Ravi Teja Ramarao On Duty Movie Item Song 'Naa Peru Seesa' Full Song Out Today - Sakshi
Sakshi News home page

Ramarao On Duty - Naa Peru Seesa Song: రామారావు ఆన్‌ డ్యూటీలోని ఐటం సాంగ్‌ రిలీజ్‌!

Published Sat, Jul 2 2022 6:59 PM | Last Updated on Sat, Jul 2 2022 8:28 PM

Ramarao On Duty: Naa Peru Seesa Full Song Out - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్‌లో ఎన్నడూ లేనంత స్పీడ్‌గా షూటింగ్‌లను పూర్తి చేస్తూ సినిమాలు వీలైనంత త్వరగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్‌డేట్‌ బయటకు వస్తోంది. తాజాగా ఆయన నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ నుంచి ఐటం సాంగ్‌ రిలీజైంది.

నా పేరు సీసా.. నా పేరు సీసా.. అంటూ సాగే ఈ స్పెషల్‌ సాంగ్‌ను శ్రేయ ఘోషల్‌ పాడింది. సామ్‌ సీఎస్‌ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించాడు. బాలీవుడ్‌ నటి అన్వేషి జైన్‌ ఐటంసాంగ్‌లో స్టెప్పులేసింది. కాగా శ్రీల‌క్ష్మివెంక‌టేశ్వ‌ర సినిమాస్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమా జూలై 29న రిలీజ్‌ కానుంది.

చదవండి: చోళులు వచ్చేస్తున్నారు అంటూ పోస్టర్‌ రిలీజ్‌
 జనవరి టు జూన్.. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్‌ ఫ్లాప్‌ అయిన చిత్రాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement