Ramarao On Duty Movie Review And Rating In Telugu | Ravi Teja | Divyansha Kaushik - Sakshi
Sakshi News home page

Ramarao On Duty Review: రామారావు ఆన్‌ డ్యూటీ రివ్యూ

Published Fri, Jul 29 2022 12:33 PM | Last Updated on Sat, Jul 30 2022 8:19 AM

Ramarao On Duty Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : రామారావు ఆన్‌ డ్యూటీ
నటీనటులు : రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి
దర్శకత్వం: శరత్‌ మండవ
సంగీతం : సామ్‌ సీఎస్‌
సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌
ఎడిటర్‌: ప్రవీణ్‌ కేఎల్‌
విడుదల తేది: జులై 29, 2022

Ramarao On Duty Movie Stills

మాస్ మహరాజా రవితేజ  సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. ‘క్రాక్‌’తర్వాత రవితేజ ఖాతాలో బిగ్‌ హిట్‌ పడిందే లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. తన స్టయిల్‌ని పక్కన పెట్టి, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో కూడిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమా చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌ చేయడంతో ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల ఈ శుక్రవారం(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామరావు ఆన్‌ డ్యూటీ’ని ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది?  ఈ సినిమా రవితేజను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం. 

Ramarao On Duty Photos

కథేంటంటే.. 
ఈ సినిమా కథంతా 1993-94 ప్రాంతంలో జరుగుతుంది. రామారావు(రవితేజ) ఓ సిన్సియర్‌ డిప్యూటీ కలెక్టర్‌. కొన్ని కారణాల వల్ల సస్పెండ్‌ అవుతాడు. కోర్టు తీర్పుతో చిత్తూరు జిల్లాలోని తన సొంత ప్రాంతానికి ఎమ్మార్వోగా నియమించబడతాడు. అక్కడి ప్రజలను సమస్యలను తనదైన స్టైల్లో తీర్చుతుంటాడు. తను ప్రేమించిన యువతి మాలిని(రజిషా విజయన్)భర్త సురేంద్ర అనుమానస్పదంగా మిస్‌ అయినట్లు తెలుసుకొని విచారణ మొదలు పెడతాడు.

Ramarao On Duty Movie Rating

రామారావు ఇన్వెస్టిగేషన్‌లో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సురేంద్ర మాదిరే ఆ ప్రాంతానికి చెందిన మరో 20 మంది మిస్‌ అయినట్లు తెలుస్తుంది. దీని వెనక గంధపు చెక్కల స్మగ్లింగ్‌ ఉన్నట్లు గుర్తిస్తాడు. అసలు గంధపు చెక్కల స్మగ్లింగ్‌కు ఈ 20 మందికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న గంధపు చెక్కల స్మగ్లింగ్‌ వెనుక ఎవరు ఉన్నారు?  ఒక ఎమ్మార్వోగా తనకు ఉన్న అధికారంతో రామారావు ఈ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో రామారావుకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Ramarao On Duty Movie Cast

ఎలా ఉందంటే..
1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ  సినిమాను తెరకెక్కించాడు శరత్‌ మండవ. ఇదొక ఎమోషనల్‌ ఇన్వెస్ట్ గేటివ్ యాక్షన్‌ థ్రిల్లర్ చిత్రం. సినిమా  ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. అడవిలో కప్పిపుచ్చిన ఓ శవం భారీ వర్షానికి బయటకు కనిపిస్తుంటే.. ఓ ముసలాయన ఆ శవం చేతులు నరికేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రామారావు ఎంట్రీ.. ఆయన గొప్పతనం, నిజాయితీ, వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్దత తదితర అంశాలను చూపిస్తూ.. హీరో ఎలివేషన్లకి ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఇక్కడ సినిమా కాస్త నెమ్మెదిగా సాగినట్లు అనిపిస్తుంది.

రామారావు మాజీ ప్రి​యురాలు మాలిని భర్త సురేంద్ర కేసు విచారణ చేపట్టినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఈ మిస్సింగ్ కేసుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధం ఉందని తెలుసుకోవడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. 

సెకండాఫ్‌ని కాస్త ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రామారావు తండ్రి(నాజర్‌) హత్య, దాని వెనక  ఓ గ్యాంగ్  ఉండడం తదితర అంశాలను ఇంట్రెస్టింగ్‌ చూపించాడు. అయితే కొన్ని రీపీటెడ్‌ సీన్స్‌ వల్ల సెకండాఫ్‌ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. పార్ట్‌ 2 కోసం దర్శకుడు కొన్ని సీన్లను కావాలనే యాడ్‌ చేశారనే ఫిలీంగ్‌ కలుగుతుంది. గంధపు స్మగ్లింగ్‌ మాఫియా లీడర్‌ విరాజ్‌తో రామారావు యుద్దం పార్ట్‌2లో ఉండబోతుంది.

Ravi Teja Ramarao On Duty Movie Review

ఎవరెలా చేశారంటే..
మాములుగా రవితేజ సినిమాలలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్‌ మ్యాన్‌ షో నడిచింది. ఎమ్మార్వో రామారావు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. పోలీసులకు మాత్రమే కాదు ఎమ్మార్వోకు కూడా ఇన్ని అధికారాలు ఉంటాయా? అనేలా ఆయన పాత్ర ఉంటుంది. రొమాన్స్‌(పాటలతో మాత్రమే)తో పాటు యాక్షన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వేణుతొట్టంపూడి ఎస్సైగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన పాత్రకి ఆయనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం కాస్త మైనస్‌. రామారావు భార్య నందిని పాత్రలో  దివ్యాంశ కౌశిక్‌ ఒదిగిపోయింది.

సాధారణ గృహిణిగా చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. రామారావు మాజీ ప్రియురాలు మాలినిగా రజిషా విజయన్ ఉన్నంతలో బాగానే నటించింది. కథని మలుపు తిప్పే పాత్ర ఆమెది. నాజర్‌, నరేశ్‌, ప్రగతి, రాహుల్‌ రామకృష్ణ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎటిటర్‌ ప్రవీణ్‌ కేఎల్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement