Sarath Mandava
-
రవితేజ లిస్ట్‌లోకి మరో సీక్వెల్.. దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో!
ఒక స్టోరీని రవితేజను దృష్టిలో పెట్టుకుని రాస్తే ఆ క్యారెక్టర్ తనదైన శైలిలో లైఫ్ ఇస్తాడు మాస్ మహా రాజా. అందుకే ఆ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసేందుకు దర్శకులు ముందుగానే సీక్వెల్ ఐడియా రాసుకుంటారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ శరత్ మండవ కూడా చేరిపోయాడు. రామారావు ఆన్ డ్యూటీకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చాడు. పైగా సీక్వెల్లో మాస్ మహా రాజా ను మరింత పవర్ ఫుల్ కు షిఫ్ట్ చేసాడు. (చదవండి: రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ) కాగా, రవితేజ ఇప్పటికే కిక్ సీక్వెల్ కిక్ 2 చేశాడు. అయితే ఈ మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అందుకే రవితేజ సీక్వెల్స్ కు కొంత బ్రేక్ ఇచ్చాడు. కాని మాస్ రాజాతో మూవీస్ తీస్తున్న దర్శకులు మాత్రం ఆయన కోసం సీక్వెల్ స్టోరీస్ రెడీ చేసి పెట్టుకున్నారు. రాజా ది గ్రేట్ సీక్వెల్ స్టోరీతో అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు. రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విచ్చేసిన సందర్భంలో కూడా రాజా ది గ్రేట్ సీక్వెల్ గురించి మాట్లాడాడు. గతేడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మాస్ రాజా కమ్ బ్యాక్ మూవీ క్రాక్ కు సీక్వెల్ కు స్టోరీని రాసిపెట్టుకున్నాడు గోపీచంద్ మలినేని. రవితేజ డేట్స్ ఇస్తే మరోసా భూమ్ బద్దలయ్యే బ్లాక్ బస్టర్ అందిస్తానంటున్నాడు. మొత్తంగా మాస్ రాజా చేయాల్సిన సీక్వెల్స్ లిస్ట్ 3కు పెరిగింది. వీటిల్లో ఏ సీక్వెల్ కు రవితేజ ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. -
‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. రవితేజకు భారీ షాక్!
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యువ దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది.దీంతో ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. (చదవండి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం రూ.3.30 కోట్ల షేర్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో రూ.2.82 కోట్లను రాబట్టి..ఇటీవల కాలంలో రవితేజ కెరీర్లో ఫస్ట్‌డే అతి తక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. రవితేజ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే... ఖిలాడీ రూ. 4.30 కోట్లు, క్రాక్ రూ. 6.25, డిస్కో రాజా రూ.2.54 అమర్ అక్బర్ ఆంటోని రూ. 3.40 కోట్ల షేర్స్ అందుకున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.85 లక్షలు ► సీడెడ్ - రూ.52 లక్షలు ► ఈస్ట్ - రూ.31 లక్షలు ► వెస్ట్ - రూ.16 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45 లక్షలు ► గుంటూరు- రూ.24 లక్షలు ► కృష్ణా - రూ.17 లక్షలు ► నెల్లూరు - రూ.12 లక్షలు ► రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ - రూ.58 లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 3.30 కోట్ల షేర్ -
రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ
టైటిల్ : రామారావు ఆన్ డ్యూటీ నటీనటులు : రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: శరత్ మండవ సంగీతం : సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ విడుదల తేది: జులై 29, 2022 మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. ‘క్రాక్’తర్వాత రవితేజ ఖాతాలో బిగ్ హిట్ పడిందే లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. తన స్టయిల్ని పక్కన పెట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల ఈ శుక్రవారం(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామరావు ఆన్ డ్యూటీ’ని ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1993-94 ప్రాంతంలో జరుగుతుంది. రామారావు(రవితేజ) ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. కోర్టు తీర్పుతో చిత్తూరు జిల్లాలోని తన సొంత ప్రాంతానికి ఎమ్మార్వోగా నియమించబడతాడు. అక్కడి ప్రజలను సమస్యలను తనదైన స్టైల్లో తీర్చుతుంటాడు. తను ప్రేమించిన యువతి మాలిని(రజిషా విజయన్)భర్త సురేంద్ర అనుమానస్పదంగా మిస్ అయినట్లు తెలుసుకొని విచారణ మొదలు పెడతాడు. రామారావు ఇన్వెస్టిగేషన్లో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సురేంద్ర మాదిరే ఆ ప్రాంతానికి చెందిన మరో 20 మంది మిస్ అయినట్లు తెలుస్తుంది. దీని వెనక గంధపు చెక్కల స్మగ్లింగ్ ఉన్నట్లు గుర్తిస్తాడు. అసలు గంధపు చెక్కల స్మగ్లింగ్‌కు ఈ 20 మందికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న గంధపు చెక్కల స్మగ్లింగ్ వెనుక ఎవరు ఉన్నారు? ఒక ఎమ్మార్వోగా తనకు ఉన్న అధికారంతో రామారావు ఈ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో రామారావుకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు శరత్ మండవ. ఇదొక ఎమోషనల్ ఇన్వెస్ట్ గేటివ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సినిమా ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. అడవిలో కప్పిపుచ్చిన ఓ శవం భారీ వర్షానికి బయటకు కనిపిస్తుంటే.. ఓ ముసలాయన ఆ శవం చేతులు నరికేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రామారావు ఎంట్రీ.. ఆయన గొప్పతనం, నిజాయితీ, వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్దత తదితర అంశాలను చూపిస్తూ.. హీరో ఎలివేషన్లకి ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఇక్కడ సినిమా కాస్త నెమ్మెదిగా సాగినట్లు అనిపిస్తుంది. రామారావు మాజీ ప్రియురాలు మాలిని భర్త సురేంద్ర కేసు విచారణ చేపట్టినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఈ మిస్సింగ్ కేసుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధం ఉందని తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌ని కాస్త ఎమోషనల్ థ్రిల్లర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రామారావు తండ్రి(నాజర్) హత్య, దాని వెనక ఓ గ్యాంగ్ ఉండడం తదితర అంశాలను ఇంట్రెస్టింగ్ చూపించాడు. అయితే కొన్ని రీపీటెడ్ సీన్స్ వల్ల సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం దర్శకుడు కొన్ని సీన్లను కావాలనే యాడ్ చేశారనే ఫిలీంగ్ కలుగుతుంది. గంధపు స్మగ్లింగ్ మాఫియా లీడర్ విరాజ్‌తో రామారావు యుద్దం పార్ట్2లో ఉండబోతుంది. ఎవరెలా చేశారంటే.. మాములుగా రవితేజ సినిమాలలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. ఎమ్మార్వో రామారావు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. పోలీసులకు మాత్రమే కాదు ఎమ్మార్వోకు కూడా ఇన్ని అధికారాలు ఉంటాయా? అనేలా ఆయన పాత్ర ఉంటుంది. రొమాన్స్(పాటలతో మాత్రమే)తో పాటు యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వేణుతొట్టంపూడి ఎస్సైగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన పాత్రకి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం కాస్త మైనస్. రామారావు భార్య నందిని పాత్రలో దివ్యాంశ కౌశిక్ ఒదిగిపోయింది. సాధారణ గృహిణిగా చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. రామారావు మాజీ ప్రియురాలు మాలినిగా రజిషా విజయన్ ఉన్నంతలో బాగానే నటించింది. కథని మలుపు తిప్పే పాత్ర ఆమెది. నాజర్, నరేశ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎటిటర్ ప్రవీణ్ కేఎల్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రవితేజకు షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్!
మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఎట్టకేలకు నేడు(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సమయంలో చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలింది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే.. అంటే జులై 28న ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి. రవితేజ పవర్ఫుల్ డైలాగ్‌తో విలన్లకు వార్నింగ్ ఇస్తున్న ఆ సీన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. (చదవండి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ట్విటర్ రివ్యూ) ఎడిటింగ్ రూం నుండే ఈ వీడియో బయటకు వచ్చినట్లు చిత్రబృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫ్యిరాదు చేసినట్లు తెలుస్తోంది.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. -
Ramarao On Duty Stills: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
అందుకే రవితేజ పాత్రకి రామారావు అని పేరు పెట్టా: శరత్ మండవ
రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీ గా ఆయన పేరు వచ్చింది. తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బిగ్ హీరో. అలాగే కేటీఆర్ కూడా గ్రేట్ లీడర్. అందుకే రవితేజ పాత్రకి రామారావు అని పేరు పెట్టాను అని అన్నారు ‘రామారావు ఆన్ డ్యూటీ చిత్రం దర్శకుడు శరత్ మండవ. మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టెర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న తాజాగా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శరత్ మండవ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్'రామారావు ఆన్ డ్యూటీ' . ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్ గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఇందులో చాలా యునిక్ పాయింట్. ►చాలా యునిక్‌గా ఈ కథ ఉంటుంది. పాత్ బ్రేకింగ్ కథ అని చెప్పను కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని మాత్రం చెప్పగలను. రవితేజ గారి గత సినిమాల ఛాయలని రిపీట్ కాకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ►ఇందులో చాలా కీలకమైన సిఐ పాత్ర ఉంది. ఈ పాత్రకు ఎవరైతే బావుంటుదని ఆలోచిస్తున్నప్పుడు వేణు తొట్టెంపూడి స్ట్రయిక్ అయ్యారు. ఆయన సినిమాలు, వీడియోలు ఇప్పటికీ చాలా పాపులర్. సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ పాత్రకు ఆయన అయితే బావుంటుదని వెళ్లి ఆయన్ని కలిశాను. లక్కీగా ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. ఎమోషన్స్ ని అద్భుతంగా పడించే నటుడాయన. రామారావు ఆన్ డ్యూటీలో ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా రూపొందించాం. అందులో ఒక సంఘటన నా అనుభవంలో కూడా ఉంది. ► ఇందులో మాళిని పాత్రకు గ్లామర్ కంటే ఎమోషనల్ కోషియంట్ ఎక్కువ వుండే ఒక యునిక్ నటి కావాలనిపించింది. రజిషా విజయన్ ఆ పాత్రకు సరిగ్గా నప్పుతుందని అనిపించింది. మొదట ఆమె ఒప్పుకోలేదు. కథ పూర్తిగా చెప్పిన తర్వాత ఆమెకు చాలా నచ్చింది. చేసిన తర్వాత నా పాత్రకి సంబధించిన సీన్లు ఏమైనా డిలిట్ చేస్తారా అని అడిగింది. అలాంటిది ఏమీ ఉండదని హామీ ఇచ్చాను( నవ్వుతూ) ► నా వరకు కథ ఒక దేవాలయం లాంటింది. దానికంటూ ఒక నిర్మాణం ఉంటుంది. 'ఒక కథ రాసేటప్పుడు ఆ కథే తనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుని పూర్తి చెసుకుంటుంది. హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు, మంచి చెడు మాత్రం మన చేతిలో ఉంటుంది' అని దాసరిగారు చెప్పిన ఈ మాటలు లైఫ్ టైం పాటిస్తాను. నేను టీం వర్క్ ని నమ్ముతాను. ఈ చిత్రంలో అద్భుతమైన టీమ్ వర్క్ ఉంది. ► విక్రమ్ వేద లో సామ్ సిఎస్ వర్క్ అద్భుతంగా ఉంటుంది., ఖైదీ సినిమా చూసిన తర్వాత నే రవితేజ గారికి ఫోన్ చేసి సామ్ సిఎస్ ని అనుకుంటున్నాని చెప్పాను. రవితేజ గారికి కూడా సామ్ అంటే అప్పటికే గురి ఉంది. సామ్ ని ఇక్కడి పిలించి ప్రాజెక్ట్ గురించి చెప్పాను. మేము మొదట లాక్ చేసిన టెక్నిషియన్ సామ్ సిఎస్. ► ప్రస్తుతానికి రామారావు ఆన్ డ్యూటీకి సీక్వెల్ ఆలోచన లేదు. అయితే ఇది బర్నింగ్ ఇష్యూ. దిన్ని కంటిన్యూ చేద్దామని ఆసక్తితో ఎవరైనా వస్తే .,. నా ఆలోచనలు పంచుకోవడానికి రెడీగా వుంటాను. ► నా బలం ఏమిటో తెలీదు కానీ.,.నా బలహీనత తెలుసు. శేఖర్ కమ్ముల గారి లాంటి సినిమాలు చేయలేను. లైటర్ వెయిన్ ఎమోషన్స్ ని డీల్ చేయడం నా వరకూ కష్టం. యాక్షన్, థ్రిల్లర్స్ చేయగలను. ఒక ఫైట్ లేకుండా కూడా యాక్షన్ సినిమా చేయొచ్చు. రాజ్ కుమార్ హిరాణీ తరహాలో ఒక కథ రాసుకున్నా. రామారావు ఆన్ డ్యూటీ విడుదలైన తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా.