Ravi Teja Fires On Rumours Over Clashes With Ramarao On Duty Producer - Sakshi
Sakshi News home page

Ravi Teja-Ramarao On Duty: నిర్మాతతో గొడవలు?.. క్లారిటీ ఇచ్చిన రవితేజ

Published Wed, Jul 20 2022 4:18 PM | Last Updated on Wed, Jul 20 2022 7:00 PM

Ravi Teja Fires On Rumours Over Clashes With Ramarao On Duty Producer - Sakshi

మాస్‌ మహారాజా తాజా చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ పలు వాయిదాల అనంతరం విడుదలకు సిద్ధమైంది. శరత్‌ మండవ దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది.  ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా రవితేజ, డైరెక్టర్‌ ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు. రామారావు ఆన్‌డ్యూటీ పదే పదే వాయిదా పడటంతో.. రెమ్యునరేషన్‌ విషయంలో రవితేజ చాలా ఖచ్చితంగా ఉన్నాడని, ఈ విషయంలో నిర్మాత సుధాకర్‌తో ఆయనకు గొడవలు జరిగాయంటూ పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజా ఇంటర్య్వూలో రవితేజకు దీనిపై ప్రశ్న ఎదురైంది.

చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

ఈ సందర్భంగా తనపై వస్తున్న పుకార్లపై రవితేజ అసహనం వ్యక్తం చేశాడు. రవితేజ మాట్లాడుతూ.. ఈ వార్తల్లో అసలు నిజం లేదన్నాడు. ‘ఈ సినిమాకు నేను కో-ప్రొడ్యుసర్‌గా చేశాను. అలాంటప్పుడు రెమ్యునరేషన్‌ విషయంలో ఎందుకు సమస్యలు వస్తాయి. కొంతమంది పని పాట లేని వారు ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిని అలాగే వదిలేద్దాం. ఇవేం నాకు కొత్త కాదు. ఇలాంటి పుకార్లను చూసి నవ్వుకుంటుంటాను. నిర్మాత సుధాకర్‌ నాకు మంచి స్నేహితుడు. ఆయన చాలా మంచి మనిషి. నాతోనే కాదు పరిశ్రమలో ఎవరితోను ఆయనకు గొడవలు, శత్రువులంటూ ఉండి ఉండరు. అంత మంచి వ్యక్తి ఆయన’ అంటూ పుకార్లకు చెక్‌ పెట్టాడు రవితేజ.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..

అంతేగాక  నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు... వారిచ్చిన చెక్ లను కూడా తాను చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అనంతరం డైరెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎన్నో పోస్టర్లు, బ్యాన్లు విడుదల చేశామని, అందులో రైట్‌ సైడ్‌ ఉన్న ఆర్‌టీ టీం వర్క్‌ అంటే రవితేజ అని అర్థం.. ఎడమ వైపు సుధాకర్‌ గారి బ్యానర్‌, కుడివైపు రవితేజ గారి బ్యానర్‌ అని చెప్పకొచ్చారు. ఇంతకంటే రుజువు కావాలా? అని ఇవి చూసిన కూడా రూమర్స్‌ ఎలా వస్తునాయంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి, సీనియర్‌ నటుడు నాజర్, నరేశ్, పవిత్ర లోకేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement