Venu Thottempudi First Look From Ravi Teja Ramarao On Duty Movie, Goes Viral - Sakshi
Sakshi News home page

Venu Thottempudi: పోలీసు ఆఫీసర్‌గా వేణు తొట్టెంపూడి రీఎంట్రీ, ఖుషిలో ఫ్యాన్స్‌

Published Wed, Jul 6 2022 6:50 PM | Last Updated on Wed, Jul 6 2022 7:56 PM

Venu Thottempudi First Look From Ravi Teja Ramarao On Duty Movie - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో స్పీడ్‌ స్పీడ్‌గా షూటింగ్‌లను పూర్తి చేస్తూ సినిమాలు వీలైనంత త్వరగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్‌డేట్‌ బయటకు వస్తోంది. ఈ క్రమంలో రామారావు ఆన్‌డ్యూటీ మూవీ నుంచి ఓ అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్‌. ఇటీవల రిలీజైన సీసా సీసా అనే ఐటం సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు వేణు తొట్టెంపూడి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు.

చదవండి: సమంత ఇన్‌స్టాలో కేటీఆర్‌ పోస్ట్‌, షాక్‌లో ఫ్యాన్స్‌, సామ్‌ టీం క్లారిటీ

కాగా వేణు ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అతడు ఓ కీ రోల్‌ పోషించనున్నాడు. అయితే ఆయన పాత్రపై మాత్రం ఇప్పటి వరకు మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ. దీంతో తాజాగా వదిలిన వేణు ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే అతడు పోలీతసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరోగా స్యయం వరం, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వేణు అనంతరం సహా నటుడిగా మెప్పించాడు. ఇక చివరిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ దమ్ము, రామాచారి చిత్రాల్లో కనిపించిన ఆయన దాదాపు 11 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శ్రుతి? హీరోయిన్‌ క్లారిటీ

ఇప్పుడు మళ్లీ రామారావు ఆన్‌డ్యూటీ మూవీతో తన ఫ్యాన్స్‌ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి. శరత్‌ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో స‌ర్ప‌ట్టా ఫేం జాన్ విజ‌య్‌, చైత‌న్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర కీ రోల్స్‌ పోషిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం జులై 29న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement