Ramarao On Duty Movie First Day Box Office Collection, Details Inside - Sakshi
Sakshi News home page

Ramarao On Duty Box Office Collection: రవితేజకు భారీ షాక్‌!

Jul 30 2022 3:34 PM | Updated on Jul 30 2022 3:49 PM

Ramarao On Duty Movie First Day Box Office Collection - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యువ దర్శకుడు శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది.దీంతో ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

(చదవండి:  ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ మూవీ రివ్యూ)

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం రూ.3.30 కోట్ల షేర్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో రూ.2.82 కోట్లను రాబట్టి..ఇటీవల కాలంలో రవితేజ కెరీర్‌లో ఫస్ట్‌డే అతి తక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. రవితేజ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే... ఖిలాడీ రూ. 4.30 కోట్లు, క్రాక్ రూ. 6.25, డిస్కో రాజా రూ.2.54 అమర్ అక్బర్ ఆంటోని రూ. 3.40 కోట్ల షేర్స్ అందుకున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘రామారావు ఆన్‌ డ్యూటీ’ తొలి రోజు కలెక్షన్స్‌..

► నైజాం - రూ.85 లక్షలు

► సీడెడ్ - రూ.52 లక్షలు

► ఈస్ట్ - రూ.31 లక్షలు

► వెస్ట్ - రూ.16 లక్షలు

► ఉత్త‌రాంధ్ర - రూ.45 లక్షలు

► గుంటూరు- రూ.24 లక్షలు

► కృష్ణా - రూ.17 లక్షలు

► నెల్లూరు - రూ.12 లక్షలు

► రెస్టాఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ - రూ.58 లక్షలు

 ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 3.30 కోట్ల షేర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement