మాస్ మహారాజ రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్‌డ్యూటీ రిలీజ్‌డేట్‌ను లాక్ చేశారు చిత్రయూనిట్ సభ్యులు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ గంభీరంగా కనిపిస్తున్నాడు. కాగా శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. రామారావు ఆన్‌డ్యూటీతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
Joining order issued for the Box Office Hunt 😎#RamaRaoOnDuty MASSive Release in theatres on June 17 💥💥#RamaRaoOnDutyOnJune17 @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @Cinemainmygenes @sathyaDP @sahisuresh @RTTeamWorks @SLVCinemasOffl pic.twitter.com/0ehI9Yu4gH
— SLV Cinemas (@SLVCinemasOffl) March 23, 2022
Comments
Please login to add a commentAdd a comment