషన్స్ ని అద్భుతంగా పడించే నటుడాయన. రామారావు ఆన్ డ్యూటీలో ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా రూపొందించాం. అందులో ఒక సంఘటన నా అనుభవంలో కూడా ఉంది. ► ఇందులో మాళిని పాత్రకు గ్లామర్ కంటే ఎమోషనల్ కోషియంట్ ఎక్కువ వుండే ఒక యునిక్ నటి కావాలనిపించింది. రజిషా విజయన్ ఆ పాత్రకు సరిగ్గా నప్పుతుందని అనిపించింది. మొదట ఆమె ఒప్పుకోలేదు. కథ పూర్తిగా చెప్పిన తర్వాత ఆమెకు చాలా నచ్చింది. చేసిన తర్వాత నా పాత్రకి సంబధించిన సీన్లు ఏమైనా డిలిట్ చేస్తారా అని అడిగింది. అలాంటిది ఏమీ ఉండదని హామీ ఇచ్చాను( నవ్వుతూ) ► నా వరకు కథ ఒక దేవాలయం లాంటింది. దానికంటూ ఒక నిర్మాణం ఉంటుంది. 'ఒక కథ రాసేటప్పుడు ఆ కథే తనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుని పూర్తి చెసుకుంటుంది. హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు, మంచి చెడు మాత్రం మన చేతిలో ఉంటుంది' అని దాసరిగారు చెప్పిన ఈ మాటలు లైఫ్ టైం పాటిస్తాను. నేను టీం వర్క్ ని నమ్ముతాను. ఈ చిత్రంలో అద్భుతమైన టీమ్ వర్క్ ఉంది. ► విక్రమ్ వేద లో సామ్ సిఎస్ వర్క్ అద్భుతంగా ఉంటుంది., ఖైదీ సినిమా చూసిన తర్వాత నే రవితేజ గారికి ఫోన్ చేసి సామ్ సిఎస్ ని అనుకుంటున్నాని చెప్పాను. రవితేజ గారికి కూడా సామ్ అంటే అప్పటికే గురి ఉంది. సామ్ ని ఇక్కడి పిలించి ప్రాజెక్ట్ గురించి చెప్పాను. మేము మొదట లాక్ చేసిన టెక్నిషియన్ సామ్ సిఎస్. ► ప్రస్తుతానికి రామారావు ఆన్ డ్యూటీకి సీక్వెల్ ఆలోచన లేదు. అయితే ఇది బర్నింగ్ ఇష్యూ. దిన్ని కంటిన్యూ చేద్దామని ఆసక్తితో ఎవరైనా వస్తే .,. నా ఆలోచనలు పంచుకోవడానికి రెడీగా వుంటాను. ► నా బలం ఏమిటో తెలీదు కానీ.,.నా బలహీనత తెలుసు. శేఖర్ కమ్ముల గారి లాంటి సినిమాలు చేయలేను. లైటర్ వెయిన్ ఎమోషన్స్ ని డీల్ చేయడం నా వరకూ కష్టం. యాక్షన్, థ్రిల్లర్స్ చేయగలను. ఒక ఫైట్ లేకుండా కూడా యాక్షన్ సినిమా చేయొచ్చు. రాజ్ కుమార్ హిరాణీ తరహాలో ఒక కథ రాసుకున్నా. రామారావు ఆన్ డ్యూటీ విడుదలైన తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా. -
ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Upcoming Movies Web Series July Last Week: సినీ ప్రియుల కోసం ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలో అలరిస్తుంటాయి. సమ్మర్లో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ సందడి చేయగా తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే జులై చివరి వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో మేం ఉన్నామంటూ సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! 1 విక్రాంత్ రోణ- జులై 28, 2022 2. ది లెజెండ్- జులై 28, 2022 3. రామారావు ఆన్ డ్యూటీ- జులై 29, 2022 4. ఏక్ విలన్ రిటర్న్స్- జులై 29, 2022 ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో 1. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్- జులై 26 2. ది బ్యాట్ మ్యాన్- జులై 27 3. బిగ్ మౌత (వెబ్ సిరీస్)- జులై 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 1. అదమస్ (వెబ్ సిరీస్)- జులై 27 2. గుడ్ లక్ జెర్రీ- జులై 29 3. 19 (1) (ఎ)- జులై 29 నెట్‌ఫ్లిక్స్ 1. ది మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఆన్ ది ఇంటర్నెట్ (వెబ్ సిరీస్)- జులై 27 2. డ్రీమ్ హోమ్ మేకోవర్ (వెబ్ సిరీస్)- జులై 27 3. కీప్ బ్రీతింగ్ (వెబ్ సిరీస్)- జులై 28 4. మసాబా మసాబా (వెబ్ సిరీస్)- జులై 29 5. పర్పుల్ హార్ట్స్ (వెబ్ సిరీస్)- జులై 29 1. షికారు- జులై 29 (ఆహా) 2. పేపర్ రాకెట్- జులై 29 (జీ5) 3. 777 చార్లీ- జులై 29 (వూట్) -
రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
ప్రతి జనరేషన్లో ఒకడుంటాడు – నాని
‘‘రామారావు: ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రవితేజ అన్న గురించి మాట్లాడొచ్చని వచ్చాను. రవి అన్నకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. రవి అన్న కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవిగారిని ఎలా స్ఫూర్తిగా తీసుకున్నారో... మేం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రవి అన్నగారు మాకు అది. ప్రతి జనరేషన్‌కు ఒకడుంటాడు. నేను అయ్యాను కదరా.. నువ్వెందుకు కాలేవు అనే ధైర్యం ఇచ్చేవాడు ఒకడుంటాడు. అది మా అందరికీ అప్‌కమింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రవి అన్న. చిరంజీవిగారితో రవితేజ అన్న సినిమా చేస్తున్నారు. అలా నాకూ రవితేజ అన్నతో సినిమా చేయా లని ఉంది’’ అన్నారు నాని. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ – ‘‘ఇరవైఏళ్ల నుంచి రవితేజ అన్న డ్యూటీ (నటుడిగా). ఈ నెల 29 నుంచి థియేటర్స్‌లో ‘రామారావు: ఆన్ డ్యూటీ’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ – ‘‘సౌత్ ఇండస్ట్రీలో వన్నాఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ నాని. అనుభవం ఉన్న దర్శకుడిలా శరత్ సినిమా చేశాడు. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయని ఓ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ క్యారెక్టర్ చేశాను. నిర్మాత సుధాకర్ కూల్ అండ్ పాజిటివ్ పర్సన్. మరో నిర్మాత శ్రీకాంత్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు. వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను’’ అన్నారు. శరత్ మండవ మాట్లాడుతూ – ‘‘సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదన్న విషయంలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు. కానీ మా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టికెట్ రేట్స్ చెబుతున్నాను. ఈ చిత్రానికి తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో చార్జి 195 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్‌లో 150, 100, 50 రూపాయలు. ఏపీలో మల్టీప్లెక్స్‌లో 177, సింగిల్ స్క్రీన్స్‌లో 147, 80 చార్జీలు ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే 30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. దయచేసి థియేటర్స్ కౌంటర్లో టికెట్ తీసుకోండి’’ అన్నారు. కెమెరామేన్ సత్యన్ సూర్యన్, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, లిరిక్ రైటర్ కల్యాణ్ చక్రవర్తి, దర్శకుడు బాబీ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
సెట్స్‌లో నాగచైతన్య అలా ఉంటాడు : హీరోయిన్
రవితేజ, దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో దివ్యాంశా కౌశిక్ చెప్పిన విశేషాలు. ► ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం 1995లో జరిగే కథ. ఈ చిత్రంలో నందిని అనే గృహిణి పాత్ర చేశాను. రామారావు (రవితేజ పాత్ర పేరు..)కు భార్యగా, అతనికి మోరల్ సపోర్ట్‌గా ఉంటాను. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర ఇది. షూటింగ్ ముందు కొన్ని వర్క్‌షాప్స్ చేశాను. నందిని పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ► శరత్‌గారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. రజీషాతో నాకు కొన్ని కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయి. సినిమాలో రామారావు ఎక్స్ లవర్ మాలిని పాత్రలో ఆమె కనిపిస్తారు. రామారావు పెళ్లి మాలినితో కాకుండా నందినితో ఎందుకు జరిగింది? అనే విషయాన్ని మాత్రం సినిమాలోనే చూడాలి. ► తెలుగులో నా తొలి చిత్రం ‘మజిలీ’ తర్వాత కోవిడ్ వల్ల నాకు కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో నేను కొన్ని డ్యాన్స్, యాక్టింగ్ క్లాసులు, తెలుగు క్లాసులు తీసుకున్నాను. నన్ను నేను తెలుసుకుని, మెరుగయ్యే ప్రయత్నం చేశాను. ఓ యాక్టర్‌గా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ‘మజిలీ’లో నేను చేసిన అన్షు పాత్రకు, ‘రామారావు ఆన్ డ్యూటీ’లో చేసిన నందిని పాత్రకు చాలా తేడా ఉంది. ► ‘మజిలీ’ చిత్రంలో నాగచైతన్యతో, ‘రామరావు ఆన్ డ్యూటీ’లో రవితేజగారితో వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సెట్స్‌లో రవితేజగారు యాక్టివ్‌గా ఉంటే, నాగచైతన్య కామ్ అండ్ కూల్‌గా ఉంటారు. అయితే ఇద్దరిలో ఒక కామన్ క్యాలిటీ ఉంది. సెట్స్ లో సరదా ఫ్రాంక్స్ చేస్తుంటారు( నవ్వూతూ..) ► తెలుగులో మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది (నవ్వుతూ..). ► నందిని పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు కానీ నా తర్వాతి చిత్రం ‘మైఖేల్’కు తెలుగులోనే డబ్బింగ్ చెబుతాను. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నాను. స్క్రిప్ట్ నచ్చితే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తాను. ఏదైనా బయోపిక్‌లో యాక్ట్ చేయాలని ఉంది. ఎవరి బయోపిక్ అనేది నన్ను ఎంచుకునే దర్శకుల ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. -
రవితేజ సెట్‌కి వస్తే మెరుపులే.. ఎనర్జీతో నిండిపోతుంది: హీరోయిన్
నేను నార్త్ ఇండియాలో పెరిగాను. రవితేజ సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూసేదాన్ని. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే రవితేజ సినిమాలు నార్త్‌లో బాగా చూసేవారు. అలాంటి హీరోతో పని చేయడం గొప్ప అనుభవం. రవితేజ గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. ఆయన సెట్స్ కి వస్తే ఒక మెరుపులా ఉంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. సెట్స్ లో అందరినీ సమానంగా చూస్తారు’ హీరోయిన్ రజిసా విజయన్ అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టెర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న తాజాగా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ రజిషా విజయన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రామారావు ఆన్ డ్యూటీ(Rama Rao On Duty) లో మాళిని అనే పాత్రలో కనిపిస్తా. శరత్ అద్భుతమైన కథ చెప్పారు. నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒక భాషలో పరిచయమౌతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా బలంగా ఉంటుంది. ఇంతమంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా ఉంది. ► రామారావు ఆన్ డ్యూటీ మాస్ ఫిల్మ్. ఇందులో చాలా ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అదే సమయంలో బలమైన కథ ఉంది. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా తీయాలంటే దర్శకుడిలో చాలా క్లారిటీ ఉండాలి. అంత చక్కని క్లారిటీ వున్న దర్శకుడు శరత్. మంచి సాంకేతిక విలువలతో చాలా మంచి క్యాలిటీతో ఈ సినిమాని రూపొందించారు. ► పరిశ్రమలో వేరైనా అందరూ తీసేది సినిమానే. టెక్నిక్ ఒక్కటే. నటన కూడా ఒకటే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో సినిమాల ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. పెద్ద కాన్యాస్ లో సినిమాకు తెరకెక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుకుంటే ఇక్కడ థియేటర్స్, ఆడియన్స్ ఎక్కువ. ► సినిమా అనేది అల్టీమేట్ గా థియేటర్ ఎక్స్ పిరియన్స్. మమ్ముటి గారు ఒక సినిమా షూటింగ్ చేస్తున్నపుడు ఎలా వస్తుందో కనీసం మోనిటర్ కూడా చూడలేదు. కారణం అడిగితే.. ''నేను యాక్ట్ చేస్తుంది మానిటర్ కోసం కాదు .. బిగ్ స్క్రీన్ పై ఎలా వుంటుందో అనేది చూస్తాను''అని చెప్పారు. థియేటర్ ఇచ్చే అనుభవం వేరు. 'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి భారీ చిత్రాన్ని అందరూ థియేటర్ లోనే చూడాలి. ఈ చిత్రం అన్ని ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ► నేను నటించిన మలయంకున్జు పాటు మరో నాలుగు మలయాళం సినిమాలు విడుదల కానున్నాయి. మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టాలి. -
నిర్మాతతో గొడవలు?.. క్లారిటీ ఇచ్చిన రవితేజ
మాస్ మహారాజా తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ పలు వాయిదాల అనంతరం విడుదలకు సిద్ధమైంది. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా రవితేజ, డైరెక్టర్ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. రామారావు ఆన్‌డ్యూటీ పదే పదే వాయిదా పడటంతో.. రెమ్యునరేషన్ విషయంలో రవితేజ చాలా ఖచ్చితంగా ఉన్నాడని, ఈ విషయంలో నిర్మాత సుధాకర్‌తో ఆయనకు గొడవలు జరిగాయంటూ పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజా ఇంటర్య్వూలో రవితేజకు దీనిపై ప్రశ్న ఎదురైంది. చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా తనపై వస్తున్న పుకార్లపై రవితేజ అసహనం వ్యక్తం చేశాడు. రవితేజ మాట్లాడుతూ.. ఈ వార్తల్లో అసలు నిజం లేదన్నాడు. ‘ఈ సినిమాకు నేను కో-ప్రొడ్యుసర్‌గా చేశాను. అలాంటప్పుడు రెమ్యునరేషన్ విషయంలో ఎందుకు సమస్యలు వస్తాయి. కొంతమంది పని పాట లేని వారు ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిని అలాగే వదిలేద్దాం. ఇవేం నాకు కొత్త కాదు. ఇలాంటి పుకార్లను చూసి నవ్వుకుంటుంటాను. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. ఆయన చాలా మంచి మనిషి. నాతోనే కాదు పరిశ్రమలో ఎవరితోను ఆయనకు గొడవలు, శత్రువులంటూ ఉండి ఉండరు. అంత మంచి వ్యక్తి ఆయన’ అంటూ పుకార్లకు చెక్ పెట్టాడు రవితేజ. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. అంతేగాక నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు... వారిచ్చిన చెక్ లను కూడా తాను చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎన్నో పోస్టర్లు, బ్యాన్లు విడుదల చేశామని, అందులో రైట్ సైడ్ ఉన్న ఆర్టీ టీం వర్క్ అంటే రవితేజ అని అర్థం.. ఎడమ వైపు సుధాకర్ గారి బ్యానర్, కుడివైపు రవితేజ గారి బ్యానర్ అని చెప్పకొచ్చారు. ఇంతకంటే రుజువు కావాలా? అని ఇవి చూసిన కూడా రూమర్స్ ఎలా వస్తునాయంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి, సీనియర్ నటుడు నాజర్, నరేశ్, పవిత్ర లోకేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
రవితేజకు అది చాలా నచ్చింది: ఆర్ట్ డైరెక్టర్
Art Director Sahi Suresh About Raviteja Rama Rao On Duty: ‘‘శక్తి’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారితో పని చేశాను. అప్పుడు నా ప్రతిభని గుర్తించిన అశ్వినీదత్ గారు ‘సారొచ్చారు’కి ఆర్ట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. దాదాపు 40 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా చేశాను’’ అని సాహి సురేష్ అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా, దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా చేసిన సాహి సురేష్ మాట్లాడుతూ– ‘‘రామారావు ఆన్ డ్యూటీ’ 1995లో జరిగే రూరల్ కథ. 95 నేపథ్యాన్ని మొత్తం రీ క్రియేట్ చేశాం. రవితేజగారికి ఎమ్మార్వో ఆఫీస్ సెట్ చాలా నచ్చింది. శరత్ కొత్త దర్శకుడైనప్పటికీ చాలా క్లారిటీ ఉంది. ‘కంచె, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, అ’ చిత్రాలు ఆర్ట్ పరంగా నాకు చాలా తృప్తినిచ్చాయి. ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో పాటు నితిన్–వక్కంతం వంశీ సినిమాలు చేస్తున్నాను’’ అని తెలిపారు. చదవండి: నా మైండ్ సెట్ చాలా మారింది: నాగ చైతన్య కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ.. 27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ !.. ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు -
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)
-
అందులో ఒక్క శాతం కూడా డౌట్ లేదు: రవితేజ
‘‘తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి)... ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది.. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నాజర్‌గారు చెప్పినట్టు శరత్ చాలా మంచి సినిమా తీశాడు. అందులో ఒక్క శాతం కూడా డౌట్ లేదు’’ అని రవితేజ అన్నారు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అభిమానుల మధ్య ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన మా మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు, డైరెక్టర్లు అనిల్, త్రినాథరావు, సుధీర్, వంశీగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. (చదవండి: ‘ది వారియర్’ మరోసారి అది నిరూపించింది: రామ్ పోతినేని) శరత్ మండవ మాట్లాడుతూ– ‘‘ఆర్టీఎఫ్ (రవితేజ ఫ్యాన్స్) అనే హ్యాష్‌ట్యాగ్‌తో నన్ను సపోర్ట్ చేసిన రవితేజగారి అభిమానులకు థ్యాంక్స్. ప్రస్తుతం చాలామంది కథలు రాస్తున్నారు. ప్రత్యేకించి ఓ సినిమా కథ బాగా హైలెట్ కావాలంటే నటుడు వెన్నెముకలాంటివాడు. తెలుగు ఇండస్ట్రీలో రవితేజగారు ఉండటం పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇండస్ట్రీలో ఉండటం నాలాంటి వారికి స్ఫూర్తి.. అదృష్టం కూడా. ఎందుకంటే నాలాంటి వాళ్లను చాలామందిని పరిచయం చేశారు. కొత్త ఐడియాలను, కొత్త కథలను ఆయనెప్పుడూ స్వాగతిస్తారు. 29న థియేటర్లలో కలుద్దాం.. రామారావుగారి డ్యూటీ మిమ్మల్ని అలరిస్తుంది’’ అన్నారు. ఈ వేడుకలో నటుడు నాజర్ పాల్గొన్నారు. -
మాస్ యాక్షన్‌తో రవితేజ మెరుపులు.. ఆసక్తిగా ట్రైలర్
Ravi Teja Ramarao On Duty Movie Trailer: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. హిట్లు, ప్లాప్‌లు పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవల 'క్రాక్'తో హిట్ కొట్టిన 'ఖిలాడీ' అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహించారు. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌ను శనివారం (జులై 16) ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈవెంట్లో ఆరుగురు టాలీవుడ్ దర్శకులు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో మాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా రవితేజ యాక్టింగ్, డైలాగ్స్‌తో అదరగొట్టాడు. 1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. అలాగే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు నటుడు వేణు తొట్టెంపూడి. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో -
ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న బ్యూటీ!
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లు. ఈ సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది దివ్యాంశ. ఈ కథానాయిక మజిలీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అందులో అన్షు పాత్రతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత టక్కర్ మూవీతో కోలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈసారైనా తనకు మంచి బ్రేక్ వస్తుందేమోనని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది దివ్యాంశ. మరి దివ్యాంశకు రామారావు ఆన్ డ్యూటీ ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి! కాగా శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. చదవండి: వారియర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? నేనేమైనా ఉగ్రవాదినా? పెళ్లి చేసుకోకూడదా? -
అల్లు అర్జున్ నటించిన ఆ సినిమా నేను చేయాల్సింది: వేణు
ఒకప్పడు హీరోగా,కమెడియన్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. పదేళ్ల కిందట ఎన్టీఆర్ నటించిన దమ్ము, ఆ తర్వాత రామాచారి అనే చిత్రాల్లో వేణు కీలక పాత్రలు పోషించాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా వెండితెరకు దూరమయ్యాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు రవితేజ లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’తో రీఎంట్రీ ఇస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేణు పోలీసు అధికారి మురళి పాత్రను పోషిస్తున్నాడు. జులై 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: పెళ్లిపై హీరోయిన్ హన్సిక ఆసక్తికర వ్యాఖ్యలు) ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు వేణు. తాజాగా ఓ టీవీ చానెల్లో ప్రసారమయ్యే టాక్ షోలో పాల్గొన్న వేణు.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. భారతీ రాజా సినిమాతో తాను వెండితెరకు పరిచయం కావాల్సిందని, కానీ అది కుదరలేదని చెప్పారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా కథని పూరి జగన్నాథ్ తొలుత తనకే చెప్పాడని, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని అన్నాడు. అయినప్పటికీ పూరి జగన్నాథ్ మరోసారి తన దగ్గరకు వచ్చి ‘దేశముదురు’ కథ చెప్పాడని, హీరో నువ్వేనంటూ చెప్పి.. చివరకు అల్లు అర్జున్‌తో తీశాడంటూ.. నాడు జరిగిన సంఘటనల గురించి వేణు చెప్పుకొచ్చాడు.