Ravi Teja Ramarao On Duty Movie Scenes Leaked In Social Media - Sakshi
Sakshi News home page

Ramarao On Duty Scenes Leak: రవితేజకు ఊహించని షాక్‌.. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సీన్స్‌ లీక్‌!

Published Fri, Jul 29 2022 7:50 AM | Last Updated on Fri, Jul 29 2022 8:43 AM

Ravi Teja Ramarao On Duty Movie Scenes Leaked In Social Media - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రం ఎట్టకేలకు నేడు(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సమయంలో చిత్రబృందానికి ఊహించని షాక్‌ తగిలింది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే.. అంటే జులై 28న  ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ సోషల్‌ మీడియాలో లీకయ్యాయి. రవితేజ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో విలన్లకు వార్నింగ్‌ ఇస్తున్న ఆ సీన్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

(చదవండి: ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ మూవీ ట్విటర్‌ రివ్యూ)

ఎడిటింగ్ రూం నుండే ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు చిత్రబృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. లీక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవితేజ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాతలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫ్యిరాదు చేసినట్లు తెలుస్తోంది.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరత్‌ మండవ దర్శకత్వం వహించారు.  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement