Ravi Teja Ramarao On Duty Movie Trailer Out Today - Sakshi
Sakshi News home page

Ramarao On Duty Movie Trailer: అదిరిపోయిన 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్‌..

Published Sat, Jul 16 2022 7:25 PM | Last Updated on Sat, Jul 16 2022 8:06 PM

Ravi Teja Ramarao On Duty Movie Trailer Out - Sakshi

Ravi Teja Ramarao On Duty Movie Trailer: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా, మాస్‌ మహారాజాగా ఎదిగాడు రవితేజ. హిట్లు, ప్లాప్‌లు పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవల 'క్రాక్‌'తో హిట్‌ కొట్టిన 'ఖిలాడీ' అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. ఈ మూవీకి శరత్‌ మండవ దర్శకత్వం వహించారు. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ‍

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌  లాంచ్‌ను శనివారం (జులై 16) ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆరుగురు టాలీవుడ్ దర్శకులు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో మాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా రవితేజ యాక్టింగ్, డైలాగ్స్‌తో అదరగొట్టాడు. 1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లగా రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ నటిస్తున్నారు. అలాగే చాలా రోజుల గ్యాప్‌ తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు నటుడు వేణు తొట్టెంపూడి. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. 

చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్‌
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
చోర్ బజార్‌లో రూ.100 పెట్టి జాకెట్‌ కొన్నా: స్టార్‌ హీరో


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement