Ravi Teja's Ramarao On Duty Movie First Song BulBul Tarang Out - Sakshi
Sakshi News home page

Ramarao On Duty: సిద్‌ శ్రీరామ్‌ నోట బుల్‌ బుల్‌ తరంగ్‌

Published Sun, Apr 10 2022 11:56 AM | Last Updated on Sun, Apr 10 2022 1:19 PM

Ramarao On Duty: First Song Bulbul Tarang Is Out - Sakshi

‍మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్‌ 17న విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి తొలి పాటను శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం విడుదల చేశారు.

'బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం మోగేను.. లవబ్ డబ్ మాని నీ పేరై మోగేను..' అంటూ సాగే ఈ పాటకి సిద్‌ శ్రీరామ్‌ తన త్వరంతో ప్రాణం పోశాడు. రజీషాపై రవితేజకు ఉన్న ప్రేమనంతా తన లిరిక్స్‌తో తెలియజేశాడు రాకేందు మౌళి. సామ్‌ సీఎస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ లవ్లీ రొమాంటిక్‌ మెలోడీలో రవితేజ, రజీషాల కెమెస్ట్రీ చూడముచ్చటగా ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్‌ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించాడు.  నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement